Gorintaku లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gorintaku లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జనవరి 2025, సోమవారం

Gorintaku : Ilaaga vacchi alaaga tecchi song lyrics (ఇలాగ వచ్చి అలాగ తెచ్చి )

చిత్రం: గోరింటాకు (1979)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: శ్రీ శ్రీ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల


పల్లవి:
ఇలాగ వచ్చి అలాగ తెచ్చి
ఎన్నో వరాల మాలలు గుచ్చి
నా మెడ నిండా వేశావు
నన్నో మనిషిని చేశావు
ఎలాగా తీరాలి నీ ఋణమెలాగ తీరాలి తీరాలంటే దారులు లేవా
కడలి కూడా తీరం లేదా
అడిగినవన్నీ ఇవ్వాలీ
అడిగినప్పుడే ఇవ్వాలీ
అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలి
చరణం 1:
అడిగినప్పుడే వరమిస్తారు.. ఆకాశంలో దేవతలు
అడగముందే అన్నీ ఇచ్చే.. నిన్నే పేరున పిలవాలీ
నిన్నే తీరున.. కొలవాలీ అసలు పేరుతో నను పిలవద్దు
అసలు కన్నా వడ్డీ ముద్దు
ముద్దు ముద్దుగా ముచ్చట తీర
పిలవాలీ.. నను కొలవాలీ అలాగ తీరాలీ.. నా ఋణమలాగ తీరాలీ
చరణం 2:
కన్నులకెన్నడూ కనగరానిది
కానుకగా నేనడిగేదీ అరుదైనది నీవడిగేది
అది నిరుపేదకెలా దొరికేది
ఈ నిరుపేదకెలా దొరికేది నీలో ఉన్నది.. నీకే తెలియదు
నీ మనసే నే కోరుకున్నది అది నీకెపుడో ఇచ్చేశానే
నీ మదిలో అది చేరుకున్నదీ ఇంకేం?...
ఇలాగ తీరిందీ.. మన ఋణమిలాగ తీరింది
ఇలాగ తీరిందీ.. మన ఋణమిలాగ తీరింది

Gorintaku : Ela ela daachavu Song Lyrics (ఎలా ఎలా దాచావు)

చిత్రం: గోరింటాకు (1979)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల


పల్లవి: ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ.. ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ.... చరణం 1: పిలిచి పిలిచినా..పలుకరించినా ..పులకించదు కదా నీ ఎదా ఉసురొసుమనినా...గుసగుసమనినా ఊగదేమది నీ మది... నిదుర రాని నిశిరాతురులెన్నో...నిట్టూరుపులెన్నో... నోరులేని ఆవేదనలెన్నో...ఆరాటములెన్నో... ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ.. ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ.... చరణం 2: తలుపులు తెరుచుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా? తెరిచి ఉందనీ వాకిటి తలుపు... చొరబడతారా ఎవరైనా? దొరవో... మరి దొంగవో దొరవో... మరి దొంగవో దొరికావు ఈనాటికీ.... దొంగను కానూ...దొరనూ కానూ.. దొంగను కానూ...దొరనూ కానూ...నంగనాచినసలే కానూ.... ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ

Gorintaku : Gorinta Poochindi Song Lyrics (గోరింట పూచింది కొమ్మలేకుండా )

చిత్రం: గోరింటాకు (1979)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి

గానం: పి. సుశీల


పల్లవి: గోరింట పూచింది కొమ్మలేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది గోరింట పూచింది కొమ్మలేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది ఎంచక్కా పండిన ఎర్రని చుక్క చిట్టీపేరంటానికి కలకాలం రక్ష చరణం 1: మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు సందే వన్నెల్లోన సాగే మబ్బెరుపు తానెరుపు అమ్మాయి తనవారిలోన.. గోరింట పూచింది కొమ్మలేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

చరణం 2: మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు చరణం 3: పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో పచ్చాకామెర్లు కోపిష్టి కళ్ళల్లో కొరివిమంటల్లు గోరింట పూచింది కొమ్మలేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది




Gorintaku : Cheppanaa..Siggu vidichi Song Lyrics (చెప్పనా...సిగ్గు విడిచి)

చిత్రం: గోరింటాకు (1979)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల


పల్లవి:
చెప్పనా...సిగ్గు విడిచి చెప్పరానివీ...
చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి...
చెప్పనా...చెప్పనా...చెప్పనా.... అడగనా...నోరు తెరిచి అడగరానివి...ఈ..
అడకుంటే నీకు నీవే ఇవ్వలేనివీ...ఈ..
అడగనా...అడగనా...అడగనా.... చెప్పనా...సిగ్గు విడిచి చెప్పరానివి....
అడగనా...నోరు తెరిచి అడగరానివి....
చరణం 1:
చెప్పమనీ...చెప్పకుంటే ఒప్పననీ...
చెప్పి చెప్పి నా చేత చెప్పించుకున్నవి చెప్పనా? అడగమనీ...అడగకుంటే జగడమనీ...
అడిగి అడిగి నా చేత అడిగించుకున్నవి అడగనా? అడుగు మరి...చెప్పు మరి...
అడుగు మరి...చెప్పు మరి... చెప్పితే అల్లరి... అడిగితే తుంటరి...
చెప్పనా...సిగ్గు విడిచి చెప్పరానివి...
అడగనా...నోరు తెరిచి అడగరానివి...
చరణం 2:
నిన్న రాత్రి వచ్చి...సన్న దీప మార్పి...
పక్క చేరి నిదురపోవు సోయగాన్ని...
వీపుతట్టి రెచ్చగొట్టి కలలాగ వెళ్లిపోతే...
పిల్ల గతి...కన్నెపిల్ల గతి ఏమిటో...చెప్పనా... పగటి వేళ వచ్చి పరాచకలాడి...
ఊరుకొన్న పడుచువాణ్ణి ఉసిగొలిపి...
పెదవి చాపి.. పిచ్చి రేపి ఇస్తానని ఊరిస్తే...
ఇవ్వమనీ...ఇచ్చి చూడమని ముద్దులే అడగనా... వద్దని...హద్దు దాట వద్దనీ...
అన్న కొద్ది ముద్దు చేసి కొసరి తీసుకున్నవి చెప్పనా... నేననీ..వేరనేది లేదనీ...అనీ అనీ...ఆగమని..
ఆపుతున్నదెందుకని అడగనా.... అడుగు మరి...చెప్పు మరి...
అడుగు మరి...చెప్పు మరి... చెప్పితే అల్లరి... అడిగితే తుంటరి...
అడగనా...అడగనా...అడగనా....
చెప్పనా... సిగ్గు విడిచి చెప్పరానివి...
అడగనా... నోరు తెరిచి అడగరానివి...



Gorintaku : Paadithe Silalainaa Karagaali Song Lyrics (పాడితే శిలలైన కరగాలి)

చిత్రం: గోరింటాకు (1979)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: పి. సుశీల


పల్లవి :
పాడితే శిలలైన కరగాలి
పాడితే శిలలైన కరగాలి... జీవిత గతులైన మారాలి నా పాటకు ఆ బలమున్నదో లేదో... పాడిన పిదపే తెలియాలి
నా పాటకు ఆ బలమున్నదో లేదో... పాడిన పిదపే తెలియాలి
పాడితే శిలలైన కరగాలి చరణం 1 :
నీ పాటతోటి నే పగిలిపోవలే... పాడమన్నది హృదయం
నీ పాటతోటి నే పగిలిపోవలే... పాడమన్నది హృదయం పెగలిరాక నా పాట జీరగా... పెనుగులాడినది కంఠం
పెగలిరాక నా పాట జీరగా... పెనుగులాడినది కంఠం గొంతుకు గుండెకు ఎంత దూరం...
గొంతుకు గుండెకు ఎంత దూరం... ఆశనిరాశకు అంతే దూరం
ఆశనిరాశకు అంతే దూరం... పాడితే శిలలైన కరగాలి... జీవిత గతులైన మారాలి
నా పాటకు ఆ బలమున్నదో లేదో... పాడిన పిదపే తెలియాలి
పాడితే శిలలైన కరగాలి చరణం 2 :
తాళి కట్టెడి వేళ కోసమే వేచి చూసినది విరిమాలా
కట్టే వేళకు కట్టని తాళిని కత్తిరించినది విధిలీలా వేచిన కళ్ళకు కన్నీళ్ళా.... వేయని ముడులకు నూరేళ్ళా
నా పాటకు పల్లవి మారేనా... ఈ పగిలిన గుండె అతికేనా
ఈ చితికిన బ్రతుకిక బ్రతికేనా.....




5, మార్చి 2022, శనివారం

Gorintaku : Komma Kommako Sannayi Song Lyrics (కొమ్మ కొమ్మకో సన్నాయి)

చిత్రం: గోరింటాకు (1979)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: కే.వీ.మహదేవన్


పల్లవి:

కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి మనసులో ధ్యానం మాటలో మౌనం మనసులో ధ్యానం మాటలో మౌనం

చరణం 1:

మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతను చూడు పరుచుకున్న మమతను చూడు పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బును చూడు అందుకే ధ్యానం అందుకే మౌనం కొమ్మ కొమ్మకో సన్నాయి.......

చరణం 2:

కొంటె వయసు కోరికలాగ గోదారి ఉరకలు చూడు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు కొంటె వయసు కోరికలాగ గోదారి ఉరకలు చూడు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు ఒడ్డుతోనూ...నీటితోనూ పడవ ముడి పడి వుండాలి ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి అందుకే ధ్యానం అందుకే మౌనం అందుకే ధ్యానం అందుకే మౌనం

కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి మనసులో ధ్యానం మాటలో మౌనం మనసులో ధ్యానం మాటలో మౌనం