16, జనవరి 2025, గురువారం

Annadammula Anubandham : Aanadu Tholisari Song Lyrics (ఆనాడు తొలిసారి నిను చూసి )

చిత్రం : అన్నదమ్ముల అనుబంధం (1975)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: దాశరథి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

పల్లవి : 

ఆనాడు తొలిసారి నిను చూసి మురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను...
ఆనాడు తొలిసారి నిను చూసి మురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను..
ఐ లవ్ యు సోనీ... సోనీ...... ఐ లవ్ యు సోనీ... సోనీ 

చరణం 1 : 

అందాల నీమోము నా కోసమే...  నిండైన నా ప్రేమ నీ కోసమే
అందాల నీమోము నా కోసమే... నిండైన నా ప్రేమ నీ కోసమే
నా మీద ఈనాడు అలకేలనే...  నేరాలు మన్నించి రావేలనే.. ల.. ల.. లల.. ల.. ల
ఐ లవ్ యు సోనీ... సోనీ...... ఐ లవ్ యు సోనీ... సోనీ
వలచింది గెలిచింది నీవేనులే..  నీ ముందు ఓడింది నేనేనులే
వలచింది గెలిచింది నీవేనులే..  నీ ముందు ఓడింది నేనేనులే
కోపాలు తాపాలు మనకేలలే ఇక నైన జత జేరి గడపాలిలే... ల.. ల.. ల
ఐ లవ్ యు రాజా...  రాజా...  ఐ లవ్ యు రాజా...  రాజా  

చరణం 2 :

చిన్నారి సిరిమల్లె విరిసిందిలే... అనురాగ మధువెంతో కురిసిందిలే
చిన్నారి సిరిమల్లె విరిసిందిలే... అనురాగ మధువెంతో కురిసిందిలే
అధరాలు ఏమేమొ వెతికేనులే... హృదయాలు పెనవేసి ఊగేనులే    ల   ల  లా        
 ఐ లవ్ యు రాజా...  రాజా...  ఐ లవ్ యు  సోనీ... సోనీ
ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను...
ఐ లవ్ యు రాజా...  రాజా...  ఐ లవ్ యు  సోనీ... సోనీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి