Gokulamlo Seetha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gokulamlo Seetha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జనవరి 2025, శుక్రవారం

Gokulamlo Seetha : Andala Seemaloni Song Lyrics (అందాల సీమలోని పారిజాత పుష్పమా)

చిత్రం: గోకులంలో సీత (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: మనో, కె. ఎస్. చిత్ర

సంగీతం: కోటి


పల్లవి: అందాల సీమలోని పారిజాత పుష్పమా ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా వరించి నన్ను చేరుమా... సుఖాన ముంచి తేల్చుమా... ప్రియాతి ప్రియతమా ఇదేమి సరిగమా శృంగార వీణ మీటి గోల చేస్తే న్యాయమా అందాల సీమలోని పారిజాత పుష్పమా ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా చరణం 1: రా రమ్మంది లేత చెక్కిలి రేపెట్టింది కొత్త ఆకలి సిగ్గు మొగ్గ మేలుకుంది తియ్యగా తేనె ముద్దలారగించు హాయిగా అంత భాగ్యమా పంచ ప్రాణమా ఒడిలో చేరనీయుమా..హో అందాల సీమలోని పారిజాత పుష్పమా ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా చరణం 2: లాగించేస్తే ప్రేమ జిలేబి ఏమౌతుందో కన్నే గులాబి పాలపొంగులాంటిదమ్మ కోరిక పైటచాటు దాచుకోకే ప్రేమికా కొంగుజారితే కొంపమునగదా వాటే రిస్కు మన్మథా అందాల సీమలోని పారిజాత పుష్పమా ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా వరించి నన్ను చేరుమా సుఖాన ముంచి తేల్చుమా ప్రియాతి ప్రియతమా ఇదేమి సరిగమా శృంగార వీణ మీటి గోల చేస్తే న్యాయమా మ్మ్..మ్మ్..మ్మ్...

Gokulamlo Seetha : Oo Andi Pilla Song Lyrics (ఊ అంది పిల్లా అల్లో మల్లాసా)

చిత్రం: గోకులంలో సీత (1997)

సాహిత్యం: భువనచంద్ర

గానం: మురళీధర్, స్వర్ణలత

సంగీతం: కోటి


పల్లవి :

ఊ అంది పిల్లా అల్లో మల్లెషా తెల్లారేకల్లా పెళ్ళే పరమేశా వేవేల ఆశలతో వస్తుంది పూబాల మెల్లోన మురిపెంగా వేస్తుంది వరమాల హో ఊ అంది పిల్లా అల్లో మల్లెషా తెల్లారేకల్లా పెళ్ళే పరమేశా

చరణం : 1

ఎల్లోరా సిల్పమల్లే నువ్వు కూర్చంటే
నిండుగా నేను చూస్తుంటే...
ఉప్పొంగే ఊహలేవో వెన్ను తడుతుంటే
ఎదే బరువెక్కిపోతుంటే...
శుభమంత్రాలే వినబడుతుంటే
పచ్చని తాళి నువ్వు కడుతుంటే.
ఎన్నెన్నో జన్మల బంధం నిన్ను నన్ను ఏకం చేస్తుంటే...
ఊ అంది పిల్లా అల్లో మల్లెషా
ఓ... నీ నీడ నేనై ఉంటా పరమేశా

చరణం : 2

తీగంటి చూపుతో నే సైగ చేస్తుంటే నువ్వేమో సిగ్గు పడుతుంటే... నాపైన వెచ్చగా నువ్వు వాలిపోతుంటే వొల్లంతా కాలిపోతుంటే. మల్లేల మంచం వొనికేస్తుంటే వెన్నెల రేయి వరదౌతుంటే. తమకంతో జారే పైట రారమ్మంటూ కవ్విచేస్తుంటే... ఊ అంది పిల్లా అల్లో మల్లాసా ఓ... పరువాల దాహం తీర్చేయ్ పరమేశా కవ్వించే అందాలు కల్లార చూడాల కౌగిల్ల జాతరలో తెల్లారిపోవాల ఊ అంది పిల్లా అల్లో మల్లాసా లాలాల లాలా లాలా లాలా

Gokulamlo Seetha : Gokula Krishna Gopala Krishna Song Lyrics (గోకుల కృష్ణా గోపాల కృష్ణా )

చిత్రం: గోకులంలో సీత (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: కె. ఎస్. చిత్ర, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: కోటి


పల్లవి :

ఘల్లు ఘల్లుమని మువ్వా సవ్వడుల ముద్దు బాలుడేవారే వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే ఆ ఆ ఆఆ ఆ ఆ

గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్య జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా


చరణం : 1 ఏ నోట విన్నా నీ వార్తలేనా కొంటె చేష్టలేలరా కోణంగిలా ఆ.. ఊరంతా చేరి ఏమేమి అన్నా కల్లబొల్లి మాటలే నా రాధికా చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా తెలియని లీలలతో తికమక చేయకయా మనసును చూడకనే మాటలు విసరకలా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

చరణం : 2

ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా అంతతోనే ఆగెనా ఆ బాలుడు ఆ.. అవతార మూర్తిగా తన మహిమ చాటెగా లోకాల పాలుడు గోపాలుడు తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు కనుకనే అతని కధా తరములు నిలిచె కదా తలచిన వారి ఎద తరగని మధుర సుధ జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే గోకుల కృష్ణా గోపాల కృష్ణా ఆటలు చాలయ్యా అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా అందెల సందడితో గుండెలు మురిసెనురా నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే




Gokulamlo Seetha : Manasunna Manishi Song Lyrics (మనసున్న కనులుంటే )

చిత్రం: గోకులంలో సీత (1997)

సాహిత్యం: భువనచంద్ర

గానం: కె. ఎస్. చిత్ర, మాల్గాడి శుభ

సంగీతం: కోటి


పల్లవి:

తళుక్ తళుక్ మని తళుకుల తార మిణుక్ మిణుక్ మని మిలమిల తార ఛమక్ ఛమక్ మని చిలిపి సితార ఓ ఓ… (2) హా… ఆ… లాల లాల లాలా లాలలా మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించదా బంగారు భావాల ప్రియగీతం రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా… తళుక్ తళుక్ మని తళుకుల తార మిణుక్ మిణుక్ మని మిలమిల తార ఛమక్ ఛమక్ మని చిలిపి సితార ఓ ఓ… (2) మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా… చరణం: 1

అలలై ఎగసిన ఆశా నాట్యం చేసే వేళా అలుపే ఎరుగని శ్వాసా రాగం తీసే వేళా దిశలన్నీ తలవొంచి తొలగే క్షణం ఆకాశం పలికింది అభినందనం అదిగదిగో మనకోసం తారాగణం తళుకులతో అందించే నీరాజనం మన దారికెదురున్నదా… మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా చరణం: 2

నవ్వే పెదవులపైన ప్రతి మాట ఒక పాటే ఆడే అడుగులలోన ప్రతి చోట పూబాటే గుండెల్లో ఆనందం కొలువున్నదా ఎండైనా వెన్నెల్లా మురిపించదా కాలాన్నే కవ్వించే కళ ఉన్నదా కష్టాలు కన్నీళ్ళు మరిపించదా జీవించడం నేర్పదా… మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించదా బంగారు భావాల ప్రియగీతం రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా… లాలాల లలలాల లలలాల లలలాల లాలాల (2)

Gokulamlo Seetha : Prema Oh Prema Song Lyrics (ప్రేమా ప్రేమా )

చిత్రం: గోకులంలో సీత (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: కోటి



పల్లవి:

ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా వలపుల వనమా ఆ...ఆ...ఆ... వెలుగుల వరమా ఆ..ఆ..ఆ... ఈ యదలో కొలువుందువు రావమ్మా... ఓ ఓ..ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా చరణం:1

ఎంత మథనమో జరగకుండ ఆ పాలకడలి కదిలిందా అమృతకలశమందిందా ఎన్ని ఉరుములో విసరకుండ ఆ నీలినింగి కరిగిందా నేల గొంతు తడిపిందా ప్రతి క్షణం హృదయం అడగనిదే చలువనీయవ ప్రేమా ప్రకృతిలో ప్రళయం రేగనిదే చిగురు తొడగవా ప్రేమా అణువణువూ సమిధలాయే ఈ యాగం శాంతించేదెపుడమ్మా ఓ..ఓ..ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా చరణం:2

ఆయువంత అనురాగదేవతకి హారతీయదలిచాడు ఆరిపోతు ఉన్నాడు మాయమైన మమకారమేది అని గాలినడుగుతున్నాడు జాలి పడవా ఈనాడు నిలువునా రగిలే వేదనలో విలయజ్వాలలు చూడు ప్రణయమే గెలిచే మధురిమతో చెలిమి జోలలు పాడు నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమౌతాడోనమ్మా     ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా వలపుల వనమా ఆ..ఆ..ఆ.. వెలుగుల వరమా ఆ..ఆ..ఆ.. ఈ యదలో కొలువుందువు రావమ్మా

Gokulamlo Seetha : Podderani Song Lyrics (పొద్దే రాని లోకం నీది)

చిత్రం: గోకులంలో సీత (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: కె. ఎస్. చిత్ర

సంగీతం: కోటి


పల్లవి :

పొద్దే రాని లోకం నీది...నిద్రేలేని మైకం నీది

పొద్దే రాని లోకం నీది...నిద్రేలేని మైకం నీది పాపం ఏ లాలి పాడాలి జాబిలీ అయినా ఏ గోల వింటుంది నీ మది వేకువ నైనా .... వెన్నెల నైనా చూడని కళ్లే తెరిచేలా ఇలా ...నిను లాలించే గాలే లెమ్మని మిత్రమా మిత్రమా మైకమే లోకమా.. మెల్లగా చల్లగా మేలుకో నేస్తామా

చరణం : 1

ఎన్నో రుచులు గల బ్రతుకుందీ ఎన్నో ఋతువులతో పిలిచిందీ చేదొక్కటే నీకు తెలుసున్నది రేయోక్కటే నువ్వు చూస్తున్నది ఉదయాలనే వెలివేస్తానంటావా? కలకాలము కలలోనే ఉంటావా నిత్యమూ నిప్పు నే తాగినా తీరని నీ దాహం తీర్చే కన్నీరీది మిత్రమా మిత్రమా మైకమే లోకమా మిత్రమా మిత్రమా శూన్యమె స్వర్గమా

చరణం : 2

నీలో చూడు మంచి మనసుంది ఏదో నాడు మంచు విదుతున్ధి వాల్మీకీ లో ఋషి ఉదయించినా వేమన్నలో భోగి నిదురించినా మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా మలినాలనే మసి చేస్తూ మండేలా అగ్నిలో కాలినా స్వర్ణమై తేలగా నిను తాకిందేమో ఈ వేదనా మిత్రమా మిత్రమా మట్టి లో రత్నమా మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా