17, జనవరి 2025, శుక్రవారం

Kanna Koduku : Nenu Nenenaa Song Lyrics (నేను నేనేనా... )

చిత్రం : కన్నకొడుకు (1973)

గీత రచయిత : సి.నారాయణరెడ్డి

నేపధ్య గానం: పి. సుశీల

సంగీతం : టి. చలపతిరావు



పల్లవి : 

నేను నేనేనా... నువ్వు నువ్వేనా
నేను నేనేనా... నువ్వు నువ్వేనా
ఎక్కడికో... ఎక్కడికో
రెక్కవిప్పుకొని ఎగిరిపోతొంది హృదయం
చిక్కని చక్కని సుఖంలో... 
మునిగిపోతోంది దేహం... హాయ్  
నేను నేనేనా... నువ్వు నువ్వేనా    

చరణం 1 :

ఇదా మనిషి కోరుకొను..మైకం
ఇదా మనసు తీరగల..లోకం 
జిగేలు మంది..జీవితం
పకాలుమంది..యవ్వనం
జిగేలు మంది..జీవితం
పకాలుమంది..యవ్వనం
    
నేను నేనేనా... నువ్వు నువ్వేనా
ఎక్కడికో... ఎక్కడికో
రెక్కవిప్పుకొని ఎగిరిపోతొంది... హృదయం
చిక్కని చక్కని సుఖంలో... 
మునిగిపోతోంది దేహం..హా... 
నేను నేనేనా... నువ్వు నువ్వేనా 

చరణం 2 :

ఓహో యీ మత్తు... చాల గమ్మత్తు
ఊహూ ఊహూ... ఇంకేది మనకు వద్దు
నిషాలు గుండె నిండనీ...  ఇలాగె రేయి సాగనీ
నిషాలు గుండె నిండనీ... ఇలాగె రేయి సాగనీ 
నేను నేనేనా... నువ్వు నువ్వేనా
ఎక్కడికో... ఎక్కడికో
రెక్కవిప్పుకొని ఎగిరిపోతొంది... హృదయం
చిక్కని చక్కని... సుఖంలో
మునిగిపోతోంది దేహం...  హా... 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి