15, జనవరి 2025, బుధవారం

Antha Mana Manchike : Neevera Naa Madilo Song Lyrics (నీవేరా నా మదిలో)

చిత్రం: అంతా మన మంచికే (1972)

సాహిత్యం: దాశరథి

గానం: భానుమతి

సంగీతం: సత్యం


పల్లవి :
నీవేరా నా మదిలో.. నీవేరా నా మదిలో దేవా
తిరుమలవాసా.. ఓ శ్రీనివాసా.. నీ పదదాసిని నేనేరా....
నీవేరా నా మదిలో.. దేవా తిరుమలవాసా.. ఓ శ్రీనివాసా.. నీ పదదాసిని నేనేరా...
నీవేరా నా మదిలో... నీవేరా నా మదిలో చరణం 1 : ఎంతో మధురం నీ శుభనామం.. జగతికి దీపం నీ దివ్యరూపం
ఎంతో మధురం నీ శుభనామం.. జగతికి దీపం నీ దివ్యరూపం
ఆశల పూలే దోసిట నింపి వేచే భాగ్యము నాదే..
వేచే భాగ్యము.. నాదేరా.... నీవేరా నా మదిలో.. నీవేరా నా మదిలో
గమ ప ప గమ గ గ గమ నీ నీ నీ
ఆ ఆ ఆ ఆ ఆ హా హా ఆ ఆ ఆ ఆ చరణం 2 : నీ మెడలోన కాంతులు చిందే కాంచన హారము కాలేను నేను
నీ మెడలోన కాంతులు చిందే కాంచన హారము కాలేను నేను
నీ పదములపై వాలిన సుమమై నిలిచే భాగ్యము..
నా నిలిచే భాగ్యము నాదేరా.....
నీవేరా నా మదిలో... నీవేరా నా మదిలో
గమ ప ప గమ గ గ గమ నీ నీ నీ
ఆ ఆ ఆ ఆ ఆ హా హా ఆ ఆ ఆ ఆ చరణం 3 : నా జీవితమే హారతి చేసి.. నీ గుడి వాకిట నిలిచాను స్వామీ
నా జీవతమే హారతి చేసి.. నీ గుడి వాకిట నిలిచాను స్వామీ
నీ సన్నిథియే నా పెన్నిధిగా మురిసే భాగ్యము నాదే..
మురిసే భాగ్యము నాదేరా..... నీవేరా నా మదిలో దేవా.. తిరుమలవాసా.. ఓ శ్రీనివాసా.. నీ పదదాసిని నేనేరా
నీవేరా నా మదిలో... నీవేరా నా మదిలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి