19, జనవరి 2025, ఆదివారం

Gangotri : Jevana Vahini Song Lyrics (జీవన వాహినీ..... పావనీ.....)

చిత్రం : గంగోత్రి (2003)

గీత రచయిత : వేటూరి సుందర రామమూర్తి

నేపధ్య గానం: ఎం.ఎం.కీరవాణి. గంగ, కల్పన

సంగీతం : ఎం.ఎం.కీరవాణి



పల్లవి:
ఓం... ఓం...
జీవన వాహినీ..... పావనీ.....
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులుతుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయముదీర్చి శుభముకూర్చు గంగాదేవీ
నిను కొలిచిన చాలునమ్మ సకలలోకపావని
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి...
గంగోత్రీ... గంగోత్రీ...
గంగోత్రీ... గంగోత్రీ...
గలగలగల గంగోత్రి ...హిమగిరి దరి హరిపుత్రి
గలగలగల గంగోత్రి ...హిమగిరి దరి హరిపుత్రి
జీవన వాహినీ... పావనీ....
చరణం 1:
మంచుకొండలో ఒక కొండవాగులా..
ఇల జననమొందిన విరజావాహినీ
విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా ...
శివగిరికి చేరిన సురగంగ నీవనీ
అత్తింటికి సిరులనొసగు అలకనందవై...
సగరకులము కాపాడిన భాగీరథివై
బదరీవన.. హృషీకేశ.. హరిద్వార.. ప్రయాగముల.. మణికర్ణిక..
తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రీ....గంగోత్రీ....
గంగోత్రీ... గంగోత్రీ...
గలగలగల గంగోత్రి ...హిమగిరి దరి హరిపుత్రి
గలగలగల గంగోత్రి ...హిమగిరి దరి హరిపుత్రి
చరణం 2:
పసుపూ కుంకుమతో పాలూ పన్నీటితో
శ్రీగంధపుధారతో పంచామృతాలతో....
అంగాంగము తడుపుతూ దోషాలను కడుగుతూ
గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం...
అమ్మా... గంగమ్మా....
కృష్ణమ్మకు చెప్పమ్మా... కష్టం కలిగించొద్దని
యమునకు చెప్పమ్మా ...సాయమునకు వెనకాడొద్దని...
గోదారికి ..కావేరికి... ఏటికి సెలయేటికి కురిసేటి
జడివానకి దూకే జలపాతానికి నీ తోబుట్టువులందరికీ చెప్పమ్మా...
మా గంగమ్మా... జీవనదివిగా ఒక మోక్షనిధివిగా పండ్లుపూలు పసుపులా పారాణి రాణిగా...
శివుని జటనమే తన నాట్య జతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగా... గండాలను పాపాలను కడిగివేయగా...
ముక్తినదిని మూడు మునకలే చాలుగా...
జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని..
ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ గంగోత్రీ....గంగోత్రీ
గంగోత్రీ... గంగోత్రీ...
గలగలగల గంగోత్రి... హిమగిరి దరి హరిపుత్రి
గలగలగల గంగోత్రి... హిమగిరి దరి హరిపుత్రి జీవన వాహినీ..... పావనీ.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి