చిత్రం : కన్నకొడుకు (1973)
గీత రచయిత : సి.నారాయణరెడ్డి
నేపధ్య గానం: ఘంటసాల
సంగీతం : టి. చలపతిరావు
పల్లవి :
ఉన్నది నాకొక ఇల్లు... ఉన్నది నాకొక తల్లి
ఆ ఇల్లే బంగరు కోవెల... ఆ తల్లే చల్లని దేవతా

చరణం 1 :
చిన్నబాబుగారున్నారు... వెన్నపూసతో పెరిగారు

సరదాబాబుల సహవాసంలో... దారితప్పి పోతున్నారు
చేజారి పోతున్నారు

చరణం 2 :
పెద్దయ్యగారి పేరు చెప్పితే... పెద్దపులే భయపడుతుంది
ఛెళ్ళున కొరడా ఝళిపిస్తేనే... ఇల్లు దద్దరిల్లి పోతుంది
మా ఒళ్ళు హూనమైపోతుంది

చరణం 3 :
పాపమ్మలాంటి అత్తమ్మగారు... ప్రతి ఇంటిలోన వుంటారు
ఆయమ్మగారు మహమ్మారి తీరు... ఆయమ్మగారు మహమ్మారి తీరు
అన్నీ స్వాహా చేస్తారు... గుటకాయస్వాహా చేస్తారు
చరణం 4 :
అమ్మ అనే రెండక్షరాలలో... కోటి దేవతల వెలుగుంది
అమృత మనేది వుందంటే... అది అమ్మ మనసులోనే వుంది
మా అమ్మ మనసులోనే వుంది...
ఆ తల్లి చల్లని దీవెన చాలు... ఎందుకు వేయి వరాలు
ఇంకెందుకు వేయి వరాలు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి