Athma Gouravam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Athma Gouravam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జనవరి 2025, శుక్రవారం

Athma Gouravam : Raanani Raalenani Song Lyrics (రానని రాలేనని)

చిత్రం: ఆత్మ గౌరవం (1965)

సాహిత్యం: ఆరుద్ర

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు

గానం: ఘంటసాల, పి. సుశీల



పల్లవి:

రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు

రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు...

చరణం 1:

కొంటె చూపు చూడకు గుండె కోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు....
కొంటె చూపు చూడకు గుండె కోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు...
వేషమైనా మోసమైనా అంతా నీ కోసం ...

ఊహూ...అలాగా...

రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు...

చరణం 2:

ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది...పాపం...
ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది..

గుండె మీద వాలి చూడు గోడు వింటావు
ష్...అబ్బబ్బబ్బా...

రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు

చరణం 3:

దోర వయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమైన మనసు పడే బాధ అయ్యయ్యో...
దోర వయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమైన మనసు పడే బాధ అయ్యయ్యో...

కరుణ చూపి కరుగకున్న టాటా... చీరియో
టాటా... చీరియో

రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు....

Athma Gouravam : Preminchanide Pellaadanani Song Lyrics (ప్రేమించనిదే పెళ్ళాడనని)

చిత్రం: ఆత్మ గౌరవం (1965)

సాహిత్యం: ఆరుద్ర

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు

గానం: ఘంటసాల, పి. సుశీల




పల్లవి:

ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే...
ఆ మాటలు ఏమైనవి? అహా! అయ్యగారు ఓడారులే..

ఉహు..ఉహు...
పెళ్ళాడనిదే ప్రేమించనని తెగ లెక్చరు దంచావులే...
నీ మాటకు.. నీ చేతకు.. అహ అంతు పొంతు లేదాయలే..

నీ వలపు తెలుపక ఊ అంటివి నా తలపు తెలియక ఔనంటివి
నీ వలపు తెలుపక ఊ అంటివి నా తలపు తెలియక ఔనంటివి
నీ ఆశయం ఏమైనది? అహ! నీటిమూట అయిపోయెలే
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే

చరణం 1:

శ్రీరంగనీతులు చెప్పావులే చిత్రంగ ప్లేటును తిప్పావులే...
శ్రీరంగనీతులు చెప్పావులే చిత్రంగ ప్లేటును తిప్పావులే
అమ్మాయిలు ఎటు బొంకినా ఆహా అందమెంతొ చిందేనులే
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే

చరణం 2:

ఈ సొగసు నవ్వి కవ్వింతులే... నా వయసు నిన్నే బాధించులే
కనుపాపలో నిను దాచితే నను వీడి పోలేవులే....
అహ...నను వీడి పోలేవులే....


చరణం 3:

పైపైన మెరుగులు కొన్నాళ్లవే మదిలోన మమతలు పూయాలిలే...
వయ్యారమే ఒలికించినా అయ్యగారు చలియించరు..
ఆహా! అయ్యగారు చలియించరు ...

ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే...
నీ మాటకు.. నీ చేతకు.. అహ అంతు పొంతు లేదాయలే..

ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే

Athma Gouravam : Preminichi Pellichesuko Song Lyrics (ప్రేమించి పెళ్ళి చేసుకో...)

చిత్రం: ఆత్మ గౌరవం (1965)

సాహిత్యం: ఆరుద్ర

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు

గానం: ఘంటసాల




పల్లవి:

ఓ సోదరసోదరీమణులారా...
ఆదరించి నా మాట వింటారా...
వింటాం చెప్పు..

ప్రేమించి పెళ్ళి చేసుకో... నీ మనసంతా హాయి నింపుకో...
ప్రేమించి పెళ్ళి చేసుకో...

ప్రేమించి పెళ్ళి చేసుకో... నీ మనసంతా హాయి నింపుకో...
ప్రేమించి పెళ్ళి చేసుకో...

చరణం 1:

వరుని వలపేమిటో వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా...
వరుని వలపేమిటో వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా...
తెలిసి కట్నాలకై బతుకు బలి చేసినా
కడకు మిగిలేది ఎడమోము పెడమోములే....

ప్రేమించి పెళ్ళి చేసుకో... నీ మనసంతా హాయి నింపుకో...
ప్రేమించి పెళ్ళి చేసుకో...

చరణం 2:

మనిషి తెలియాలిలే... మనసు కలవాలిలే
మరచిపోలేని స్నేహాన కరగాలిలే....
మనిషి తెలియాలిలే... మనసు కలవాలిలే
మరచిపోలేని స్నేహాన కరగాలిలే.

మధురప్రణయాలు మనువుగా మారాలిలే....
మారి నూరేళ్ళ పంటగా వెలగాలిలే....

ప్రేమించి పెళ్ళి చేసుకో... నీ మనసంతా హాయి నింపుకో...
ప్రేమించి పెళ్ళి చేసుకో...

చరణం 3:

నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని
వలచి రుక్మిణియే పిలిపించె శ్రీకృష్ణుని...
నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని
వలచి రుక్మిణియే పిలిపించె శ్రీకృష్ణుని.....

తొలుత మనసిచ్చి మనువాడె దుష్యంతుడు....
పాత ఒరవళ్ళు దిద్దాలి మీరందరూ...

ప్రేమించి పెళ్ళి చేసుకో... నీ మనసంతా హాయి నింపుకో...
ప్రేమించి పెళ్ళి చేసుకో...

Athma Gouravam : Bratuku Netito Baruvai Song Lyrics (బ్రతుకే నేటితో బరువై పోయెలే)

చిత్రం: ఆత్మ గౌరవం (1965)

సాహిత్యం: ఆరుద్ర

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు

గానం: పి. సుశీల




పల్లవి:

బ్రతుకే నేటితో బరువై పోయెలే
బ్రతుకే నేటితో బరువై పోయెలే...
మదిలో ఆశలే మసిగా మారెలే...
బ్రతుకే నేటితో బరువై పోయెలే

చరణం 1:

వెలుగే వేడగా చీకటి నిండెనే
వెలుగే వేడగా చీకటి నిండెనే...
వలపే కోరగా వగపె కలిగే...
ఆరని శోకమే ఆహుతి చేసెనే...
బ్రతుకే నేటితో బరువై పోయెలే...

చరణం 2:

నీ సౌఖ్యానికి సౌభాగ్యానికి
నీ వారందరూ బలి కావాలా..
నీ సౌఖ్యానికి సౌభాగ్యానికి
నీ వారందరూ బలి కావాలా...

తీరని వేదనా రగిలించేవా...
బ్రతుకే నేటితో బరువై పోయెలే....

చరణం 3:

శిలవై పోదువో... కలవై పోదువో...
సగమై ఆగినా కథ అయిపోదువో...
కంటికి ధారగా కరిగే పోదువో....
కంటికి ధారగా కరిగే పోదువో....

Athma Gouravam : Maa Rajulocharu Song Lyrics (మా రాజులొచ్చారు)

చిత్రం: ఆత్మ గౌరవం (1965)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు

గానం: వసంత, పి. సుశీల




పల్లవి: మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు మా ఇంటికొచ్చారు మామంచివారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు మా ఇంటికొచ్చారు మామంచివారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు పట్నాలలో ఉండు పెదబాబుగారు పల్లెసీమకు నేడు వేంచేసినారు కొండంత దేవుణ్ని కొలిచేది ఎలాగో తెలియక మేమంత తికమక పడ్డాము మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు మా ఇంటికొచ్చారు మామంచివారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు చరణం 1: ముద్దపప్పే కలుపుకోండి కొత్త ఆవకాయే నంచుకోండి అత్తమ్మ వండిన గుత్తి వంకాయండీ... అత్తమ్మ వండిన గుత్తి వంకాయండీ మచ్చు చూశారంటే మళ్ళీ తెమ్మంటారు మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు మా ఇంటికొచ్చారు మామంచివారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు చరణం 2: బూరెలే వడ్డించ మంటారా... నేతిగారెలే వేయించుకుంటారా బొబ్బట్లు నేతిలో ముంచి దంచారంటే... బొబ్బట్లు నేతిలో ముంచి దంచారంటే వైకుంఠమే వచ్చి వాకిట్లో దిగుతుంది మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు మా ఇంటికొచ్చారు మామంచివారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు చరణం 3: ఉన్నంతలో సేవలొనరించినాము చిన్నారి మనసులే అర్పించినాము.... మా ఇల్లు చల్లగా మీరు దీవించాలి... మా ఇల్లు చల్లగా మీరు దీవించాలి... మీ చూపు నీడలో మేము జీవించాలి... మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు మా ఇంటికొచ్చారు మామంచివారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు

7, ఫిబ్రవరి 2022, సోమవారం

Athma Gouravam : Andenu Nede Andani Song Lyrics (అందెను నేడే )

చిత్రం: ఆత్మ గౌరవం (1965)

సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు

గానం: ఘంటసాల, పి. సుశీల


పల్లవి: 

అందెను నేడే అందని జాబిల్లి  నా అందాలన్నీ ఆతని వెన్నెలలే  అందెను నేడే అందని జాబిల్లి...  చరణం 1:  ఇన్నేళ్ళకు విరిసె వసంతములు  ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు  నిదురించిన ఆశలు చిగురించెలే  నిదురించిన ఆశలు చిగురించెలే...  చెలికాడే నాలో తలపులు రేపెనులే  అందెను నేడే అందని జాబిల్లి  నా అందాలన్నీ ఆతని వెన్నెలలే  చరణం 2:  నా చెక్కిలి మెల్లగ మీటగనే  నరనరముల వీణలు మ్రోగినవి  గిలిగింతల నా మేను పులకించెలే  గిలిగింతల నా మేను పులకించెలే..  నెలరాజే నాతో సరసములాడెనులే  అందెను నేడే అందని జాబిల్లి  నా అందాలన్నీ ఆతని వెన్నెలలే  చరణం 3:  ఇక రాలవు కన్నుల ముత్యములు  ఇక వాడవు తోటల కుసుమములు  వినువీధిని నామది విహరించెలే..  వినువీధిని నామది విహరించెలే..  వలరాజే నాలో వలపులు చిలికెనులే  అందెను నేడే అందని జాబిల్లి  నా అందాలన్నీ ఆతని వెన్నెలలే  అందెను నేడే అందని జాబిల్లి

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Athma Gouravam : Oka Poola Baanam Song Lyrics (ఒక పూలబాణం)

చిత్రం: ఆత్మ గౌరవం (1965)

సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు

గానం: ఘంటసాల, పి. సుశీల


పల్లవి:

ఒక పూలబాణం తగిలింది మదిలో తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే ఒక పూలబాణం తగిలింది మదిలో తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే చరణం 1:

అలనాటి కలలే ఫలియించే నేడే మనసైన వాడే మనసిచ్చినాడే అలనాటి కలలే ఫలియించే నేడే మనసైన వాడే మనసిచ్చినాడే ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి| వసంతాల అందాల ఆనందాల ఆడాలోయి ఒక పూలబాణం తగిలింది మదిలో తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే

చరణం 2: ఏ పూర్వబంధమో అనుబంధమాయే అపురూపమైన అనురాగమాయె ఏ పూర్వబంధమో అనుబంధమాయే అపురూపమైన అనురాగమాయె నీ కౌగిట హాయిగా సోలిపోయి నీ కౌగిట హాయిగా సోలిపోయి సరాగాల ఉయ్యాల ఉల్లాసంగా ఊగాలోయి ఒక పూలబాణం తగిలింది మదిలో తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే వెలిగిందిలే నాలో వెలిగిందిలే