25, జనవరి 2025, శనివారం

Illarikam : Ekkadi Dongalu Akkadane Gapchup Song Lyrics (ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌)

చిత్రం: ఇల్లరికం (1959)

సాహిత్యం: శ్రీ శ్రీ

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: తాతినేని చలపతి రావు



పల్లవి :

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎవరే పిలిచారు? నిన్నెవరే పిలిచారు
ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు? నిన్నెవరే పిలిచారు చాటుగా కనుచాటుగా చూడకే ఇటు చూడకే
పొదలలో.. పూ పొదలలో పొంచినా గాలించినా
పొదలలో.. పూ పొదలలో పొంచినా గాలించినా
కనులకు నే కనిపించనులే
ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు? నిన్నెవరే పిలిచారు
చరణం 1 :
నీడలో దోబూచిగా... ఆడకే తారాడకే
నీటిలో కోనేటిలో... చూడకే వెదుకాడకే
నీటిలో కోనేటిలో... చూడకే వెదుకాడకే
దాగుడు మూతలు చాలునులే ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు? నిన్నెవరే పిలిచారు
చరణం 2 :
వెదికినా నే దొరకనే... పిలిచినా నే పలుకనే
హృదయమే నా కొసగినా... ఎదుటనే కనిపింతునే
హృదయమే నా కొసగినా... ఎదుటనే కనిపింతునే
ఎన్నటికీ నిను వీడనులే...
ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌
ఎవరే పిలిచారు? నిన్నెవరే పిలిచారు
ఎవరే పిలిచారు? నిన్నెవరే పిలిచారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి