20, జనవరి 2025, సోమవారం

Gangotri : Ganga Song Lyrics (గంగా.. నీ ఉరుకులె రాగంగా...)

చిత్రం : గంగోత్రి (2003)

గీత రచయిత : చంద్రబోస్

నేపధ్య గానం: ఎస్. పి. బి. చరణ్, సునీత

సంగీతం : ఎం.ఎం.కీరవాణి


పల్లవి:

గంగా.. నీ ఉరుకులె రాగంగా నా గుండెలొ మోగంగా సరిగమలే సాగంగా మధురిమలో మునగంగా గంగా.. నిజంగా.. నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెలే మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా చరణం 1

నువ్విచ్చిన మనసే క్షేమం నువ్వు పంచిన ప్రేమే క్షేమం
నువ్వయి నేనున్నాను క్షేమంగా మనమాడిన ఆటలు సౌఖ్యం
మనసాడిన మాటలు సౌఖ్యం మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా
నీ చెవి విననీ సందేశం నా చదువుకు భాగ్యంగా
ప్రతి పదమున నువ్ ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా
గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా

నీ ఉరుకులె రాగంగా నా గుండెలొ మోగంగా సరిగమలే సాగంగా మధురిమలో మునగంగా చరణం 2

నువ్ పంపిన జాబుల పూలు నా సిగలో జాజులుకాగా
దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా
నీ లేఖల అక్షరమాల నా మెడలో హారంకాగా
చేరాతలు నా తలరాతను మార్చంగా
నువ్ రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా
నువ్ చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా
గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా

నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి