Idi Katha Kaadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Idi Katha Kaadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జనవరి 2025, శుక్రవారం

Idi Katha Kaadu : Gaalikadupu Ledu Kadalikanthu Ledu Song Lyrics (గాలికదుపు లేదు.)

చిత్రం: ఇది కథ కాదు (1979)

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం: పి. సుశీల

సంగీతం: ఎం.యస్. విశ్వనాథన్


పల్లవి:

గాలికదుపు లేదు... కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
గాలికదుపు లేదు... కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

చరణం 1:

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో

తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేగకేది కట్టుబాటు
మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు

గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

చరణం 2:

ఓ తెమ్మెరా ఊపవే ఊహలా ఊయల నన్నూ
ఓ మల్లికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకూ
తల్లి మళ్ళి తరుణయ్యింది.. పూవు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచివేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముందీ

గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

Idi Katha Kaadu : Jola Paata Paadi Ooyalaoopana Song Lyrics (జోలపాట పాడి ఊయలూపనా )

చిత్రం: ఇది కథ కాదు (1979)

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం: పి. సుశీల

సంగీతం: ఎం.యస్. విశ్వనాథన్


పల్లవి: 

జోలపాట పాడి ఊయలూపనా 
నా జాలి కథను చెప్పి మేలుకొలపనా.. 
నా జాలి కథను చెప్పి మేలు కొలపనా.. 
జోలపాట పాడి ఊయలూపనా 
నా జాలి కథను చెప్పి మేలుకొలపనా.. 
నా జాలి కథన్ను చెప్పి మేలు కొలపనా 
పెళ్ళాడిన ఆ మగడు.. ప్రేమించిన ఈ ప్రియుడు 
పెళ్ళాడిన ఆ మగడు.. ప్రేమించిన ఈ ప్రియుడు 
వెళ్ళారు నన్ను విడచి.. వచ్చావు నువ్వు ఒడికి.. 
వచ్చావు నువ్వు ఒడికి 
జోలపాట పాడి ఊయలూపనా 
నా జాలి కథను చెప్పి మేలుకొలపనా.. 
నా జాలి కథను చెప్పి మేలు కొలపనా 

చరణం 1: 

చేసుకున్న బాసలన్ని చెరిగిపోయెను... 
నే రాసుకున్న విన్నపాలు చేరవాయెను 
చేసుకున్న బాసలన్ని చెరిగిపోయెను... 
నే రాసుకున్న విన్నపాలు చేరవాయెను 
ఆకసాన చీకటులే ఆవరించెనూ 
ఆశలన్ని విడిచి ఉన్న నేడు వెన్నెలొచ్చెను 
జోలపాట పాడి ఊయలూపనా 
నా జాలి కథను చెప్పి మేలుకొలపనా.. 
నా జాలి కథన్ను చెప్పి మేలు కొలపనా 

చరణం 2: 

మీరా మనసారా నాడు వలచెను గోపాలుని 
కోరిక నెర వేరక చేపట్టెను భూపాలుని 
మీరా మనసారా నాడువలచెను గోపాలుని 
కోరిక నెర వేరక చేపట్టెను భూపాలుని 
ఆ కథకు నా కథకు అదే పోలికా 
ఆ మీదట ఏమయినది చెప్పలేనికా 
జోలపాట పాడి ఊయలూపనా 
నా జాలి కథను చెప్పి మేలుకొలపనా.. 
నా జాలి కథన్ను చెప్పి మేలు కొలపనా 

చరణం 3: 

నల్లనయ్య నాడూదెను పిల్లనగ్రోవీ 
ఆమె పరవశించి పోయినదా గానము గ్రోలీ 
నల్లనయ్య నాడూదెను పిల్లనగ్రోవీ 
ఆమె పరవశించి పోయినదా గానము గ్రోలీ 
మరువరాని ఆ మురళి మరల మ్రోగెనూ 
ఆ మధుర గానమునకు బాబు నిదురపోయెనూ



Idi Katha Kaadu : Junior Junior Atu Itu Kaani Hrudayam Toti Song Lyrics (జూనియర్ జూనియర్ జూనియర్)

చిత్రం: ఇది కథ కాదు (1979)

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,రమోల

సంగీతం: ఎం.యస్. విశ్వనాథన్



పల్లవి:

జూనియర్ జూనియర్ జూనియర్
Yes Bossఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు
ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు
అటు ఇటు కానొక ఆటబొమ్మని తెలిసే ఎందుకు వలచేవు
అటు ఇటు కానొక ఆటబొమ్మనీ తెలిసే ఎందుకు వలచేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ
గడ్డిపోచా? నేనా? హి హి హి హి
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ.. ఒద్దిక నదితో కోరేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు
ఉందని ఎందుకు ఒప్పుకోరాదు
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు.. ఆటబొమ్మకు ఆశలు తెలుసు
ఇద్దరు ఒక్కటె ఎందుకు కారాదు.. అహా.. అహా.. అహా..
జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు

చరణం 1:

సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
నీ మొహమురా.. హి హి హి హి హి
సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని
తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని
నీటిని చూసి దాహమువేస్తే తేనె కోసం తేటి వస్తే
పాపం గీపం అనడం చాదస్తం
NO ITS MAD.. BUT IAM MAD
మోడుకూడా చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం
హ హ హ హ
WHAT పక పక పిక పిక....
జూనియర్.. జూనియర్.. జూనియర్..
ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు

చరణం 2:

చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
lOVE HAS NO SEASONS.. NOT EVEN REASONS..
SHUT UP...
చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు
ఎండా వాన కలిసొస్తాయి
వెలుగు చీకటి కలిసుంటాయి
జరగని వింతలు ఎన్నో జరిగాయి
ITS HIGHLY IDIOTIC.. NO BOSS IT IS FULLY ROMANTIC
పాట పాడెను ముద్దుల బొమ్మ
పక పక నవ్వేవెందులకమ్మా
మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా
హ హా.. హ.. హా..
మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా
ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు



Idi Katha Kaadu : Takadimitaka Dimitakadimi Song Lyrics (తకధిమితక ధిమితకధిమి)

చిత్రం: ఇది కథ కాదు (1979)

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: ఎం.యస్. విశ్వనాథన్


పల్లవి :  

కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్ 
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్
కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్
తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం
తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం
తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం 
కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  రపమ్‌పమ్


చరణం 1 :

ఈ లోకమొక ఆట స్థలము...  ఈ ఆట ఆడేది క్షణము
ఈ లోకమొక ఆట స్థలము...  ఈ ఆట ఆడేది క్షణము
ఆడించువాడెవ్వడైనా...  ఆడాలి ఈ కీలుబొమ్మ
ఆడించువాడెవ్వడైనా...  ఆడాలి ఈ కీలుబొమ్మ
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్థం
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్థం
తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం 

కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్


చరణం 2 :

వెళ్తారు వెళ్ళేటివాళ్ళు...  చెప్పేసెయ్ తుది వీడుకోలు
ఉంటారు ఋణమున్నవాళ్ళు...  వింటారు నీ గుండె రొదలు
కన్నీళ్ళ సెలయేళ్ళు కాకూడదు కళ్ళు
కలలన్నీ వెలుగొచ్చిన మెలుకువలో చెల్లు 

కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  రపమ్‌పమ్


చరణం 3 : 

ఏనాడు గెలిచింది వలపు...  తానోడుటే దాని గెలుపు
ఏనాడు గెలిచింది వలపు...  తానోడుటే దాని గెలుపు
గాయాన్ని మాన్పేది మరుపు...  ప్రాణాన్ని నిలిపేది రేపు
గాయాన్ని మాన్పేది మరుపు...  ప్రాణాన్ని నిలిపేది రేపు
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు

తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం

కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్
కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్

4, ఏప్రిల్ 2022, సోమవారం

Idi Katha Kaadu : Sarigamalu Galagalalu Song Lyrics

చిత్రం: ఇది కథ కాదు (1979)

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: ఎం.యస్. విశ్వనాథన్



సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ... ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము చెలికాలి మువ్వల గలగలలు చెలికాలి మువ్వల గలగలలు చెలికాని మురళిలో సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ... ఆవేశమున్నది ప్రతికళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో ఆవేశమున్నది ప్రతికళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో కదలీ కదలక కదిలించు కదలికలు కదలీ కదలక కదిలించు కదలికలు గంగా తరంగాల శృంగార డోలికలు సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ... ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము హృదయాలు కలవాలి ఒక శృతిలో బ్రతుకులు నడవాలి ఒక లయలో శృతిలయలొకటైన అనురాగ రాగాలు జతులై జతలైన నవరస భావాలు సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ... నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో రాధనై పలకనీ నీ మురళి రవళి పాదమై కదలనీ నీ నాట్య సరళిలో సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము అహాహా...ఆహాహా