12, జనవరి 2025, ఆదివారం

Intinti Intinti Ramayanam : Intinti Intinti Ramayanam Song Lyrics (ఇంటింటి రామాయణం..)

చిత్రం: ఇంటింటి రామాయణం (1979)

సంగీతం: రాజన్ - నాగేంద్ర

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల



పల్లవి :

ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము.. విడిపోతే కల్లోలము
ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము.. విడిపోతే కల్లోలము
సీతమ్మ చిలకమ్మ.. రామయ్య గోరింక
వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం.. అహహ


చరణం 1 :

నీవుంటే నందనవనము.. లేకుంటే అశోకవనము
నీవుంటే నందనవనము.. లేకుంటే అశోకవనము
నీవాడే ఊసులన్ని రతనాల రాశులే
నీవుంటే పూలబాట.. లేకుంటే రాళ్ళబాట
నీవుంటే పూలబాట.. లేకుంటే రాళ్ళబాట
నీతోటి ఆశలన్ని సరసాల పాటలు.. ముత్యాల మూటలు

అల్లల్లే ఎహే ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
చిలకమ్మ గోరింక అ సిరిమల్లే అ పొదరినట
చిలకమ్మ గోరింక సిరిమల్లే పొదరింట నవ్వాలి నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి కలిసి కిలకిల నవ్వాలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం

చరణం 2 :

సరి అంచు చీరలు తెస్తా.. కవరింగు సరుకులు పెడతా
సరి అంచు చీరలు తెస్తా.. కవరింగు సరుకులు పెడతా
తెమ్మంటే మాయలేడి.. తేలేనే నిన్నొదిలి
ఓ ఓ ఓ ఓ ఒహొహొహొహొ హొయ్

మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
కీచులాడుకున్న నువ్వు రోషమొచ్చి పోకురా కలిసి మెలిసి ఉండరా
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం ఓయ్

చరణం 3 :

ఇల్లేకదా స్వర్గసీమ.. ఇద్దరిది చెరగని ప్రేమ
ఇల్లేకదా స్వర్గసీమ.. ఇద్దరిది చెరగని ప్రేమ
కలతలేని కాపురాన కలలన్ని పండాలి
అహహహహ మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మన ఇద్దరి పొందికచూసి ఈ లోకం మెచ్చాలి దీవెనలే ఇవ్వాలి

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
సీతమ్మ ... చిలకమ్మ రామయ్య... గోరింక 
వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం 
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి