Annamayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Annamayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జనవరి 2022, మంగళవారం

Annamayya : Telugu Padaniki Song Lyrics ( తెలుగు పదానికి)

చిత్రం: అన్నమయ్య(1997)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,సుజాత, రేణుక

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి ఙానపదం ఏడు స్వరాలే ఏడుకొండలై వెలసిన కలియుగ విష్ణుపదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినది శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై దివ్యసభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి నీరద మండల నారద తుంబుర మహతీగానపు మహిమలు తెలిసి శితహిమకందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించే ఆ నందకము నందనానందకారకము పద్మావతియే పురుడుపోయగా పద్మాసనుడే ఉసురుపోయగా విష్ణుతేజమై నాదబీజమై ఆంధ్రసాహితీ అమరకోశమై అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయా పాపడుగా నట్టింటపాకుతూ భాగవతము చేపట్టెనయా హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా తెలుగుభారతికి వెలుగుభారతై ఎదలయలో పదకవితలు కలయా తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ 

తమసోమా జ్యోతిర్గమయా 

Annamayya : Brahmam Okate Song Lyrics ( బ్రహ్మమొక్కటే)

చిత్రం: అన్నమయ్య(1997)

రచన: అన్నమయ్య కీర్తన

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా హరినామమే కడు ఆనందకరము రంగా... రంగా... రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తఱచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తఱచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ వేదములు నుతింపగ వేడుకలు దైవారగా ఆదరించి దాసుల మోహన నారసింహుడు.. మోహన నారసింహుడు.. మోహన నారసింహుడూ… కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండా.. తిరుమల కొండా కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయ మహిమలే … తిరుమల కొండా… తిరుమల కొండా… తిరుమల కొండా… తిరుమల కొండా… బ్రహ్మమొక్కటే.. పర బ్రహ్మమొక్కటే... బ్రహ్మమొక్కటే.. పర బ్రహ్మమొక్కటే... పర బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనాన అహి - తందనాన పురె తందనాన భళా తందనాన పర బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే భళా తందనాన భళా తందనాన నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే అండనే బంటునిద్ర అదియు నొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే చండాలుడుండేటి సరిభూమి యొకటే బ్రహ్మమొక్కటే.. పర బ్రహ్మమొక్కటే... పర బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే కడగి యేనుగు మీద కాయు యెండొకటే పుడమి శునకము మీద పొలయు యెండొకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటే బ్రహ్మమొక్కటే.. పర బ్రహ్మమొక్కటే... పర బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనాన అహి - తందనాన పురె తందనాన భళా తందనాన పర బ్రహ్మమొక్కటే భళా తందనాన పరబ్రహ్మమొక్కటే భళా తందనాన పర బ్రహ్మమొక్కటే భళా తందనాన పరబ్రహ్మమొక్కటే భళా తందనాన

Annamayya : Podagantimayya Song Lyrics (పురుషోత్తమా. పురుషోత్తమా)

చిత్రం: అన్నమయ్య(1997)

రచన: అన్నమయ్య కీర్తన

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పురుషోత్తమా. పురుషోత్తమా.. పురుషోత్తమా... పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.. మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా... మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.... కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా. గారవించి దప్పిదీర్చు కాలమేఘమా.. గారవించి దప్పిదీర్చు కాలమేఘమా... మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా ! పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా.. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా... చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వేంకటేశాయ.. ఓం నమో వేంకటేశాయ... చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా. బడిబాయక తిరిగే ప్రాణబంధుడా.. బడిబాయక తిరిగే ప్రాణబంధుడా.... మమ్ము గడియించినట్టి శ్రీవేంకటనాధుడా ! పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా... పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా... పురుషోత్తమా. పురుషోత్తమా.. పురుషోత్తమా...

Annamayya : Vinnapalu Vinavale Song Lyrics (విన్నపాలు వినవలె)

చిత్రం: అన్నమయ్య(1997)

రచన: అన్నమయ్య కీర్తన

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రేణుక, శ్రీలేఖ

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



విన్నపాలు వినవలె వింతవింతలు

విన్నపాలు వినవలె వింతవింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేళయ్యా విన్నపాలు వినవలె వింతవింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేళయ్యా విన్నపాలు వినవలె వింతవింతలు కంటి శుక్రవారము ఘడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని

కంటి శుక్రవారము ఘడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని కంటి...!! పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లికూతురు

పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లికూతురు పేరుగల జవరాలీ పెండ్లికూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లికూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు విభు పేరుగుచ్చ సిగ్గుబడి పెండ్లికూతురు

పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు విభు పేరుగుచ్చ సిగ్గుబడి పెండ్లికూతురు అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు సేసెనీ ఉయ్యాల

అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు సేసెనీ ఉయ్యాల పలుమారు ఉఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల

నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల ఉయ్యాలా....ఉయ్యాలా

ఉయ్యాలా....ఉయ్యాలా

Annamayya : Nigama Nigamantha Song Lyrics (నిగమ నిగమాంత)

చిత్రం: అన్నమయ్య(1997)

రచన: అన్నమయ్య కీర్తన

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ నీస గస గస గస గసగ దనిసగమగసగమగ సనిదస నీసాద సగమ గమగ మదని దనిస మగస నిదమగస వివిధ నిర్భందముల వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే హరే హరే దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీతచోర శ్రీ నారాయణ నిగమ సగమగసనిదమగని నిగమ గసమగదమనిదస నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ హరే కలియుగ నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ హరే లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ హరే హరే

Annamayya : Adhivo Alladivo Song Lyrics (అదివో అల్లదివో)

చిత్రం: అన్నమయ్య(1997)

రచన: అన్నమయ్య కీర్తన

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


అదివో అల్లదివో శ్రీ హరి వాసము పదివేల శేషుల పడగల మయము || అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము | అదివో నిత్యనివాస మఖిల మునులకు అదె చూడు డదె మొక్కు డానందమయము || చెంగట నదివో శేషాచలమూ నింగి నున్న దేవతల నిజవాసము | ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము || కైవల్య పదము వేంకట నగ మదివో శ్రీ వేంకటపతికి సిరులైనది | భావింప సకల సంపద రూపమదివో పావనముల కెల్ల పావన మయమూ |