చిత్రం: దేవి (1999)
రచన: జొన్నవిత్తుల
గానం: అనురాధ శ్రీరామ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి :
రామచిలుకల దర్బారులో రాజా హంసలు రంగేళిలో
వసంత కోకిల కచేరిలో వయ్యారి మయూరి సయ్యటలో
వైశాఖ పూశాఖ పందిళ్ళ సందళ్ల అన్నయ్య పెళ్ళంటా రారండహో
రామచిలుకల దర్బారులో రాజా హంసలు రంగేళిలో...
రామచిలుకల దర్బారులో రాజా హంసలు రంగేళిలో....
జుంతకజుంతక జుం జుం
చరణం 1 :

మది తొందర పెడుతుందా తొడపెళ్లికూతురికి,
మనసు తప్పిపోయిందా పెళ్లి కొడుకు తమ్ముడికి
కవ్వింతల మరదలికి కథ ఏమిటో తెలుసు కదా...
సయ్యాటల చిన్నబావ ఆపేయ్యవ ప్రేమ సుధ...
కోపంలోను కనిపిస్తుందే కొత్త అందమే..
తాపం అయితే రాస్తా లేవోయ్ పూల గంధమే....
జుంతక జుంతక జుం జుం జర జుంతక జుంతక
రామచిలుకల దర్బారులో రాజా హంసలు రంగేళిలో
రామచిలుకల దర్బారులో రాజా హంసలు రంగేళిలో
చరణం 2 :
చరణం 2 :
మగపెళ్ళివారము గనుక అడిగింది ఇవ్వాలి
హద్దు దాటకుండా మీరు ఆతిధ్యం పొందాలి.
సంపెంగల పన్నీటితో సుస్వాగతం ఇవ్వాలిలే.
సింగారి మా జాబిల్లీకి శ్రీపల్లకే తేవాలిలే
వదినకి ఒకటి నీకింకోటి వేచి యున్నవే...
సరదా మరిది అరరె అదిగో విడిది చూద్దాములే
రామచిలుకల దర్బారులో రాజా హంసలు రంగేళిలో
వసంత కోకిల కచేరిలో వయ్యారి మయూరి సయ్యటలో
వైశాఖ పూశాఖ పందిళ్ళ సందళ్ల అన్నయ్య పెళ్ళంటా రారండహో
రామచిలుకల దర్బారులో రాజా హంసలు రంగేళిలో
వసంత కోకిల కచేరిలో వయ్యారి మయూరి సయ్యటలో
వైశాఖ పూశాఖ పందిళ్ళ సందళ్ల అన్నయ్య పెళ్ళంటా రారండహో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి