15, జనవరి 2025, బుధవారం

Arundhati : Bhu Bhu Bhujangam Song Lyrics (భూ భూ భుజంగం దితై తరంగం)

చిత్రం: అరుంధతి  (2008)

రచన:  వేటూరి సుందరరామ మూర్తి

గానం: కె.ఎస్.చిత్ర

సంగీతం: కోటి



భూ భూ భుజంగం దితై తరంగం
మృత్యుర్ మృదంగం నా అంతరంగం
నాలో జ్వలించే తరంతరంగం
నటనై చలించే నరాంతరంగం
పగతో నటించే జతిస్వరంగం
ఒఒఒఒఒఒఒఒ ఓఓఓ ఓ ఓ
పాడనా విలయ కీర్తన
ఆడన ప్రళయ నర్తన
కారు మేఘాలు కమ్ముకొస్తున్న
కటిక చీకట్లలో
బానిసత్వాన రాణివాసాలు
రగిలిన జ్వాలలో
డోలు కొట్టింది రాహువు
మేళమెత్తింది కేతువు
తరుముకొస్తుంది మృత్యువు
తరిగిపోతుంది ఆయువు
చావుతోనే కీడు నాకు
వేదనా వేదనా ఆఅ ఆఆ
ఆడన ప్రళయ నర్తన
పాడనా విలయ కీర్తన
బ్రహ్మ రాసిన రాతను
ఆ బ్రాహ్మణే చెరుపలేడురా
ధర్మ మార్గమే తప్పితే
ఆ దైవమె నీకు కీడురా
ఎదురుకోలేవు విధిని ఈనాడు
ఎరుగరా నిన్ను నీవిక
రమణి సీతని కోరిన నాటి
రావణుడు నెల కూలేరా
విషయ వాంఛలకు గెలుపు లేదు ఈనాడు
అమ్మ జాతితో బొమ్మ లాటలే కీడు
పడితిగా నేను పలుకుతున్నాను
జన్మకే నీకు చేరమగీతాలు
అసుర ఘాతాలు ఆశని పాతాలు
దుర్గహస్తాల ఖడ్గ నాదాలు
భగ భగ సెగలుగా
భుగ భుగ పొగలైటు మగువల తెగువలు
పగులగా రగులగా
అగ్నిగా రేగిన ఆడతనం
హారతి కోరెను ఈ నిమిషం
నీ దుర్మరణం
దుర్మరణం
దుర్మరణం
దుర్మరణం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి