Intinti Intinti Ramayanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Intinti Intinti Ramayanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జనవరి 2025, ఆదివారం

Intinti Intinti Ramayanam : Intinti Intinti Ramayanam Song Lyrics (ఇంటింటి రామాయణం..)

చిత్రం: ఇంటింటి రామాయణం (1979)

సంగీతం: రాజన్ - నాగేంద్ర

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల



పల్లవి :

ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము.. విడిపోతే కల్లోలము
ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము.. విడిపోతే కల్లోలము
సీతమ్మ చిలకమ్మ.. రామయ్య గోరింక
వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం.. అహహ


చరణం 1 :

నీవుంటే నందనవనము.. లేకుంటే అశోకవనము
నీవుంటే నందనవనము.. లేకుంటే అశోకవనము
నీవాడే ఊసులన్ని రతనాల రాశులే
నీవుంటే పూలబాట.. లేకుంటే రాళ్ళబాట
నీవుంటే పూలబాట.. లేకుంటే రాళ్ళబాట
నీతోటి ఆశలన్ని సరసాల పాటలు.. ముత్యాల మూటలు

అల్లల్లే ఎహే ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
చిలకమ్మ గోరింక అ సిరిమల్లే అ పొదరినట
చిలకమ్మ గోరింక సిరిమల్లే పొదరింట నవ్వాలి నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి కలిసి కిలకిల నవ్వాలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం

చరణం 2 :

సరి అంచు చీరలు తెస్తా.. కవరింగు సరుకులు పెడతా
సరి అంచు చీరలు తెస్తా.. కవరింగు సరుకులు పెడతా
తెమ్మంటే మాయలేడి.. తేలేనే నిన్నొదిలి
ఓ ఓ ఓ ఓ ఒహొహొహొహొ హొయ్

మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
కీచులాడుకున్న నువ్వు రోషమొచ్చి పోకురా కలిసి మెలిసి ఉండరా
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం ఓయ్

చరణం 3 :

ఇల్లేకదా స్వర్గసీమ.. ఇద్దరిది చెరగని ప్రేమ
ఇల్లేకదా స్వర్గసీమ.. ఇద్దరిది చెరగని ప్రేమ
కలతలేని కాపురాన కలలన్ని పండాలి
అహహహహ మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మన ఇద్దరి పొందికచూసి ఈ లోకం మెచ్చాలి దీవెనలే ఇవ్వాలి

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
సీతమ్మ ... చిలకమ్మ రామయ్య... గోరింక 
వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం 
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము

18, ఆగస్టు 2021, బుధవారం

Intinti Intinti Ramayanam : Veena Venuvaina Song Lyrics (వీణ వేణువైన సరిగమ విన్నావా...)

చిత్రం: ఇంటింటి రామాయణం (1979)

సంగీతం: రాజన్ - నాగేంద్ర

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి



పల్లవి :

వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..

చరణం 1 :

ఊపిరి తగిలిన వేళ .. నీ వొంపులు తిరిగిన వేళ ..
నా వీణ నీ వేణువే.. పలికే రాగమాల
ఆ...ఆ... ల ల లా....ఆ...
సోకులు రగిలిన వేళ ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ ..లో
తనువులో అణువణువున జరిగే రాసలీల
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..

చరణం 2 :

యెదలో అందం యెదుట .. యెదుటే వలచిన వనిత..
ఆ...ఆ... ల ల లా....ఆ...
కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే యువత ..
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
నీ రాకతొ నా తోటలో వెలసే వనదేవత..
నా పాటలొ నీ పల్లవే నవత నవ్య మమత

Intinti Intinti Ramayanam : Mallelu Poose Song Lyrics (మల్లెలు పూసే..)

చిత్రం: ఇంటింటి రామాయణం (1979)

సంగీతం: రాజన్ - నాగేంద్ర

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :

మల్లెలు పూసే..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా.. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా.. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా.. మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా.. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా..

చరణం 1 :

ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే.. నా తొలి మోజులే నీ విరజాజులై.. ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే.. నా తొలి మోజులే నీ విరజాజులై.. మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే.. కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలె.. మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా.. మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా.. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా..

చరణం 2 :

తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరి శయ్యకే ఆవిరి తీరగా.. తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరి శ య్యకే ఆవిరి తీరగా.. సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే యే తెర చాటునో ఆ చెర వీడగా.. అందిన పొందులోనే అందలేని విందులేయవే.. కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా.. మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా.. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా.. మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా.. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా..