చిత్రం: ఆత్మ గౌరవం (1965)
సాహిత్యం: ఆరుద్ర
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
గానం: ఘంటసాల, పి. సుశీల
పల్లవి:
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు...
చరణం 1:
కొంటె చూపు చూడకు గుండె కోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు....
కొంటె చూపు చూడకు గుండె కోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు...
వేషమైనా మోసమైనా అంతా నీ కోసం ...
ఊహూ...అలాగా...
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు...
చరణం 2:
ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది...పాపం...
ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది..
గుండె మీద వాలి చూడు గోడు వింటావు
ష్...అబ్బబ్బబ్బా...
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
చరణం 3:
దోర వయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమైన మనసు పడే బాధ అయ్యయ్యో...
దోర వయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమైన మనసు పడే బాధ అయ్యయ్యో...
కరుణ చూపి కరుగకున్న టాటా... చీరియో
టాటా... చీరియో
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి