Appu Chesi Pappu Koodu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Appu Chesi Pappu Koodu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జనవరి 2025, సోమవారం

Appu Chesi Pappu Koodu : Appu Chesi Pappu Koodu Song Lyrics (అప్పు చేసి పప్పు కూడు)

చిత్రం: అప్పు చేసి పప్పు కూడు (1959)

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు

గానం : ఘంటసాల


పల్లవి:

అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
ఓహో... ఓ... ఓ.. ఓ.. ఆహా... ఆ... ఆ... ఆ...
దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా
అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా

చరణం 1:

ఓహో... ఓ... ఓ.. ఓ.. ఆహా... ఆ... ఆ... ఆ...
ఉన్నవారు లేనివారు రెండే రెండు జాతులురా
ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా

చరణం 2:

ఓహో... ఓ... ఓ.. ఓ.. ఆహా... ఆ... ఆ... ఆ...
వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా
అంతగాను కోర్టుకెళితే ఐపీ బాంబుందిరా
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా

చరణం 3:

ఓహో...ఓ...ఓ..ఓ..ఆహా...ఆ...ఆ...ఆ...
రూపాయే దైవమురా రూపాయే లోకమురా
రూకలేనివాడు భువిని కాసుకు కొరగాడురా
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా

Appu Chesi Pappu Koodu : Anandam Paramanandam Song Lyrics (ఆనందం పరమానందం..)

చిత్రం: అప్పు చేసి పప్పు కూడు (1959)

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు

గానం : ఘంటసాల, పి. లీల


పల్లవి:

ఆనందం పరమానందం... ఆనందం పరమానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన.. భక్త కోటులకు బ్రహ్మానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన.. భక్త కోటులకు బ్రహ్మానందం
ఆనందం పరమానందం... ఆనందం పరమానందం

చరణం 1:

యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం
యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం
ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకే చిక్కుట పరమానందం
ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకే చిక్కుట పరమానందం
ఆనందం పరమానందం... ఆనందం పరమానందం

చరణం 2:

వేణు గానమున శిశువులు పశువులు తన్మయమందుట ఆనందం
వేణు గానమున శిశువులు పశువులు తన్మయమందుట ఆనందం
కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం
కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం
ఆనందం పరమానందం... ఆనందం పరమానందం

బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం
ఆనందం పరమానందం... ఆనందం పరమానందం
ఆనందం పరమానందం... ఆనందం పరమానందం
ఆనందం పరమానందం... ఆనందం పరమానందం

Appu Chesi Pappu Koodu : Chigurula poovula Song Lyrics (చిగురుల పూవుల )

చిత్రం: అప్పు చేసి పప్పు కూడు (1959)

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు

గానం : పి. సుశీల, పి. లీల


పల్లవి :

చిగురుల పూవుల సింగారముతో... తీవెలు సొంపులు గనలే..దు
ముసి ముసి నవ్వుల గిలిగింతలతో... వసంత ఋతువా... రానేలే..దు
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో ...
తరుణం కాని తరుణంలో... నా మది ఈ గుబులెందుకనో..
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో ...
వలపులు మీటగ తీయని పాటలు... హృదయవీణపై పలికెనుగా
ప్రియతము గాంచిన ఆనందములో... మనసే వసంత ఋతువాయెనుగా..
కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే
తరుణం కాని తరుణంలో... నీ మది ఈ గుబులందుకనే..

చరణం 1 :

తళుకు బెళుకుల తారామణులతో... శారద రాత్రులు రాలేదు
ఆకాశంలో పకపకలాడుచూ రాకాచంద్రుడా... రానేలేదు
కాలం కాని కాలంలో... చల్లని వెన్నెల ఎందుకనో...
తరుణం కాని తరుణంలో...  నా మది ఈ గుబులెందుకనో..
కాలం కాని కాలంలో... చల్లని వెన్నెల ఎందుకనో...
తలచిన తలపులు ఫలించగలవని... బులపాటము బలమాయెనుగా..
పగటి కలలుగను కన్యామణులకే... ప్రియుడే...రాకాచంద్రుడుగా...
కాలం కాని కాలంలో... చల్లని వెన్నెల అందుకనే...
తరుణం కాని తరుణంలో... నీ మది ఈ గుబులందుకనే ..
కాలం కాని కాలంలో..చల్లని వెన్నెల అందుకనే


Appu Chesi Pappu Koodu : Yechati nundi veecheno Song Lyrics (ఎచటి నుండి వీచెనో..)

చిత్రం: అప్పు చేసి పప్పు కూడు (1959)

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు

గానం : ఘంటసాల, పి. లీల


పల్లవి :

ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
తీవెలపై ఊగుతూ...  పూవులపై తూగుతూ
తీవెలపై ఊగుతూ...  పూవులపై తూగుతూ
ప్రకృతినెల్ల హాయిగా.... ఆ.... ప్రకృతినెల్ల హాయిగా
తీయగా.. మాయగా.. పరవశింప జేయుచూ
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి


చరణం 1 :

జాబిలితో ఆడుతూ...  వెన్నెలతో పాడుతూ
జాబిలితో ఆడుతూ...  వెన్నెలతో పాడుతూ
మనసు మీద హాయిగా.... ఆ.... మనసు మీద హాయిగా
తీయగా...  మాయగా...  మత్తు మందు జల్లుతూ
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి

చరణం 2 :

హృదయ వీణ మీటుతూ...  ప్రేమ గీతి పాడుతూ
హృదయ వీణ మీటుతూ...  ప్రేమ గీతి పాడుతూ
ప్రకృతినెల్ల హాయిగా.... ఆ.... ప్రకృతినెల్ల హాయిగా
తీయగా...  మాయగా...  పరవశింప జేయుచూ
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి...
ఈ చల్లని గాలి...  

Appu Chesi Pappu Koodu : Sundaraangulanu Song Lyrics (సుందరాంగులను చూచిన వేళల)

చిత్రం: అప్పు చేసి పప్పు కూడు (1959)

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు

గానం : ఘంటసాల, ఏ. ఏం. రాజా, పి. లీల


పల్లవి : సుందరాంగులను చూచిన వేళల... కొందరు ముచ్చటపడనేలా? కొందరు పిచ్చనుపడనేలా? సుందరాంగులను చూచిన వేళల... కొందరు ముచ్చటపడనేలా? కొందరు పిచ్చనుపడనేలా? అందము ప్రాయము ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా అందము ప్రాయము ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా ముందుగా ఎవరిని వరించునోయని తొందరలో మతి పోవుకదా సుందరాంగులను చూచిన వేళల... కొందరు పిచ్చనుపడనేలా? కొందరు ముచ్చటపడనేలా? హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించు గదా హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించు గదా మందహాసమున మనసును దెలిపే ఇందువదన కనువిందు కదా చరణం 1 : ప్రేమపరీక్షలు జరిగే వేళల... కొందరు పరవశ పడనేల? కొందరు కలవరపడనేల? యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా ప్రేమపందెమును గెలిచేవరకు నామది కలవరపడునుకదా ప్రేమపరీక్షలు జరిగే వేళల... కొందరు కలవరపడనేల? కొందరు పరవశ పడనేల? కోయిలపలుకుల కోమలిగాంచిన.. తియ్యని తలపులు కలుగుగదా కోయిలపలుకుల కోమలిగాంచిన.. తియ్యని తలపులు కలుగుగదా వరములొసంగే ప్రేమదేవి గన పరవశమే మది కలుగుకదా సుందరాంగులను చూసిన వేళల... కొందరు ముచ్చటపడనేలా?.... కొందరు పిచ్చనుపడనేలా?



Appu Chesi Pappu Koodu : Moogavaina Emile Song Lyrics (మూగవైన ఏమిలే... )

చిత్రం: అప్పు చేసి పప్పు కూడు (1959)

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

గానం : ఏ. ఏం. రాజా

సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు



పల్లవి :

మూగవైన ఏమిలే... నగుమోమే చాలులే
సైగలింక చాలింపుము జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే...


చరణం 1 :

ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే 
ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
దొంగ మనసు దాగదులే....
దొంగ మనసు దాగదులే.. సంగతెల్ల తెలిపెనులే
మూగవైన ఏమిలే...


చరణం 2 :

పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
నను దయతో ఏలుకొనుమూ...
నను దయతో ఏలుకొమ్ము... కనుసన్నల మెలిగెదలే
మూగవైన ఏమిలే...

చరణం 3 : 

అందాలే బంధాలై నను బంధీ చేసెనులే
అందాలే బంధాలై నను బంధీ చేసెనులే
కలవరమిక ఎందుకులే...
కలవరమిక ఎందుకులే... వలదన్నా వదలనులే

మూగవైన ఏమిలే నగుమోమే చాలులే
సైగలింక చాలింపుము...  జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే...


Appu Chesi Pappu Koodu : Oo Maradala Song Lyrics (ఓ మరదలా... నాలో పొంగి పొరలే ప్రేమ వరదలా)

చిత్రం: అప్పు చేసి పప్పు కూడు (1959)

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు

గానం       : ఘంటసాల, స్వర్ణలత


పల్లవి :

ఓ మరదలా... నాలో పొంగి పొరలే ప్రేమ వరదలా
నీరూ పాలూ కలిసి ఒకటైనటులే... నీవూ నేనూ ఒకటే గదా
ఓ పంచవన్నెల చిలకా...ఆ ?... ఆ
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక? 
మాటాడవేమే... మాటాడవేమే... నీ నోటి ముత్యాలొలక
పంచవన్నెల చిలకా... 
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక? 

ఓహో బావా... మార్చుకో నీ వంకరటింకర దోవ
ఊరికే నీవూ నేనూ ఒకటేననుకుంటే...  ఒప్పుతుందా యీ లోకం?
ఓ కొంటె బావగారూ... హాయ్!
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
మా నాన్నగారు చూస్తే...
మా నాన్నగారు చూస్తే...  మీ దుమ్ము దులుపుతారు!
ఓ కొంటె బావగారూ...
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?


చరణం 1 :

సీమటపాకాయలాగ చిటాపటాలాడేవు
సీమటపాకాయలాగ చిటాపటాలాడేవు
ప్రేముందా లేదా... ఓ మరదలా నా మీద?
పంచవన్నెల చిలకా...
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?

చరణం 2 :

మరదలినైతే మాత్రం మరీ అంత చనువా?
మరదలినైతే మాత్రం మరీ అంత చనువా?
మరియాద కాదు మీ బావ మరిది చొరవ
ఓ కొంటె బావగారూ...
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
మా నాన్నగారు చూస్తే...
మా నాన్నగారు చూస్తే...  మీ దుమ్ము దులుపుతారు
ఓ కొంటె బావగారూ... ఓ పంచవన్నెల చిలకా
ఓ కొంటె బావగారూ... ఓ పంచవన్నెల చిలకా

5, జనవరి 2025, ఆదివారం

Appu Chesi Pappu Koodu : Cheyi Cheyi Kalupa raave Song Lyrics (చేయి చేయి కలుపరావె హాయిహాయిగ)

చిత్రం: అప్పు చేసి పప్పు కూడు (1959)

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

గానం : ఏ. ఏం. రాజా, పి. లీల

సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు


పల్లవి :

చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ
చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ
అహా... చేయి చేయి
పెద్దవారి అనుమతింక లేదు లేదుగ
చేయి చేయి కలుపుటెల హాయి హాయిగ
పెద్దవారి అనుమతింక లేదు లేదుగ
చేయి చేయి కలుపుటెల హాయి హాయిగ
ఉహూ...  చేయి చేయి 

చరణం 1 : 

మగని మాటకెదురాడుట తగదు తగదుగ
నాతి చెంత విరహము నే తాళలేనుగ
మగని మాటకెదురాడుట తగదు తగదుగ
నాతి చెంత విరహము నే తాళలేనుగ
అహా...  చేయి చేయి

చరణం 2 : 

వీలుకాని విరహమింక వలదు వలదుగ
దాసి మీద వలపు మీకు తగదు తగదుగ
వీలుకాని విరహమింక వలదు వలదుగ
దాసి మీద వలపు మీకు తగదు తగదుగ
అహా...  చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ
అహా...  చేయి చేయి 



Appu Chesi Pappu Koodu : Rama Rama Saranam Song Lyrics (రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం)

చిత్రం: అప్పు చేసి పప్పు కూడు (1959)

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

గానం : పి. లీల

సాహిత్యం: పింగళి నాగేంద్రరావు



పల్లవి :

రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం

రామ రామ శరణం...  

తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి

తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి

శిలకు ప్రాణమిచ్చి సన్నుతులు గాంచినట్టి


రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం

రామ రామ శరణం...  


చరణం 1 : 

శివుని విల్లు ద్రుంచి... శ్రీ జానకిని గ్రహించి

శివుని విల్లు ద్రుంచి... శ్రీ జానకిని గ్రహించి

జనకు మాటనెంచి వనవాసమేగినట్టి


రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం

రామ రామ శరణం...  


చరణం 2 : 

రావణుని వధించి ఘనకీర్తి జగతినించి

రావణుని వధించి ఘనకీర్తి జగతినించి

పాపముల హరించి భువినెల్ల గాచునట్టి


రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం

రామ రామ శరణం...  


18, జనవరి 2022, మంగళవారం

Appu Chesi Pappu Koodu : Kasi Poyanu Ramahari Song Lyrics (కాశీ కి పోయాను రామాహరి )

చిత్రం: అప్పు చేసి పప్పు కూడు (1959)

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

గానం : ఘంటసాల, స్వర్ణలత

సాహిత్యం: పింగళి నాగేంద్రరావు




పల్లవి : కాశీకి పోయాను రామా హరి గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి గంగ తీర్థాము తెచ్చాను రామా హరి కాశీకి పోలేదు రామా హరి ఊరి కాల్వలో నీళ్ళండి రామా హరి మురుగు కాల్వలో నీళ్ళండి రామా హరి చరణం 1 : ఈమె మాటలు పట్టించుకోకండి ఈ పిల్ల మా మేనకోడలు నన్ను సంసారలంపటంలో దింపటానికొచ్చింది శ్రీశైలమెళ్లాను రామా హరి శివుని వీభూది తెచ్చాను రామా హరి శివుని వీభూది తెచ్చాను రామా హరి శ్రీశైలం పోలేదు రామా హరి శివుని వీభూది తేలేదు రామా హరి ఇది కాష్టంలో బూడిదా రామా హరి చరణం 2 : అన్నమక్కరలేదు రామా హరి నేను గాలి భోంచేస్తాను రామా హరి ఉత్త గాలి భోంచేస్తాను రామా హరి గాలితో పాటుగా రామా హరి వీరు గారెలే తింటారు రామా హరి నేతి గారెలే తింటారు రామా హరి చరణం 3 : కైలాసమెళ్ళాను రామా హరి శివుని కళ్ళారా చూశాను రామా హరి రెండు కళ్ళారా చూశాను రామా హరి కైలాసమెళితేను రామా హరి నంది తన్ని పంపించాడు రామా హరి బాగ తన్ని పంపించాడు రామా హరి చరణం 4 : ఆలుబిడ్డలు లేరు రామా హరి నేను ఆత్మయోగీనండి రామా హరి గొప్ప ఆత్మయోగీనండి రామా హరి ఆ మాట నిజమండి రామా హరి నేను అందుకే వచ్చాను రామా హరి నేను అందుకే వచ్చాను రామా హరి