13, జనవరి 2025, సోమవారం

Annamayya : Kondalalo Nelakonna Song Lyrics (కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు)

చిత్రం: అన్నమయ్య(1997)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

రచన: అన్నమయ్య కీర్తన

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



పల్లవి :

కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు

చరణం 1 :

కుమ్మర దాసుఁడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాఁడు
కుమ్మర దాసుఁడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాఁడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం జక్కురవర్తి
దొమ్ములు సేసినయట్టి తొండమాం జక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాఁడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం జక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాఁడు

కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు


చరణం 2 :

కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు...
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు

కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి