Gangotri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gangotri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జనవరి 2025, సోమవారం

Gangotri : Ganga Song Lyrics (గంగా.. నీ ఉరుకులె రాగంగా...)

చిత్రం : గంగోత్రి (2003)

గీత రచయిత : చంద్రబోస్

నేపధ్య గానం: ఎస్. పి. బి. చరణ్, సునీత

సంగీతం : ఎం.ఎం.కీరవాణి


పల్లవి:

గంగా.. నీ ఉరుకులె రాగంగా నా గుండెలొ మోగంగా సరిగమలే సాగంగా మధురిమలో మునగంగా గంగా.. నిజంగా.. నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెలే మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా చరణం 1

నువ్విచ్చిన మనసే క్షేమం నువ్వు పంచిన ప్రేమే క్షేమం
నువ్వయి నేనున్నాను క్షేమంగా మనమాడిన ఆటలు సౌఖ్యం
మనసాడిన మాటలు సౌఖ్యం మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా
నీ చెవి విననీ సందేశం నా చదువుకు భాగ్యంగా
ప్రతి పదమున నువ్ ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా
గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా

నీ ఉరుకులె రాగంగా నా గుండెలొ మోగంగా సరిగమలే సాగంగా మధురిమలో మునగంగా చరణం 2

నువ్ పంపిన జాబుల పూలు నా సిగలో జాజులుకాగా
దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా
నీ లేఖల అక్షరమాల నా మెడలో హారంకాగా
చేరాతలు నా తలరాతను మార్చంగా
నువ్ రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా
నువ్ చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా
గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా

నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)
(ధింతననన ధింతన ధింతన)

Gangotri : Vallanki Pitta Song Lyrics (వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట )

చిత్రం : గంగోత్రి (2003)

గీత రచయిత : చంద్రబోస్

నేపధ్య గానం: కౌసల్య, డి. ఐశ్వర్య

సంగీతం : ఎం.ఎం.కీరవాణి



పల్లవి:

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటు చిన్నరిపాప పొన్నారిపాప తోడుండి పొమ్మంట తను నవ్విందంటే ఇంకేం కావాలి నిదరోతూ ఉంటే..తను పక్క నుండాలి... ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి 

చరణం 1:

గరిసని సమ గరిసా
గరిసని సమ గరిసా
సగమ నినిప మగమా సగమ నినిప మగమా
పాప్పా మగమ్మామ్మా గసగ్గాగ్గా సనిసా
పాప్పా మగమ్మామ్మా గసగ్గాగ్గా సనిసా
చిరు చిరు మాటలు పలికే వేళ చిలక దిష్టి
బుడి బుడి అడుగులు వేసే వేళ హంస దిష్టి
వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి
జాబిలమ్మలా ఎదిగేవేళ దిష్టి చుక్క దిష్టి
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవునిదిష్టి
ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి   

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటు చిన్నరిపాప పొన్నారిపాప తోడుండి పొమ్మంట

చరణం 2:

ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మ నవుతా...
ఆకలేయగా బుల్లి బొజ్జలో బువ్వ నవుతా...
స్నానమాడే చల్లని వేళ వేన్నీళ్ళవుతా...
ఎక్కెక్కి ఏడ్చేవేళ కన్నీళ్ళవుతా....
నేస్తాన్నవుతా...గురువు అవుతా...పనిమనిషి తనమనిషవుతా...
నే చెప్పే ప్రతిమాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలి ...
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంట...
మా మంచి పాట సిమ్మాద్రి పాట మనసారా వినమంట
తన తియ్యని పాటే అమ్మ పాడేలాలీ...తనతోడే ఉంటే అది దీపావళీ...
మా ఇద్దరి స్నేహం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి         

Gangotri : Mavayyadi Mogalthooru Song Lyrics (మావయ్యది మొగల్తూరు)

చిత్రం : గంగోత్రి (2003)

గీత రచయిత : చంద్రబోస్

నేపధ్య గానం: మనో, స్మిత

సంగీతం : ఎం.ఎం.కీరవాణి


పల్లవి:

మ్మ...మ్మ...మ్మ.......మ్మ...మ్మ...మ్మ...మ్మ...మ్మ
మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు
మ్మ...మ్మ...మ్మ.......మ్మ...మ్మ...మ్మ...మ్మ...మ్మ
మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు
మనువాడే ఈడు నాకు వచ్చిందంటూ
మగవాళ్ళ మధ్యన తిరగొద్దంటున్నారు
మావయ్యా...మా నాన్నా... పి పి పీ పీ పిల్లా నిను మెప్పిస్తానే నీ పెద్దళ్ళోను ఒప్పిస్తానే
పిడికెడంత నడుముదాన పెళ్లికి సై అంటే
పిఠాపురం నుండి నేను పల్లకి తెప్పిస్తానే
డుంమారే డువ్వ డుండుం డంమారే డవ్వ డండం...


చరణం 1:

నేనేమో మాష్టారిని నువ్వేమో స్టూడెంట్ వి ఇద్దరికి కుదిరేనే పిల్లా మన కధ సుందరకాండేనే పిల్లోయ్ పాఠాలే వినకున్నా ప్రయివేట్ కి రాకున్నా బెత్తంతో కొట్టేద్దే సారూ కొడితె మెత్తంగా కొట్టులే సారూ బెంచి మీద నిలబెట్టను, గోడకుర్చీ వేయించను నా ఒళ్లో కూర్చోనే పిల్లా నీకిక వంద మార్కులేస్తానేపిల్లా... మాష్టారూ....మాష్టారూ ...నీకెందుకు ఈ పాడు బుద్దులు పెద్దోళ్ల్కి తెలిసిందా అవుతుంది నీ బాక్సు బద్దలు మ...మ...మ... మామయ్యది మొగల్తూరు మీ నాన్నది పాలకొల్లు...నాకు తెలుసు ...కో: హైస్సా...హైస్సా...హైస్సా....హైస్సా...

చరణం 2: .

నా లాంటి పిల్లతోటి కళ్యాణం కోరుకుంటే పెళ్లానివి నువ్వేనోయ్ సారూ.... నీకు పెనిమిటి నేనవుతానోయ్ సారూ అతిలోక సుందరి నా జతకొచ్చి వాలుతుంటే అన్నిటికి దూకేనే పిల్లా... అటు ఇఅటు అయినా పర్లేదే పిల్లా.... నాలాంటి కన్నెతోటి కాపురమే చేశావో కధ అడ్డం తిరుగుతుంది సారూ... ఆపై నీ కడుపే పండుతుంది సారూ... మాష్టారూ... మాష్టారు... స్టూడెంట్ మీకు కాదు జోడు మావయ్యకి తెలిసిందో మిమ్మల్ని వెంబడిస్తాడు

మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు

Gangotri : Nuvvu Nenu Kalisunte Song Lyrics (నువ్వు నేను కలిసుంటేనే )

చిత్రం : గంగోత్రి (2003)

గీత రచయిత : చంద్రబోస్

నేపధ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మాళవిక

సంగీతం : ఎం.ఎం.కీరవాణి


పల్లవి:

లాలలలాల లాలలలాల లాలల లాలాలా లల లాలా లాలా… లల లాలా లాలా లాలా లాలా లా నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా, ఆఆ ఆ నువ్వక్కడుండి నేనిక్కడుంటే నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం

చరణం 1:

ఎగరేసిన గాలిపటాలే ఎదలోతుకు చేరుతాయని రుచి చూసిన కాకెంగిళ్లే అభిరుచులను కలుపుతాయని తెగ తిరిగిన కాలవగట్లే కథ మలుపులు తిప్పుతాయని మనమాడిన గుజ్జనగూళ్లే ఒక గూటికి చేర్చుతాయని లాలించి పెంచినవాడే ఇకపై నను పరిపాలిస్తాడని తెలిశాకా, ఆ ఆ నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం

చరణం 2:

ఆ బడిలో పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని ఆ రైలు పట్టాలే పల్లకినీ పంపుతాయనీ రాళ్లల్లో మన పేర్లే… శుభలేఖలు చూపుతాయనీ ఆ బొమ్మల పెళ్లిళ్లే… ఆశీస్సులు తెలుపుతాయనీ తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయనీ తెలిశాకా, ఆ ఆఆ నువ్వక్కడుండి నేనిక్కడుంటే నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా, ఆ ఆఆ నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం లాలలలాల లాలలలాల లాలలాలాలా లాలలలాల లాలలలాల లాలలాలాలా

19, జనవరి 2025, ఆదివారం

Gangotri : Oka Thotalo Song Lyrics (ఒక తోటలో.. ఒక కొమ్మలో.. )

చిత్రం : గంగోత్రి (2003)

గీత రచయిత : చంద్రబోస్

నేపధ్య గానం: ఎస్. పి. బి. చరణ్, మాళవిక

సంగీతం : ఎం.ఎం.కీరవాణి


పల్లవి:
ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది
మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది
అలాగే నవ్వుతూ ఉండాలని...
అలాగే నవ్వుతూ ఉండాలని
నింగినేల.. వాగువంక.. చెట్టుచేమ.. గువ్వగూడు..
ఆశీర్వదించాలి ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది
మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది
చరణం 1:
ఎన్నో రంగుల పువ్వు.. ఎండ కన్నే ఎరగని పువ్వు
సుందరమైన పువ్వు.. పలు సుగుణాలున్న పువ్వు
ఏ గుడిలో అడుగుపెట్టునో...
దేవుడు చల్లగ చూడాలి
ఆ పువ్వుకు పూజలు చేయాలి
దేవుడి గుండెల గుడిలో... ఆ పువ్వే.. హాయిగ ఉండాలి ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది
చరణం 2:
నీరును పోసి పెంచి.. పందిరల్లే నీడనిచ్చి
ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి
ఆ పువ్వుకి తోడు ఉండగా...
దేవుడు వేరే లేడు కదా
తోటమాలే పువ్వుకి దేవుడుగా
మాలికి పువ్వుకు మధ్యన
అనుబంధం... ఎన్నడూ వాడదుగా ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది
మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది

Gangotri : Jevana Vahini Song Lyrics (జీవన వాహినీ..... పావనీ.....)

చిత్రం : గంగోత్రి (2003)

గీత రచయిత : వేటూరి సుందర రామమూర్తి

నేపధ్య గానం: ఎం.ఎం.కీరవాణి. గంగ, కల్పన

సంగీతం : ఎం.ఎం.కీరవాణి



పల్లవి:
ఓం... ఓం...
జీవన వాహినీ..... పావనీ.....
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులుతుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయముదీర్చి శుభముకూర్చు గంగాదేవీ
నిను కొలిచిన చాలునమ్మ సకలలోకపావని
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి...
గంగోత్రీ... గంగోత్రీ...
గంగోత్రీ... గంగోత్రీ...
గలగలగల గంగోత్రి ...హిమగిరి దరి హరిపుత్రి
గలగలగల గంగోత్రి ...హిమగిరి దరి హరిపుత్రి
జీవన వాహినీ... పావనీ....
చరణం 1:
మంచుకొండలో ఒక కొండవాగులా..
ఇల జననమొందిన విరజావాహినీ
విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా ...
శివగిరికి చేరిన సురగంగ నీవనీ
అత్తింటికి సిరులనొసగు అలకనందవై...
సగరకులము కాపాడిన భాగీరథివై
బదరీవన.. హృషీకేశ.. హరిద్వార.. ప్రయాగముల.. మణికర్ణిక..
తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రీ....గంగోత్రీ....
గంగోత్రీ... గంగోత్రీ...
గలగలగల గంగోత్రి ...హిమగిరి దరి హరిపుత్రి
గలగలగల గంగోత్రి ...హిమగిరి దరి హరిపుత్రి
చరణం 2:
పసుపూ కుంకుమతో పాలూ పన్నీటితో
శ్రీగంధపుధారతో పంచామృతాలతో....
అంగాంగము తడుపుతూ దోషాలను కడుగుతూ
గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం...
అమ్మా... గంగమ్మా....
కృష్ణమ్మకు చెప్పమ్మా... కష్టం కలిగించొద్దని
యమునకు చెప్పమ్మా ...సాయమునకు వెనకాడొద్దని...
గోదారికి ..కావేరికి... ఏటికి సెలయేటికి కురిసేటి
జడివానకి దూకే జలపాతానికి నీ తోబుట్టువులందరికీ చెప్పమ్మా...
మా గంగమ్మా... జీవనదివిగా ఒక మోక్షనిధివిగా పండ్లుపూలు పసుపులా పారాణి రాణిగా...
శివుని జటనమే తన నాట్య జతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగా... గండాలను పాపాలను కడిగివేయగా...
ముక్తినదిని మూడు మునకలే చాలుగా...
జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని..
ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ గంగోత్రీ....గంగోత్రీ
గంగోత్రీ... గంగోత్రీ...
గలగలగల గంగోత్రి... హిమగిరి దరి హరిపుత్రి
గలగలగల గంగోత్రి... హిమగిరి దరి హరిపుత్రి జీవన వాహినీ..... పావనీ.....