చిత్రం : అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
పల్లవి :
కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కలసి వూగాలిలే... కరిగిపోవాలిలే.. తనివి తీరాలిలే
కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కలసి వూగాలిలే... కరిగిపోవాలిలే.. తనివి తీరాలిలే
చరణం 1 :
నీ బుగ్గలఫై ఆ ఎరుపు..
నీ పెదవులఫై ఆ మెరుపు
వెలుతురులో.. చీకటిలో..
వెలిగిపోయేనులే.. హే హే.. నన్ను కోరేనులే
నా పెదవుల ఫై యీ పిలుపు.. హో హో..
నా హృదయములో నీ తలపు.. హ హ
వెలుతురులో.. చీకటిలో.. వెలుతురులో
చీకటిలో నిలిచి వుండేనులే... నిన్ను కోరేనులే
కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కలసి వూగాలిలే... కరిగిపోవాలిలే.. తనివి తీరాలిలే
చరణం 2 :
గులాబీలా విరబూసే నీ సొగసు... సెలయేరై చెలరేగేనీ వయసు
అందరిలో ఎందుకనో ఆశ రేపేనులే అల్లరి చేసేనులే
కసిగా కవ్వించే నీ చూపు... జతగా కదిలించే నీ వూపు
రేయైనా.. పగలైనా.. రేయైనా.. పగలైనా...
నన్ను మురిపించులే... మేను మరిపించులే
కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కలసి వూగాలిలే... కరిగిపోవాలిలే... తనివి తీరాలిలే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి