చిత్రం : కన్నకొడుకు (1973)
గీత రచయిత : దాశరథి
నేపధ్య గానం: పి. సుశీల
సంగీతం : టి. చలపతిరావు
పల్లవి :
ఎన్నడైనా అనుకున్నానా... ఎప్పుడైనా కలగన్నానా
ఇంత చల్లని మనసు నీకుందనీ
ఆ మనసులో నాకెంతో చోటుందనీ
ఎన్నడైనా అనుకున్నానా...
చరణం 1 :
నీ చిరునవ్వుల నీడలలోన...మేడకడతాననీ
అల్లరిచేసే నీ చూపులతో... ఆడుకుంటాననీ
ఎవరికి అందని నీకౌగిలిలో... వాలిపోతాననీ
నీ రూపమునే నా కన్నులలో... దాచుకుంటాననీ..
ఎన్నడైనా అనుకున్నానా... ఎప్పుడైనా కలగన్నానా?
ఇంత చల్లని మనసు నీకుందనీ
ఆ మనసులో నాకెంతో చోటుందనీ
ఎన్నడైనా అనుకున్నానా..ఆ
చరణం 2 :
వలపులు చిందే నా గుండెలలో నిండివుంటావనీ
పెదవుల దాగిన గుసగుసలన్నీ తెలుసుకుంటావనీ
నా గుడిలోపల దైవము నీవై వెలుగుతుంటావనీ
విరిసే సొగసుల విరజాజులతో పూజ చేసేననీ..ఈ.. ఈ
ఎన్నడైనా అనుకున్నానా..ఎప్పుడైనా కలగన్నానా?
ఇంత చల్లని మనసు నీకుందనీ
ఆ మనసులో నాకెంతో చోటుందనీ
ఎన్నడైనా అనుకున్నానా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి