6, జనవరి 2025, సోమవారం

Gorintaku : Ela ela daachavu Song Lyrics (ఎలా ఎలా దాచావు)

చిత్రం: గోరింటాకు (1979)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల


పల్లవి: ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ.. ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ.... చరణం 1: పిలిచి పిలిచినా..పలుకరించినా ..పులకించదు కదా నీ ఎదా ఉసురొసుమనినా...గుసగుసమనినా ఊగదేమది నీ మది... నిదుర రాని నిశిరాతురులెన్నో...నిట్టూరుపులెన్నో... నోరులేని ఆవేదనలెన్నో...ఆరాటములెన్నో... ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ.. ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ.... చరణం 2: తలుపులు తెరుచుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా? తెరిచి ఉందనీ వాకిటి తలుపు... చొరబడతారా ఎవరైనా? దొరవో... మరి దొంగవో దొరవో... మరి దొంగవో దొరికావు ఈనాటికీ.... దొంగను కానూ...దొరనూ కానూ.. దొంగను కానూ...దొరనూ కానూ...నంగనాచినసలే కానూ.... ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి