25, జనవరి 2025, శనివారం

Jeevana Tarangalu : Puttina Roju Panduge Andariki Song Lyrics (పుట్టిన రోజు పండగే అందరికీ)

చిత్రం: జీవన తరంగాలు (1973)

సంగీతం: జె. వి. రాఘవులు

సాహిత్యం: సి.నారాయణరెడ్డి

గానం: పి. సుశీల



పల్లవి :

ఉమ్మ్.. ఉమ్మ్.. ఉమ్మ్.. ఉమ్మ్.. ఉమ్మ్.. ఉమ్మ్..
పుట్టిన రోజు పండగే అందరికీ
మరి..  పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
పుట్టిన రోజు పండగే అందరికీ
మరి.. పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి.. ఎందరికి.. ఎందరికి.. 

చరణం 1 :

కలిమికేమి వలసినంత వున్నా.. మనసు చెలిమి కొరకు చేయి సాచుతుంది
ఆ మనసే ఎంత పేదదైనా ..  అనురాగపు సిరులు పంచుతుంది
మమత కొరకు తపియించే జీవనం..
మమత కొరకు తపియించే జీవనం.. దైవ మందిరంలా పరమ పావనం... 
పుట్టిన రోజు పండగే అందరికీ..
మరి... పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి . . . . ఎందరికి. . ఎందరికి

చరణం 2 :

పువ్వెందుకు తీగపై పుడుతుంది?..  జడలోనో గుడిలోనో నిలవాలని
ముత్యమేల కడలిలో పుడుతుంది?.. ముచ్చటైన హారంలో మెరవాలని . . 
ప్రతి మనిషీ తన జన్మకు పరమార్థం తెలుసుకుని
తన కోసమే కాదు పరుల కొరకు బతకాలి
తన కోసమే కాదు పరుల కొరకు బతకాలి
తానున్నా లేకున్నా..  తానున్నా లేకున్నా తన పేరు మిగాలి         
పుట్టిన రోజు పండగే అందరికీ..
మరి..  పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి... ఎందరికి.. ఎందరికి.. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి