Antha Mana Manchike లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Antha Mana Manchike లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జనవరి 2025, బుధవారం

Antha Mana Manchike : Nene Radhanoyi Song Lyrics (నేనె రాధనోయి గోపాలా)

చిత్రం: అంతా మన మంచికే (1972)

సాహిత్యం: దాశరథి

గానం: భానుమతి

సంగీతం: సత్యం


పల్లవి: ఆ...
ఆ...
నేనె రాధనోయి గోపాలా
నేనె రాధనోయి గోపాలా
నేనె రాధనోయీ అందమైన ఈ బృందావనిలో
నేనె రాధనోయీ అందమైన ఈ బృందావనిలో
నేనె రాధనోయీ గోపాలా నేనె రాధనోయి చరణం 1: విరిసిన పున్నమి వెన్నెలలో
చల్లని యమునా తీరములో
విరిసిన పున్నమి వెన్నెలలో
చల్లని యమునా తీరములో
నీ పెదవులపై వేణుగానమై
నీ పెదవులపై వేణుగానమై పొంగిపోదురా నేనీ వేళా
పొంగిపోదురా నే..నీ వేళా చరణం 2: ఆడే పొన్నల నీడలలో
నీ మృదుపదముల జాడలలో
ఆడే పొన్నల నీడలలో
నీ మృదుపదముల జాడలలో
నేనే నీవై...నీవే నేనై..
కృష్ణా....ఆ....ఆ...ఆ...
నేనే నీవై నీవే నేనై
అనుసరింతురా నేనీవేళా
అనుసరింతురా నేనీవేళా
నేనె రాధనోయి గోపాలా నేనె రాధనోయి
ఆ...ఆ...ఆ..ఆ.. నేనె రాధనోయి
ఆ..ఆ...ఆ...ఆ...ఆ... నేనె రాధనోయి
ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ....... నేనె రాధనోయి
ఆ..ఆ..ఆ..ఆ...ఆ...........నేనె రాధనోయి గోపాలా
నేనె రాధనోయి
నేనె రాధనోయి
నేనె రాధనోయి...ఈ...ఈ



Antha Mana Manchike : Maata Chaladaa Song Lyrics (మాట చాలదా..)

చిత్రం: అంతా మన మంచికే (1972)

సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం: సత్యం



పల్లవి :
మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా.. మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత తిలియదా.. దిక్కులు వినగా.. చుక్కలు కనగా
ఆ.. దిక్కులు వినగా.. చుక్కలు కనగా
పక్కన పలికే.. మక్కువ ఒలికే... మాట చాలదా...
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత తిలియదా.. చరణం 1: తోటలో పువుచెవిలో తుమ్మెద ఊదేదీ
గూటిలో ప్రియునితో గోరింక అనేదీ
తోటలో పువుచెవిలో తుమ్మెద ఊదేదీ
గూటిలో ప్రియునితో గోరింక అనేదీ...
కన్నులలోనా..
ఊఁఊఁఊఁ..
నవ్వులలోనా..
ఉహూఁ..
కన్నులలోనా నవ్వులలోనా.. ఒదిగీ దాగే మధుర రహస్యం
ఊఁహుహూఁహుహూఁ.. మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత తిలియదా.. చరణం 2 : ఒకరికి నా గుండెలో ఎప్పుడూ వసతీ
ఒక్కరే నా ప్రేమకు ఏనాటికి అతిథీ
ఒకరికే నా గుండెలో ఎప్పుడూ వసతీ
ఒక్కరే నా ప్రేమకు ఏ నాటికి అతిథీ
పదిలముగా నా..
ఊఁఊఁఊఁ..
హృదయములోనా..
ఉహూఁ..
పదిలముగా నా హృదయములోనా.. ఒదిగీ దాగే మధుర రహస్యం
ఊఁహుహూఁహుహూఁ.. మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత తిలియదా.. ఊఁహుహూఁహుహూఁ.. ఊఁహుహూఁహుహూఁ..
ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుహూఁహుహూఁ..
ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుహూఁహుహూఁ..

Antha Mana Manchike : Neevera Naa Madilo Song Lyrics (నీవేరా నా మదిలో)

చిత్రం: అంతా మన మంచికే (1972)

సాహిత్యం: దాశరథి

గానం: భానుమతి

సంగీతం: సత్యం


పల్లవి :
నీవేరా నా మదిలో.. నీవేరా నా మదిలో దేవా
తిరుమలవాసా.. ఓ శ్రీనివాసా.. నీ పదదాసిని నేనేరా....
నీవేరా నా మదిలో.. దేవా తిరుమలవాసా.. ఓ శ్రీనివాసా.. నీ పదదాసిని నేనేరా...
నీవేరా నా మదిలో... నీవేరా నా మదిలో చరణం 1 : ఎంతో మధురం నీ శుభనామం.. జగతికి దీపం నీ దివ్యరూపం
ఎంతో మధురం నీ శుభనామం.. జగతికి దీపం నీ దివ్యరూపం
ఆశల పూలే దోసిట నింపి వేచే భాగ్యము నాదే..
వేచే భాగ్యము.. నాదేరా.... నీవేరా నా మదిలో.. నీవేరా నా మదిలో
గమ ప ప గమ గ గ గమ నీ నీ నీ
ఆ ఆ ఆ ఆ ఆ హా హా ఆ ఆ ఆ ఆ చరణం 2 : నీ మెడలోన కాంతులు చిందే కాంచన హారము కాలేను నేను
నీ మెడలోన కాంతులు చిందే కాంచన హారము కాలేను నేను
నీ పదములపై వాలిన సుమమై నిలిచే భాగ్యము..
నా నిలిచే భాగ్యము నాదేరా.....
నీవేరా నా మదిలో... నీవేరా నా మదిలో
గమ ప ప గమ గ గ గమ నీ నీ నీ
ఆ ఆ ఆ ఆ ఆ హా హా ఆ ఆ ఆ ఆ చరణం 3 : నా జీవితమే హారతి చేసి.. నీ గుడి వాకిట నిలిచాను స్వామీ
నా జీవతమే హారతి చేసి.. నీ గుడి వాకిట నిలిచాను స్వామీ
నీ సన్నిథియే నా పెన్నిధిగా మురిసే భాగ్యము నాదే..
మురిసే భాగ్యము నాదేరా..... నీవేరా నా మదిలో దేవా.. తిరుమలవాసా.. ఓ శ్రీనివాసా.. నీ పదదాసిని నేనేరా
నీవేరా నా మదిలో... నీవేరా నా మదిలో

Antha Mana Manchike : Sarigama Paata Paadali Song Lyrics (స రి గ మ ప పాట పాడాలి..)

చిత్రం: అంతా మన మంచికే (1972)

సాహిత్యం: ఆరుద్ర

గానం: భానుమతి

సంగీతం: సత్యం



పల్లవి :

స రి గ మ ప పాట పాడాలి.. పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి
స రి గ మ ప పాట పాడాలి.. పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి చరణం 1 :
పాటలె పూవుల బాట వెయ్యాలి.. పాటలె పూవుల బాట వెయ్యాలి
ఆ బాటలో సూటిగ సాగిపోవాలి.. ఆ బాటలో సూటిగ సాగిపోవాలి
పాటలె పూవుల బాట వెయ్యాలి.. ఆ బాటలో సూటిగ సాగిపోవాలి
శృతిలో కలవాలి.. జతగా మెలగాలి.. అంతా ఒకటై సంతోషంగా ఆడుకోవాలి
స రి గ మ ప పాట పాడాలి.. పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి
స రి గ మ ప పాట పాడాలి.. పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి చరణం 2 :
ఆనందం మధురానందం... అనుభవ సారమె సంగీతం...
ఆనందం మధురానందం... అనుభవ సారమె సంగీతం...
పశువులనైనా.. శిశివులనైనా
పశువులనైనా.. శిశివులనైనా పాములనైనా జో కొట్టేది చల్లని గీతం
సనిదపమగరిస.. సనిదపమగరిస..
అబ్బబ్బ సనిదపమగరిస.. సనిదపమగరిస..
నో నో నో సనిదపమగరిస
స రి గ మ ప పాట పాడాలి పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి
స రి గ మ ప పాట పాడాలి పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి
స రి గ మ ప పాట పాడాలి పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి
లలాలల లలాలల లలాలలాల

14, ఫిబ్రవరి 2022, సోమవారం

Antha Mana Manchike : Navvave Naa Chelli Song Lyrics (నవ్వవే నా చెలి.)

చిత్రం: అంతా మన మంచికే (1972)

సాహిత్యం: దాశరథి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,బి. వసంత

సంగీతం: సత్యం


పల్లవి: ఓహోహోహో.. ఓహో.. ఓహో.. ఆహా.. ఆహా.. ఆహా.. హేహేహే.. హేహేహే.. హేహేహే.. నవ్వవే నా చెలి.. నవ్వవే నా చెలి చల్లగాలి పిలిచేను.. మల్లెపూలు నవ్వేను వలపులు పోంగే వేళలో.. నవ్వనా నా ప్రియా.. మూడు ముళ్ళు పడగానే.. తోడు నీవు కాగానే మమతలు పండే వేళలో.. నవ్వనా నా ప్రియా చరణం 1: మనసులు ఏనాడో కలిశాయిలే మనువులు ఏనాడో కుదిరాయిలే నీవు నాదానవే.. నీవు నావాడవే నేను నీవాడనే.. నేను నీ దాననే ఇక నను చేరి మురిపింప బెదురేలనే.. నవ్వవే నా చెలి నవ్వనా నా ప్రియ.. చరణం 2: జగమేమి తలచేను.. మనకెందుకూ.. జనమేమి పలికేను.. మనకేమిటీ.. నేను నీవాడనే.. నేను నీదాననే నిజమైన మన ప్రేమ గెలిచేనులే నవ్వవే నా చెలి.. నవ్వనా నా ప్రియా.. చల్లగాలి పిలిచేను.. మల్లెపూలు నవ్వేను వలపులు పోంగే వేళలో.. నవ్వవే నా చెలి.. నవ్వనా నా ప్రియా.. ఏహేహే.. హేహే.. హోహోహో.. హోహోహో..