Annadammula Savaal లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Annadammula Savaal లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జనవరి 2025, గురువారం

Annadammula Savaal : Oo Pilla Chali Chaliga Song Lyrics ( ఓ పిల్లా చలి చలిగా ఉందే)

చిత్రం : అన్నదమ్ముల సవాల్ (1978)

సంగీతం: సత్యం

సాహిత్యం: దాశరథి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల



పల్లవి: 

హ్మ్మ్.. హ్మ్మ్.. లాలలాల..హేహే..జుజుజుజు..
పపపప్ప్పప..పపపా..పపాప్పా
పపపప్ప్పప..పపపా..పపాప్పా
ష్...
నిన్న రాత్రి మెరుపులు..ఉరుములు.. వాన.. చలి
ఒంటరిగా చెట్టుకింద నిల్చున్నాను
ఎవరో భుజం మీద చెయ్యి ఏశారు.. దగ్గరగా లాకున్నాడు
తిరిగి చూశాను.. అతనే..అతనే..అతనే
ఓ పిల్లా చలి చలిగా ఉందే.. నిన్ను చూస్తుంటే కసి కసిగా ఉందే
కొంటె కోరికా జంట కావాలన్నదే..

చరణం 1 :

ఆ తరవాతా..
ష్...
కళ్ళు చెదరిపోయాయి.. ఒళ్ళు బెదిరిపోయింది
పెదవులు వణికాయి... గుండె దడదడలాడింది
అతను నన్ను బలవంతంగా ఏదో చేయబోయాడు
వద్దు.. వద్దు... వద్దు.. 
తడిసిన నీ ఒళ్ళు.. మెరిసే నీ కళ్ళు
నాలో రేపెను గిలిగింతలేవో...
ముందర నువ్వుంటే.. తొందర పెడుతుంటే
మదిలో మెదిలే పులకింతలెన్నో
ముందున్నది.. విందున్నది అందాల ఈ రేయి
ఓ పిల్లా చలి చలిగా ఉందే.. నిన్ను చూస్తుంటే కసి కసిగా ఉందే
కొంటె కోరికా జంట కావాలన్నదే..

చరణం 2 :

ఆ తరవాత
అతను నా నడుమ్మీద చేయ్ ఏశాడు.. తన కౌగిట్లో బంధించాడు..
నేను విలవిలలాడిపోయాను.. ఉక్కిరిబిక్కిరి అయ్యాను..
అయ్యో..అయ్యో...అయ్యో...
మిసమిసలాడేటి బుగ్గలు చూశానే... ముద్దులు ఇవ్వక వదిలేది లేదే
మధువులు చిందేటి పెదవులు చూశానే.. తేనెలు దోచాక కదిలేది లేదే
రా ముందుకు.. నా చెంతకు.. ఇంకెందుకే సిగ్గు?
ఓ పిల్లా చలి చలిగా ఉందే.. నిన్ను చూస్తుంటే కసి కసిగా ఉందే
కొంటె కోరికా జంట కావాలన్నదే..
ఇదంతా నిజమనుకుంటున్నారా...ఊహు..వట్టి కల...
 it was a sweet dream. 

Annadammula Savaal : Nerpamantavaa Song Lyrics (నేర్పమంటావా.. నువ్వూ నేర్చుకుంటావా )

చిత్రం : అన్నదమ్ముల సవాల్ (1978)

సంగీతం: సత్యం

సాహిత్యం: సి.నారాయణరెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల



పల్లవి: 

నేర్పమంటావా.. నువ్వూ నేర్చుకుంటావా 
ఆఁ.. 
నేర్పమంటావా.. సరిగమ నేర్చుకుంటావా 
ఓ.. 
నేర్చుకుంటే సరే సరి.. లేకపోతే రామాహరి 
స..స.. రి..రి.. గ..గ.. మ..మ.. 
సరిగమ.. పమగరి 
సరిగమపద.. 
నీ పని సరి.. 
నేర్పమంటావా.. సరిగమ నేర్చుకుంటావా.. 

చరణం 1: 

పెట్టిస్తా ఇప్పుడే ముహూర్తం.. 
ఆఁ.. 
నా పస ఏదో చూపిస్తా బంగారం 
అబ్బో.. 
ఆ..పెట్టిస్తా ఇప్పుడే ముహూర్తం.. 
ఊఁహూఁ.. 
నా పస ఏదో చూపిస్తా బంగారం 
అహహహహా.. 
అల్లాటప్పా వాణ్ణి కాను అనుకుంటే ఆగను 
అల్లాటప్పా వాణ్ణి కాను అనుకుంటే ఆగను 
నా పేరే.. అసలూ.. రామలింగడూ.. 
దేవుడికైనా వీడు లొంగడు.. లొంగడు.. లొంగడు 
స..స.. రి..రి.. గ..గ.. మ..మ.. 
మామ పని సరి.. నీ పని సరి 
తాని పని సరి 
నేర్పమంటావా సరిగమ నేర్చుకుంటావా 
నేర్పమంటావా సరిగమ నేర్చుకుంటావా 

చరణం 2: 

తల నెరిసిన వాళ్ళకేల వయ్యారాలూ.. 
ఆయ్.. 
కుర్రాళ్ళక్కావాలీ సరదాలూ.. 
నే ముసలాడ్నా? 
తల నెరిసిన వాళ్ళకేల వయ్యారాలూ.. కుర్రాళ్ళక్కావాలీ సరదాలూ 
అవునూ.. 
షోకులేని వాడికి.. చతికిలపడ్డాడికి 
షోకులేని వాడికి.. చతికిలపడ్డాడికి 
ఆటపాటలెందుకోయి ఓ మామా.. 
ఏవిట్రోయ్.. 
అవునో కాదో చెప్పు ఓ భామా.. 
అహహహహా.. 
స..స.. రి..రి.. గ..గ.. మ..మ.. 
మామ పని సరి.. నీ పని సరి 
తాని సరి సరి 
ఆ.. నేర్పమంటావా సరిగమ నేర్చుకుంటావా 
నేర్చుకుంటే సరే సరి.. లేకపోతే రామాహరి 
నేర్పమంటావా సరిగమ నేర్చుకుంటావా.. కుంటావా 

చరణం 3: 

పూటకొక్క కోణ్ణి నే భోంచేస్తానూ 
అబ్బో.. 
గావుపట్టి ఫలహారం దంచేస్తానూ.. 
పట్టుబడితే వదలనూ.. మాటలతో కదలనూ 
దొంగకోళ్ళు తినే ఈ బుస్కుడూ.. 
ఒరేయ్.. 
అబ్బో మహా చెప్పొచ్చాడు లస్కుడూ.. లస్కుడు..

Annadammula Savaal : Guvva Goodekke Song Lyrics (గువ్వగూడెక్కే.)

చిత్రం : అన్నదమ్ముల సవాల్ (1978)

సంగీతం: సత్యం

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల



పల్లవి: 

అరెరెరే.. గువ్వగూడెక్కే.. రాజు వేడెక్కే.. కళ్ళు కైపెక్కే.. ఒళ్ళు వేడెక్కే 
దిగి వస్తే చిన్నదానా... నీ సొగసంతా దోచుకోనా 
హే దిగి వస్తే చిన్నదానా... నీ సొగసంతా దోచుకోనా 
గువ్వగూడెక్కే.. రాజు వేడెక్కే.. కళ్ళు కైపెక్కే..వళ్ళు వేడెక్కే 
ఎగిరొస్తే అందగాడా.. నే సగమిస్తా సందెకాడా 
హేయ్.. ఎగిరొస్తే అందగాడా.. నే సగమిస్తా సందెకాడా 

చరణం 1: 

పడుచు పరపు నలగనన్నదీ.. నా పక్కన నువ్వులేకా.. 
మగ సెగలే రగులుతున్నవీ.. నీ ఆడ గాలి నన్ను తాకా.. 
ముద్దులేదు పొద్దులు పోకా.. 
నీవు రాకా నిద్దుర రాకా .. హా 
ముద్దులేదు పొద్దులు పోకా.. 
నీవు రాకా నిద్దుర రాకా... 
కరిగింది కంటి కాటుకా.. ఆ... 
గువ్వగూడెక్కే.. రాజు వేడెక్కే.. కళ్ళు కైపెక్కే.. ఒళ్ళు వేడెక్కే 
ఎగిరొస్తే అందగాడా.. నే సగమిస్తా సందెకాడా 
ఆహాహాహా.. దిగి వస్తే చిన్నదానా... నీ సొగసంతా దోచుకోనా 

చరణం 2: 

పెదవులు తడి ఆరుతున్నవీ.. నీ పెదవులతో ఎంగిలి పడకా.. 
వయసు మిడిసి పడుతు ఉన్నదీ.. నువ్వు ఒడిసి పట్టు ఒడుపే లేకా.. 
హేయ్.. రేగితే ఆగదు తిక్కా.. 
మబ్బు మీద వెయ్నా పక్కా 
రేగితే ఆగదు తిక్కా.. 
మబ్బు మీద వెయ్నా పక్కా 
రగిలింది కొంటె కోరికా.. ఆ.. హా 

గువ్వగూడెక్కే.. రాజు వేడెక్కే.. కళ్ళు కైపెక్కే.. ఒళ్ళు వేడెక్కే 
దిగి వస్తే చిన్నదానా... నీ సొగసంతా దోచుకోనా 
హేయ్.. ఎగిరొస్తే అందగాడా.. నే సగమిస్తా సందెకాడా

18, మార్చి 2024, సోమవారం

Annadammula Savaal : Nee Roopame Song Lyrics (నీ రూపమే)

చిత్రం : అన్నదమ్ముల సవాల్ (1978)

సంగీతం: సత్యం

సాహిత్యం: సి.నారాయణరెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల


పల్లవి: నీ రూపమే..ఏ..ఏ..నా మదిలోన తొలి దీపమే.. మన అనుబంధమెన్ని జన్మలదో.. ఇది అపురూపమే.. నీ రూపమే...ఏ..ఏ...నా మదిలోన తొలి దీపమే.. మన అనుబంధమెన్నెన్ని జన్మలదో..ఇది అపురూపమే నీ రూపమే..ఏ..ఏ.. చరణం 1: ఆశలు లేని నా గుండెలోన...అమృతము కురిసిందిలే..ఏ.. వెన్నెల లేని నా జీవితాన...పున్నమి విరిసిందిలే...ఏ.. నీవూ నేనూ తోడూ నీడై... నీవూ నేనూ తోడూ నీడై...వీడక వుందాములే.. ఏ ఏ . .. వీడక వుందాములే ...ఏ.. నీ రూపమే...ఏ..ఏ...నా మదిలోన తొలి దీపమే.. మన అనుబంధమెన్నెన్ని జన్మలదో...ఇది అపురూపమే... నీ రూపమే...ఏ.... చరణం 2: లేతలేత హృదయంలో...వలపు దాచి వుంటాను నా వలపు నీకే సొంతమూ... నిన్ను చూచి మురిశాను...నన్ను నేను మరిచాను ... నీ పొందు ఎంతో అందమూ .. ఏ పూర్వ పుణ్యమో..ఏ దేవి దీవెనో .. ఏ పూర్వ పుణ్యమో..ఏ దేవి దీవెనో... వేసెను విడరాని బంధమూ... వేసెను విడరాని బంధమూ... నీ రూపమే..ఏ..ఏ..నా మదిలోన తొలి దీపమే.. మన అనుబంధమెన్ని జన్మాలదో..ఇది అపురూపమే ..ఏ.. నీ రూపమే...ఏ..

Annadammula Savaal : Naakosame Neevunnadhi Song Lyrics (నాకోసమే నీవున్నదీ దీ దీ)

చిత్రం : అన్నదమ్ముల సవాల్ (1978)

సంగీతం: సత్యం

సాహిత్యం: సి.నారాయణరెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



పల్లవి: హేయ్.. నా కోసమే నీవున్నది..ది..ది..ది.. ఆకాశమే ...హ...ఔనన్నది..ది...ది...ది.. మౌనం వద్దు... ఒక మాటైన ముద్దు హాయ్ మతిపోతున్నది..ఈ...ఈ...ఈ... నా కోసమే నీవున్నది..ది..ది..ది.. ఆకాశమే ...హ...ఔనన్నది..ది...ది...ది.. మౌనం వద్దు... ఒక మాటైన ముద్దు హాయ్ మతిపోతున్నది..ఈ...ఈ...ఈ... చరణం 1: హ..హ్హ..అడుగు వేయకు రాజహంసలే అదిరిపోయేనులే తిరిగి చూడకు పడుచుగుండెలే చెదిరిపోయేనులే ఆ..హ హ.అడుగు వేయకు రాజ హంసలే అదిరిపోయేనులే తిరిగి చూడకు పడుచుగుండెలే చెదిరిపోయేనులే.. వెచ్చని కోరిక నాలో మెరిసీ ...విసిరేస్తున్నదీ..ఈ..ఈ... నా కోసమే నీవున్నది ..ది..ది...ది.. ఆకాశమే ఔనన్నది..ది...ది..ది.. చరణం 2: మొదట చూపిన మూతి విరుపులు...తుదకు ఏమాయనే...హ.. అలక తొణకగా చినుకు చినుకుగా...వలపు జల్లాయనే మొదట చూపిన మూతి విరుపులు...తుదకు ఏమాయనే అలక తొణకగా చినుకు చినుకుగా...వలపు జల్లాయనే ఆ జల్లున తడిసిన అల్లరి వయసే...జత నీవన్నదీ..హ... నా కోసమే నీవున్నది..ది..ది..ది.. ఆకాశమే ఔనన్నదీ..ది..ది..ది.. మౌనం వద్దు... ఒక మాటైన ముద్దు హాయ్ మతిపోతున్నదీ...ఈ..ఈ..ఈ..ఈ..హహ..హా...