చిత్రం: ఇంద్రుడు-చంద్రుడు (1989)
రచన: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
సంగీతం: ఇళయ రాజా
పల్లవి:
కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకొచ్చాను
డిగ్రీల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను
రికార్డు డాన్సులో బ్రేకులేచేసి రికార్డు బ్రేకు చేశాను హోయ్
మైకేలు జాక్సన్ ని ఆ మైక్ టైసన్ ని గోదాట్లో తోసి వచ్చానూ..హోయ్
కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకొచ్చాను
డిగ్రీల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను
చరణం 1:
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు నా రంగి అరె మరదలు నా రంగి
చుక్కపూల తోటలో తనువుల తంప్పట్లలో
చుక్కపూల తోటలో తనువుల తంప్పట్లలో
మంచమేసి కలుపుకో మనసులు తీరంగా అహ మరిదివి సారంగా ఆఁ..
మావ లేనప్పుడు అత్తమ్మో.. నువ్వు రారాదా పోరాదా రత్తమ్మా..
రాజు లేనప్పుడు సారంగో.. నువ్వు రారాదా పోరాదా సారంగో
అహ రత్తమ్మో.. రత్తమ్మో.. రత్తమ్మా...
సారంగో.. సారంగో.. సారంగో...
కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకొచ్చాను
డిగ్రీల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను హు హు హొయ్
చరణం 2:
హాఁ బండెనక బండి కట్టి పదహారు బఅంద్లు కట్టి
అహ అహ అహ
బండెనక బండి కట్టి పదహారు బఅండ్లు కట్టి
నువ్ ఏడపోతావ్ మొగుడో నాజూకు సక్కనోడా
ధినకిట ధినకిట ధినకిట తకిట తకిట తక తాం
బంతెనక బంతి పెట్టి చేమంతి చెండు పట్టి
నీకాడికొస్తిని పిల్లో పిసరంత నడుము దానా
తకిడితకిడి తకిట తకిట తక తాం
పట్టు పట్టగలవా ఓ నరహరి పందిరేయగలవా
పట్టు పట్టగలవా ఓ నరహరి పందిరేయగలవా
పట్టు పట్టి నీ పంచెకు పైటకు ముళ్ళు పెట్టగలవా
అరె పట్టు పట్టగలనే నీ తొలకరి పండు కొట్టగలనే
పట్టు పట్టగలనే నీ తొలకరి పండు కొట్టగలనే
పట్టు పట్టి నే తాళి కట్టి ఓ ముద్దు పెట్టగలనే..ఎహేహే ఎహెహే...
కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకొచ్చాను
డిగ్రీల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను
రికార్డు డాన్సులో బ్రేకులేచేసి రికార్డు బ్రేకు చేశాను హోయ్
మైకేలు జాక్సన్ ని ఆ మైక్ టైసన్ ని గోదాట్లో తోసి వచ్చానూ..హోయ్
కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకొచ్చాను
డిగ్రీల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి