Arundhati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Arundhati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జనవరి 2025, బుధవారం

Arundhati : Bhu Bhu Bhujangam Song Lyrics (భూ భూ భుజంగం దితై తరంగం)

చిత్రం: అరుంధతి  (2008)

రచన:  వేటూరి సుందరరామ మూర్తి

గానం: కె.ఎస్.చిత్ర

సంగీతం: కోటి



భూ భూ భుజంగం దితై తరంగం
మృత్యుర్ మృదంగం నా అంతరంగం
నాలో జ్వలించే తరంతరంగం
నటనై చలించే నరాంతరంగం
పగతో నటించే జతిస్వరంగం
ఒఒఒఒఒఒఒఒ ఓఓఓ ఓ ఓ
పాడనా విలయ కీర్తన
ఆడన ప్రళయ నర్తన
కారు మేఘాలు కమ్ముకొస్తున్న
కటిక చీకట్లలో
బానిసత్వాన రాణివాసాలు
రగిలిన జ్వాలలో
డోలు కొట్టింది రాహువు
మేళమెత్తింది కేతువు
తరుముకొస్తుంది మృత్యువు
తరిగిపోతుంది ఆయువు
చావుతోనే కీడు నాకు
వేదనా వేదనా ఆఅ ఆఆ
ఆడన ప్రళయ నర్తన
పాడనా విలయ కీర్తన
బ్రహ్మ రాసిన రాతను
ఆ బ్రాహ్మణే చెరుపలేడురా
ధర్మ మార్గమే తప్పితే
ఆ దైవమె నీకు కీడురా
ఎదురుకోలేవు విధిని ఈనాడు
ఎరుగరా నిన్ను నీవిక
రమణి సీతని కోరిన నాటి
రావణుడు నెల కూలేరా
విషయ వాంఛలకు గెలుపు లేదు ఈనాడు
అమ్మ జాతితో బొమ్మ లాటలే కీడు
పడితిగా నేను పలుకుతున్నాను
జన్మకే నీకు చేరమగీతాలు
అసుర ఘాతాలు ఆశని పాతాలు
దుర్గహస్తాల ఖడ్గ నాదాలు
భగ భగ సెగలుగా
భుగ భుగ పొగలైటు మగువల తెగువలు
పగులగా రగులగా
అగ్నిగా రేగిన ఆడతనం
హారతి కోరెను ఈ నిమిషం
నీ దుర్మరణం
దుర్మరణం
దుర్మరణం
దుర్మరణం


11, నవంబర్ 2021, గురువారం

Arundhati : Chandamama Nuvve Nuvve Song Lyrics (డోలారే డోలారే ధం)

చిత్రం: అరుంధతి  (2008)

రచన:  అనంత్ శ్రీరామ్

గానం: సందీప్, సాయి కృష్ణ, మురళి, నాగ సాహితీ, రేణుక & కోరస్

సంగీతం: కోటి



చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే

వెన్నెలంతా నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే

మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే చుక్కలే ముత్యాలల్లి మెళ్ళో వేసావే

డోలారే డోలారే ధం కోలాటాలాడే క్షణం ఇల్లంతా బృందావనం డోలారే డోలారే ధం ఇల్లంతా బృందావనం

పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం

దూకే ఆ గుండెల్లో తొందరలే చూద్దామా తొంగి మనం

ఇన్నాళ్లు వెచ్చింది మా ముంగిలి ఇలా సందల్లే రావాలని

ఇన్నేళ్లు చూసింది మా మామిడి ఇలా గుమ్మంలో ఉండాలని

మురిసే ప్రాయమాల్లో ఉయ్యాలూపంగా తనిలా పెరిగింది గారాబంగా

నడిచే శ్రీలక్ష్మి పాదం మోపంగా సిరులే చిందాయి వైభోగంగా

వరించి తరించి వాడు వస్తున్నాడు అడ్డం లేవండోయ్

హాఏ డోలారే డోలారే డోలారే ధం అర్ వారెవా ఎమ్ సోయగం

డోలారే డోలారే ధం నాతోటె నాచోరే ఓ సోనియాయే

నువ్వయి పుట్టావే మేరే లియే నాకంటి పాపల్లే చూస్తానులే

అనే మాటిచ్చుకుంటానులే మనసే బంగారం అంటారొయ్ అంతా

ఇహ పో నీ పంటె పండిందంట అడుగే వేస్తుందోయ్ నిత్యం నీవెంట

కలలోనైనా నిను విడిపోదంట ఫలించే కలల్లో తుల్లే వయ్యారిని

అంతా చూడండోయ్ డోలారే డోలారే ధం నా చుట్టూ ఈ సంబరం

డోలారే డోలారే ధం ఏ జన్మదో ఈ వరం

ప్రాణం లో న ఏ దాచుకుంటాను పంచేటి ఆప్యాయం జన్మంతా గుర్తుంచుకుంటాను ఈనాటి ఆనందం

డోలారే డోలారే ధం ఇల్లంతా బృందావనం ఇల్లంతా బృందావనం

10, నవంబర్ 2021, బుధవారం

Arundhati : Kammukonna Chikatlona Song Lyrics (కమ్ముకొన్న చీకట్లోన)

చిత్రం: అరుంధతి  (2008)

రచన: సి.నారాయణ రెడ్డి

గానం: కైలాష్ ఖేర్

సంగీతం: కోటి


కమ్ముకొన్న చీకట్లోన కమ్ముకొచ్చే వెలుతురమ్మ కచ్చగట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాళివమ్మా నీ కన్ను ఉరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా కుంచే పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకె అద్దమమ్మ అందరిని ఆధరించే దయమయి అన్నపూర్ణ నీవమ్మ ఆలన పాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మ నువ్వు పలికేదే తిరుగులేని వేదం నువ్వు చేసేదే ఎదురులేని చట్టం ఓర్పులోన ధరణిమాతవమ్మ తీర్పులోన ధర్మమూర్తివమ్మ... జేజమ్మ మాయమ్మ జేజమ్మ ఓయమ్మ జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ