చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి. సుశీల
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
పల్లవి:
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పారిహాసాలాడినవి
విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పారిహాసాలాడినవి ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో

చరణం 1:
పొదరింటన ఒంటరి పావురము
తన జంటను కలియగ వేచినది మనసే తెలిసి తన ప్రేయసికై
మగ పావురమే దరిచేరింది ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో
తన జంటను కలియగ వేచినది మనసే తెలిసి తన ప్రేయసికై
మగ పావురమే దరిచేరింది ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో
చరణం 2:
నీ కురులను రేపిన చిరుగాలి
నామదిలో కోరిక రేపినది వలపే తెలిపే కనుసైగలతో
నీ ఊసులు బాసలు చేసాయి ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో
నామదిలో కోరిక రేపినది వలపే తెలిపే కనుసైగలతో
నీ ఊసులు బాసలు చేసాయి ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో
చరణం 3:
నదిలో మెరిసే కదిలే కాంతి..
నదిలో మెరిసే కదిలే కాంతి...
నా మోమున తళ తళ లాడింది నీ చక్కని చెక్కిలి అద్దాన
నా రూపము నేనే చూశాను ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో...
విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పారిహాసాలాడినవి ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో
నదిలో మెరిసే కదిలే కాంతి...
నా మోమున తళ తళ లాడింది నీ చక్కని చెక్కిలి అద్దాన
నా రూపము నేనే చూశాను ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో...
విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పారిహాసాలాడినవి ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి