చిత్రం: గోకులంలో సీత (1997)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కోటి
పల్లవి:
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా వలపుల వనమా ఆ...ఆ...ఆ... వెలుగుల వరమా ఆ..ఆ..ఆ... ఈ యదలో కొలువుందువు రావమ్మా... ఓ ఓ..ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా చరణం:1
ఎంత మథనమో జరగకుండ ఆ పాలకడలి కదిలిందా అమృతకలశమందిందా ఎన్ని ఉరుములో విసరకుండ ఆ నీలినింగి కరిగిందా నేల గొంతు తడిపిందా ప్రతి క్షణం హృదయం అడగనిదే చలువనీయవ ప్రేమా ప్రకృతిలో ప్రళయం రేగనిదే చిగురు తొడగవా ప్రేమా అణువణువూ సమిధలాయే ఈ యాగం శాంతించేదెపుడమ్మా ఓ..ఓ..ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా చరణం:2
ఆయువంత అనురాగదేవతకి హారతీయదలిచాడు ఆరిపోతు ఉన్నాడు మాయమైన మమకారమేది అని గాలినడుగుతున్నాడు జాలి పడవా ఈనాడు నిలువునా రగిలే వేదనలో విలయజ్వాలలు చూడు ప్రణయమే గెలిచే మధురిమతో చెలిమి జోలలు పాడు నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమౌతాడోనమ్మా ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా వలపుల వనమా ఆ..ఆ..ఆ.. వెలుగుల వరమా ఆ..ఆ..ఆ.. ఈ యదలో కొలువుందువు రావమ్మా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి