17, జనవరి 2025, శుక్రవారం

Kanna Koduku : Devudicchina Varamuga Song Lyrics (దేవుడిచ్చిన వరముగా..)

చిత్రం : కన్నకొడుకు (1973)

గీత రచయిత : దాశరథి

నేపధ్య గానం: పి. సుశీల

సంగీతం : టి. చలపతిరావు



పల్లవి : 

దేవుడిచ్చిన వరముగా... కోటి నోముల ఫలముగా
ఇంటిలోని దివ్వెగా... కంటిలోని వెలుగుగా
చిన్ని నాన్నా నవ్వరా...  చిన్ని కృష్ణా నవ్వరా 
దేవుడిచ్చిన వరముగా... కోటి నోముల ఫలముగా

చరణం 1 :

నన్ను దోచిన దేవుడే... ఈ నాటిలో కరుణించెలే
కన్న కలలే నిజములై... నీ రూపమున కనిపించలే
బొసి నవ్వులు ఒలకబోసి... లోకమే  మరపించరా 
దేవుడిచ్చిన వరముగా... నా కోటి నోముల ఫలముగా   

చరణం 2 :

మామ ఆస్తిని మాకు చేర్చే... మంచి పాపా నవ్వవే
ఆదిలక్ష్మివి నీవేలే... మా ఆశలన్నీ తీర్చవే
గోపి బావను చేసుకోని...
గోపి బావను చేసుకోని...  కోటికే పడగెత్తవే  
   
దేవుడిచ్చిన వరముగా... నా కోటి నోముల ఫలముగా
ఇంటిలోని దివ్వెగా... కంటిలోని వెలుగుగా
చిన్ని నాన్నా నవ్వరా..చిన్ని గోపి నవ్వరా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి