చిత్రం: చూపులు కలసిన శుభవేళ (1988)
రచన:
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
సంగీతం: రాజన్-నాగేంద్ర
పల్లవి:
నిన్నా మొన్నా నీదే ధ్యానం
నేడూ రేపో నీదే గానం
రాగం తానం నీవూ నేనై
సంగీతాలే సంయోగాలై
నిమిషం నిమిషం సరసం నింపేనులే
నిన్నా మొన్నా నీదే ధ్యానం
నేడూ రేపో నీదే గానం
రాగం తానం నీవూ నేనై
సంగీతాలే సంయోగాలై
కలలో ఇలలో ఒకటై నిలిచేములే
నిన్నా మొన్నా నీదే ధ్యానం
నేడూ రేపో నీదే గానం
చరణం 1:
విరిసీ విరియని పరువాలు..లయతో తలపడు నాట్యాలూ
కలహంసలా కదిలావులే...మరు హింసకూ గురిచేయకే
కరుణ చూపించు నా దేవివై...
తెలిసీ తెలియని భావాలు...పలికీ పలుకని రాగాలూ
పులకింతలై పలికాయిలే...సురగంగలా పొంగాయిలే
మలయ పవనాల గిలిగింతలో...పూచే పొదరిళ్ళు తోడుగా...
నిన్నా మొన్నా నీదే ధ్యానం...నేడూ రేపో నీదే గానం
రాగం తానం నీవూ నేనై...సంగీతాలే సమ్య్ ఓగాలై
కలలో ఇలలో ఒకటై నిలిచేములే...
నిన్నా మొన్నా నీదే ధ్యానం
నేడూ రేపో నీదే గానం
చరణం 2:
బ్రతుకే బహుమతి ఇది చాలా...మెరిసే అధరం మధుశాలా
విరజాజిలా విరిసానులే...విరహాలలో తడిసానులే
ఎదుట నిలిచాను నీ దానిగా...
కలలా కలిసెను కలయాలు...కధలై చిలికెను కవనాలూ
రసరాణిలా వెలిగావులే...కవికన్యలా కదిలావులే
ప్రణయ రసరాజ్యమేలేములే...కాచే వెన్నెల్ల సాక్షిగా
నిన్నా మొన్నా నీదే ధ్యానం...నేడూ రేపో నీదే గానం
రాగం తానం నీవూ నేనై...సంగీతాలే సంయోగాలై
నిమిషం నిమిషం సరసం నింపేనులే....
నిన్నా మొన్నా నీదే ధ్యానం
నేడూ రేపో నీదే గానం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి