చిత్రం : అన్నదమ్ముల సవాల్ (1978)
సంగీతం: సత్యం
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
పల్లవి:
హ్మ్మ్.. హ్మ్మ్.. లాలలాల..హేహే..జుజుజుజు..
పపపప్ప్పప..పపపా..పపాప్పా
పపపప్ప్పప..పపపా..పపాప్పా
ష్...
నిన్న రాత్రి మెరుపులు..ఉరుములు.. వాన.. చలి
ఒంటరిగా చెట్టుకింద నిల్చున్నాను
ఎవరో భుజం మీద చెయ్యి ఏశారు.. దగ్గరగా లాకున్నాడు
తిరిగి చూశాను.. అతనే..అతనే..అతనే
ఓ పిల్లా చలి చలిగా ఉందే.. నిన్ను చూస్తుంటే కసి కసిగా ఉందే
కొంటె కోరికా జంట కావాలన్నదే..
చరణం 1 :
ఆ తరవాతా..
ష్...
కళ్ళు చెదరిపోయాయి.. ఒళ్ళు బెదిరిపోయింది
పెదవులు వణికాయి... గుండె దడదడలాడింది
అతను నన్ను బలవంతంగా ఏదో చేయబోయాడు
వద్దు.. వద్దు... వద్దు..
తడిసిన నీ ఒళ్ళు.. మెరిసే నీ కళ్ళు
నాలో రేపెను గిలిగింతలేవో...
ముందర నువ్వుంటే.. తొందర పెడుతుంటే
మదిలో మెదిలే పులకింతలెన్నో
ముందున్నది.. విందున్నది అందాల ఈ రేయి
ఓ పిల్లా చలి చలిగా ఉందే.. నిన్ను చూస్తుంటే కసి కసిగా ఉందే
కొంటె కోరికా జంట కావాలన్నదే..
చరణం 2 :
ఆ తరవాత
అతను నా నడుమ్మీద చేయ్ ఏశాడు.. తన కౌగిట్లో బంధించాడు..
నేను విలవిలలాడిపోయాను.. ఉక్కిరిబిక్కిరి అయ్యాను..
అయ్యో..అయ్యో...అయ్యో...
మిసమిసలాడేటి బుగ్గలు చూశానే... ముద్దులు ఇవ్వక వదిలేది లేదే
మధువులు చిందేటి పెదవులు చూశానే.. తేనెలు దోచాక కదిలేది లేదే
రా ముందుకు.. నా చెంతకు.. ఇంకెందుకే సిగ్గు?
ఓ పిల్లా చలి చలిగా ఉందే.. నిన్ను చూస్తుంటే కసి కసిగా ఉందే
కొంటె కోరికా జంట కావాలన్నదే..
ఇదంతా నిజమనుకుంటున్నారా...ఊహు..వట్టి కల...
it was a sweet dream.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి