3, జనవరి 2025, శుక్రవారం

Idi Katha Kaadu : Junior Junior Atu Itu Kaani Hrudayam Toti Song Lyrics (జూనియర్ జూనియర్ జూనియర్)

చిత్రం: ఇది కథ కాదు (1979)

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,రమోల

సంగీతం: ఎం.యస్. విశ్వనాథన్



పల్లవి:

జూనియర్ జూనియర్ జూనియర్
Yes Bossఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు
ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు
అటు ఇటు కానొక ఆటబొమ్మని తెలిసే ఎందుకు వలచేవు
అటు ఇటు కానొక ఆటబొమ్మనీ తెలిసే ఎందుకు వలచేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ
గడ్డిపోచా? నేనా? హి హి హి హి
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ.. ఒద్దిక నదితో కోరేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు
ఉందని ఎందుకు ఒప్పుకోరాదు
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు.. ఆటబొమ్మకు ఆశలు తెలుసు
ఇద్దరు ఒక్కటె ఎందుకు కారాదు.. అహా.. అహా.. అహా..
జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు

చరణం 1:

సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
నీ మొహమురా.. హి హి హి హి హి
సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని
తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని
నీటిని చూసి దాహమువేస్తే తేనె కోసం తేటి వస్తే
పాపం గీపం అనడం చాదస్తం
NO ITS MAD.. BUT IAM MAD
మోడుకూడా చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం
హ హ హ హ
WHAT పక పక పిక పిక....
జూనియర్.. జూనియర్.. జూనియర్..
ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు

చరణం 2:

చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
lOVE HAS NO SEASONS.. NOT EVEN REASONS..
SHUT UP...
చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు
ఎండా వాన కలిసొస్తాయి
వెలుగు చీకటి కలిసుంటాయి
జరగని వింతలు ఎన్నో జరిగాయి
ITS HIGHLY IDIOTIC.. NO BOSS IT IS FULLY ROMANTIC
పాట పాడెను ముద్దుల బొమ్మ
పక పక నవ్వేవెందులకమ్మా
మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా
హ హా.. హ.. హా..
మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా
ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి