చిత్రం: అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం : పి. సుశీల, పి. లీల
పల్లవి :
చిగురుల పూవుల సింగారముతో... తీవెలు సొంపులు గనలే..దు
ముసి ముసి నవ్వుల గిలిగింతలతో... వసంత ఋతువా... రానేలే..దు
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో ...
తరుణం కాని తరుణంలో... నా మది ఈ గుబులెందుకనో..
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో ...
వలపులు మీటగ తీయని పాటలు... హృదయవీణపై పలికెనుగా
ప్రియతము గాంచిన ఆనందములో... మనసే వసంత ఋతువాయెనుగా..
కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే
తరుణం కాని తరుణంలో... నీ మది ఈ గుబులందుకనే..
చరణం 1 :
తళుకు బెళుకుల తారామణులతో... శారద రాత్రులు రాలేదు
ఆకాశంలో పకపకలాడుచూ రాకాచంద్రుడా... రానేలేదు
కాలం కాని కాలంలో... చల్లని వెన్నెల ఎందుకనో...
తరుణం కాని తరుణంలో... నా మది ఈ గుబులెందుకనో..
కాలం కాని కాలంలో... చల్లని వెన్నెల ఎందుకనో...
తలచిన తలపులు ఫలించగలవని... బులపాటము బలమాయెనుగా..
పగటి కలలుగను కన్యామణులకే... ప్రియుడే...రాకాచంద్రుడుగా...
కాలం కాని కాలంలో... చల్లని వెన్నెల అందుకనే...
తరుణం కాని తరుణంలో... నీ మది ఈ గుబులందుకనే ..
కాలం కాని కాలంలో..చల్లని వెన్నెల అందుకనే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి