17, జనవరి 2025, శుక్రవారం

Koduku Kodalu : Neekemi Telusu Song Lyrics (నీకేం తెలుసూ?...)

చిత్రం : కొడుకు కోడలు (1972)

గీత రచయిత : ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల, పి.సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్



పల్లవి :

నీకేం తెలుసూ?...  నిమ్మకాయ పులుసూ..

నీకేం తెలుసూ?... నిమ్మకాయ పులుసూ
నేనంటే నీకెందుకింత అలసు
నీకేం తెలుసూ?... నిమ్మకాయ పులుసూ..
నా వద్ద సాగదు నీ దురుసూ...
నీకేం తెలుసూ...   

చరణం 1 :

చేయాలి కోడలూ... మామగారి సేవలూ
అబ్బాయి మనసు...  మరమత్తులూ
భలే భలే గమ్మత్తులూ
వద్దు నీసేవలూ... వద్దు మరమత్తులూ
చాలమ్మ చాలు నీ అల్లరులూ
చాలు నీ అల్లరులూ...

అల్లర్లు ఎన్నాళ్ళు వేసేయ్ మూడుముళ్ళు..ఆహా
అల్లర్లు ఎన్నాళ్ళు వేసేయ్ మూడుముళ్ళు
ఆపైన ఆడాళ్ళు బుద్ధిమంతులు... ఎంతో బుధిమంతులు  
నీకేం తెలుసూ?
నీకేం తెలుసూ... నిమ్మకాయ పులుసూ
నావద్ద సాగదు... నీ దురుసూ
హా..నీకేం తెలుసూ

చరణం 2 :

మగువకు సిగ్గే సింగారము... మమతున్న మనసే బంగారము
మగువకు సిగ్గే సింగారము... మమతున్న మనసే బంగారము 
ఆ బంగారమొకరికె ఇచ్చేడి...
ఆ సంగతి తెలిసే అడిగేది... నేనడిగేది
నీకేం తెలుసూ?
నీకేం తెలుసూ... నిమ్మకాయ పులుసూ
నావద్ద సాగదు... నీ దురుసూ
హా..నీకేం తెలుసూ 

చరణం 3 :

వయసుంది సొగసుంది... వరసైన బావా నచ్చింది తీసుకోలేవా..
వయసుంటే చాలునా... సొగసుంటే తీరునా..హ్హా
అవి చెట్టు చేమకు లేవా..
చెట్టైన తీగను... చేపట్టి ఏలదా?
చెట్టైన తీగను... చేపట్టి ఏలదా?
ఆ పాటి మనసైన లేదా...
నీకాపాటి మనసైన లేదా? 
నీకేం తెలుసూ..?
నీకేం తెలుసూ...  ఆడదాని మనసు
నేనంటే నీకెందుకింత అలుసూ
నీకేం తెలుసు... అసలైన మనసు
నావద్ద సాగదు... నీ దురుసూ
నీకేం తెలుసూ..?
నీకేం తెలుసూ..?
నీకేం తెలుసూ..?
నీకూ..ఆ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి