చిత్రం: జోకర్ (1993)
సాహిత్యం: గురుచరణ్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్.చిత్ర, మాల్గుడి శుభ
సంగీతం: వంశీ
పల్లవి:
దిందిన్న దిందిన్న దిన్నా దిన్నా
దిందిన్న దిందిన్న దిన్నా దిన్నా
రంగురంగుల రైలుబండి పరుగులెత్తి సాగితే
పచ్చరంగులో పోవాల సంధ్యరంగులో ఆగాల
పగలు రేయి ప్రయాణంలో రాగాలెన్నో తియ్యలా.. తన తీరం చేరి తీరాలా
బండిర పొగబండిరా దొరలెక్కే రైలుబండిరా దొరసానులెక్కే బండిరా
చరణం 1:
అనుకోకే నాలోన విలువిచ్చాను
నిను కోరి ఓ క్లాసు దిగి వచ్చాను
అందుకునే ఒక రోజు వుండీ వుంటది
అందుకనే మన మోజు పండి వుంటది
బహురూపధారికి బహుమానమియ్యనా
సాధించె రాగ వేళ సంధ్యారాగాల మాల
బండిర పొగబండిరా దొరలెక్కే రైలుబండిరా దొరసానులెక్కే బండిరా
రంగురంగుల రైలుబండి పరుగులెత్తి సాగితే
పచ్చరంగులో పోవాల సంధ్యరంగులో ఆగాల
పగలు రేయి ప్రయాణంలో రాగాలెన్నో తియ్యలా తన తీరం చేరి తీరాలా
బండిర పొగబండిరా దొరలెక్కే రైలుబండిరా దొరసానులెక్కే బండిరా
చరణం 2:
సుందరమా సుమధురమా మందగమనమా
మంజులమై సంచరించు మలయ పవనమా
చీకటిలో నీలి రంగు అద్దుకుంటూనే
వేకువలో ప్రేమ రంగు దిద్దుకుందామా
ఊహాగానాలతో లాలించే రాజుకి
సేవిస్తు వెయ్యాలిక జాజి జాపత్రిమాల
బండిర పొగబండిరా దొరలెక్కే రైలుబండిరా దొరసానులెక్కే బండిరా
రంగురంగుల రైలుబండి పరుగులెత్తి సాగితే
పచ్చరంగులో పోవాల సంధ్యరంగులో ఆగాల
పగలు రేయి ప్రయాణంలో రాగాలెన్నో తియ్యలా తన తీరం చేరి తీరాలా
బండిర పొగబండిరా దొరలెక్కే బండిరా దొరసానులెక్కే బండిరా
రంగురంగుల రైలుబండి పరుగులెత్తి సాగితే
పచ్చరంగులో పోవాల సంధ్యరంగులో ఆగాల
పగలు రేయి ప్రయాణంలో రాగాలెన్నో తియ్యలా తన తీరం చేరి తీరాలా
బండిర పొగబండిరా దొరలెక్కే రైలుబండిరా దొరసానులెక్కే బండిరా
బండిర పొగబండిరా దొరలెక్కే రైలుబండిరా దొరసానులెక్కే బండిరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి