Iddaru Mithrulu (1961) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Iddaru Mithrulu (1961) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జనవరి 2025, శుక్రవారం

Iddaru Mithrulu (1961) : Srirama Song Lyrics (శ్రీరామ నీనామ మెంతో రుచిరా )

చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)

సాహిత్యం: కొసరాజు

గానం: మాధవపెద్ది సత్యం

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు



పల్లవి:
శ్రీరామ నీనామ మెంతో రుచిరా
ఓ రామా నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీ నామమెంతో రుచిరా పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా
శ్రీరామ.. ఓహో శ్రీరామ నీ నామమెంతో రుచిరా
చరణం 1:
తప్పులు చేయుట మా వంతు దండన పొందుట మా వంతు ..
యమ దండన పొందుంట మా వంతు
తప్పులు చేయుట మా వంతు.. యమ దండన పొందుట మా వంతు పాపం చేయుట మా వంతు దయ చూపించటమే నీ వంతు శ్రీరామ.. ఓహో శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీ నామమెంతో రుచిరా శ్రీమద్రమారమణ.. గోవిందో.. హారి..
చరణం 2:
రాతినే ఇల నాతిగా మార్చి కోతికే పలు నీతులు నేర్పి
రాతినే ఇల నాతిగా మార్చి కోతికే పలు నీతులు నేర్పి
మహిమలెన్నో చూసిన దేవా మము బ్రోవా రాలేవా
రాతినే ఇల నాతిగా మార్చి కోతికే పలు నీతులు నేర్పి
మహిమలెన్నో చూసిన దేవా మము బ్రోవా రాలేవా శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీ నామమెంతో రుచిరా శ్రీరామా .. శ్రీరామా
హే శ్రీరామా..శ్రీ రామా
జై ఓ రామా.. శ్రీ రామా
శ్రీరామా .. శ్రీరామా
హే శ్రీరామా..శ్రీ రామా
జై ఓ రామా.. శ్రీ రామా
జై ఓ రామా.. శ్రీ రామా శ్రీమద్రమారామణ... గోవిందో... హారి

Iddaru Mithrulu (1961) : Chakkani Chukka Sarasaku Raave Song Lyrics (చక్కని చుక్క సరసకు రావే )

చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)

సాహిత్యం: ఆరుద్ర

గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు


పల్లవి: చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే ఉక్కిరి బిక్కిరి అయిపోతానే... ఏ... ఏ... ఏ... టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే... ఏ... ఏ... ఏ... చరణం 1: అల్లరి పిల్లా ఆపవేలా పుల్లవిరుపు మాటలు అల్లరి పిల్లా ఆపవేలా పుల్లవిరుపు మాటలు పెళ్ళాం కనబడితే ప్రేమే కలిగిందా పెళ్ళాం కనబడితే ప్రేమే కలిగిందా పెళ్ళామంటే బెల్లము తల్లిదండ్రి అల్లము టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే చరణం 2: ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయెనే ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయెనే పెద్దలు గర్జిస్తే పెడసరమవుతావా పెద్దలు గర్జిస్తే పెడసరమవుతావా పెద్దల గొడవ ఎందుకే ఇద్దరమొకటై ఉందామే చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే ఉక్కిరి బిక్కిరి అయిపోతానే... ఏ... ఏ... ఏ... చరణం 3: నాయనగారి మీసమూ చూస్తేనే సన్యాసము మీ నాయనగారి మీసమూ చూస్తేనే సన్యాసము అబ్బా అబ్బబ్బ నీ మాటలు కొరడాదెబ్బలు అబ్బా అబ్బబ్బ నీ మాటలు కొరడాదెబ్బలు సూటిగా పెళ్ళాడి చాటుగ రానేలా సూటిగా పెళ్ళాడి చాటుగ రానేలా చేయకు నన్ను దూరము తీయకు మీ నా ప్రాణము చేయకు నన్ను దూరము తీయకు మీ నా ప్రాణము టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే... ఏ... ఏ... ఏ... చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే ఉక్కిరి బిక్కిరి అయిపోతానే... ఏ... ఏ... ఏ...

Iddaru Mithrulu (1961) : Ee Musi Musi Navvulu Song Lyrics (ఈ ముసి ముసి నవ్వుల)

చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)

సాహిత్యం: ఆరుద్ర

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు



పల్లవి:
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పారిహాసాలాడినవి
విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పారిహాసాలాడినవి ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో
చరణం 1:
పొదరింటన ఒంటరి పావురము
తన జంటను కలియగ వేచినది మనసే తెలిసి తన ప్రేయసికై
మగ పావురమే దరిచేరింది ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో

చరణం 2:
నీ కురులను రేపిన చిరుగాలి
నామదిలో కోరిక రేపినది వలపే తెలిపే కనుసైగలతో
నీ ఊసులు బాసలు చేసాయి ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో

చరణం 3:
నదిలో మెరిసే కదిలే కాంతి..
నదిలో మెరిసే కదిలే కాంతి...
నా మోమున తళ తళ లాడింది నీ చక్కని చెక్కిలి అద్దాన
నా రూపము నేనే చూశాను ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో...
విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పారిహాసాలాడినవి ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో

17, మార్చి 2022, గురువారం

Iddaru Mithrulu (1961) : Oho Oho Ninne Korega song lyrics (ఓహొ ఓహొ నిన్నే కోరెగా)

చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)

సాహిత్యం: శ్రీ శ్రీ

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు


పల్లవి:

ఓహొ ఓహొ నిన్నే కోరెగా కుహుకుహూ అని కోయిలా 

ఓహొ ఓహొ నిన్నే కోరెగా కుహుకుహూ అని కోయిలా వసంతవేళలా పసందు మీరగా అపూర్వగానమే ఆలపించే తీయగా 

ఓహొ ఓహొ నిన్నే కోరెగా కుహుకుహూ అని కోయిలా

చరణం 1

అదా కోరికా వయ్యారి కోయిలా జగాలే నీ చూపులో జలదిరించెనే అదా కోరికా వయ్యారి కోయిలా జగాలే నీ చూపులో జలదిరించెనే వరాల నవ్వులే గులాబి పువ్వులై వలపు తేనె నాలోన చిలకరించెనే

ఓహొ ఓహొ నిన్నే కోరెగా కుహుకుహూ అని కోయిలా చరణం 2:

ఫలించె నేను కన్న కలలు తీయతీయగా సుఖాలలో శోలిపో హాయి హాయిగా ఫలించె నేను కన్న కలలు తీయతీయగా సుఖాలలో శోలిపో హాయి హాయిగా ఉయ్యాలలూగే నామది చిటారుకొమ్మలా నివాళి అందుకో ఈవేళ పండుగా సదా సుధా తరంగాల తేలిపోదమా ఓహొ ఓహొ నిన్నే కోరితి కుహుకుహు అనీ పాడితి ఆ హా హా . . .

7, ఫిబ్రవరి 2022, సోమవారం

Iddaru Mithrulu (1961) : Padavela Radhika Song Lyrics (పాడవేల రాధికా)

చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)

సాహిత్యం: శ్రీ శ్రీ

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు


పల్లవి :

ఆ... ఆ... ఆ... ఓ... ఓ... ఓ...
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక

చరణం : 1

ఈ వసంత యామినిలో... ఓ... ఈ వెన్నెల వెలుగులలో... ఓ... ఈ వసంత యామినిలో... ఓ... ఈ వెన్నెల వెలుగులలో... ఓ... జీవితమే పులకించగ... జీవితమే పులకించగ నీ వీణను సవరించి పాడవేల రాధికా...

చరణం : 2

గోపాలుడు నిను వలచి
నీ పాటను మది తలచి
ఈ వసంత యామినిలో... ఓ...
ఈ వెన్నెల వెలుగులలో... ఓ...
ఏ మూలనో పొంచి పొంచి...
ఏ మూలనో పొంచి పొంచి
వినుచున్నాడని యెంచి
పాడవేల రాధికా...

చరణం : 3

వేణుగానలోలుడు
నీ వీణామృదురవము వినీ
నీ వీణామృదురవము వినీ
ప్రియమారగ నినుచేరగ
దయచేసెడి శుభవే
వేణుగానలోలుడు

పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక

6, ఫిబ్రవరి 2022, ఆదివారం

Iddaru Mithrulu (1961) : Halo Halo O Ammayi Song Lyrics (హలో హలో ఓ అమ్మాయి)

చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)

సాహిత్యం: ఆరుద్ర

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు


పల్లవి:

హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి
ఒహో బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
ఆది నుంచి లోకంలో ఆడవారిది పైచేయి

చరణం 1:

నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరబాటు నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరబాటు
నాటికి నేటికీ మీకు అలవాటే... హలో హలో ఓ అమ్మాయి ఔను మీదే పైచేయి

చరణం 2:

బెట్టుచేసే మగవారి గుట్టు మాకూ తెలుసోయి
బెట్టుచేసే మగవారి గుట్టు మాకూ తెలుసోయి
మనసులో మమతలూ పైకి వేషాలూ... ఒహో బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
చరణం 3:

లడాయి చేసే స్త్రీజాతి రాకమానదు రాజీకి
లడాయి చేసే స్త్రీజాతి రాకమానదు రాజీకి
గెలుపు కోసం మగవారు గెలుపు కోసం పగవారు
కాళ్ళబేరాలాడకపోరు
ఒహో బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
ఆది నుంచి లోకంలో ఆడవారిది పైచేయి
హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి హలో హలో ఓ అమ్మాయి అందుకొనుమా నా గుడ్ బై

Iddaru Mithrulu (1961) : Kushi Kushiga Song Lyrics (ఖుషీఖుషీగా నవ్వుతూ )

చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)

సాహిత్యం: దాశరథి

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు


పల్లవి :

ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా ఓ... మేనాలోన ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీనా మేనాలోన ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీనా నింగి దాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనులవాడా చరణం : 1

ఓ... ఓహో చెలియా నీవు కూడ ఓ పెళ్ళి పల్లకి చూసుకో ఓహో చెలియా నీవు కూడ ఓ పెళ్ళి పల్లకి చూసుకో హాయిగొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో నే వెళితే మరి నీవు మజ్నూవవుతావూ... నే వెళితే మరి నీవు మజ్నూవవుతావూ... మజ్నూ నేనేతై ఓలైలా లోకమే చీకటైపోవునే మజ్నూ నేనేతై ఓలైలా లోకమే చీకటైపోవునే ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారుగా ఉందాములే నిషా కనులవాడా చరణం : 2

ఓ... ఆకాశంలో ఇంద్రధనసుపై ఆడుకొందుమా నేడే నీలినీలి మేఘాల రథముపై తేలిపోదుమీనాడే చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా నేను వీణనై నీవు నాదమై ఏకమవుదమా తీయగా ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారుగా ఉందాములే హమేషా మజాగా