Koduku Kodalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Koduku Kodalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జనవరి 2025, శుక్రవారం

Koduku Kodalu : Goppolla Chinnadi Song Lyrics (గొప్పోళ్ళ చిన్నది.)

చిత్రం : కొడుకు కోడలు (1972)

గీత రచయిత : ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల

సంగీతం : కె.వి. మహదేవన్



పల్లవి:

గొప్పోళ్ళ చిన్నది... గువ్వల్లే ఉన్నది
కొండమీది కోతల్లే... చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది...

చరణం 1:

నడుమెంత చిన్నదో... నడకంత చక్కంది
చూపెంత చురుకైందో... రూపంత సొగసైంది
నడుమెంత చిన్నదో... నడకంత చక్కంది
చూపెంత చురుకైందో... రూపంత సొగసైంది
మనిషేమో దుడుకైంది... వయసేమో ఉడుకైంది
మనిషేమో దుడుకైంది... వయసేమో ఉడుకైంది
మనసేలా ఉంటుందో... అది ఇస్తేనే తెలిసేది
గొప్పోళ్ళ చిన్నది... గువ్వల్లే ఉన్నది
కొండమీది కోతల్లే... చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది...

చరణం 2:

ఒంటరిగా వచ్చిందంటే... జంటకోసమై ఉంటుంది
పేచితో మొదలెట్టిందంటే... ప్రేమ పుట్టే ఉంటుంది
హ.. ప్రేమ పుట్టే ఉంటుంది
కొమ్మమీది దోరపండు... కోరుకుంటే చిక్కుతుందా
నాకు దక్కుతుందా..హ...హ..
కొమ్మమీది దోరపండు... కోరుకుంటే చిక్కుతుందా
కొమ్మ పట్టి గుంజితేనే కొంగులోకి పడుతుంది
గొప్పోళ్ళ చిన్నది... గువ్వల్లే ఉన్నది
కొండమీది కోతల్లే... చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది...

చరణం 3:

ఊరుకున్న కుర్రవాడ్ని... ఉడికించుకు పోతుంది
మాపటికి పాపమంత... వేపించుకు తింటుంది
ఒక్క చోట నిలువలేక... పక్క మీద ఉండలేక
ఆ టెక్కు నిక్కు తగ్గి... రేపిక్కడికే తానొస్తుంది
గొప్పోళ్ళ చిన్నది... గువ్వల్లే ఉన్నది
కొండమీది కోతల్లే... చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది...
లలలేలాలాలేలల... లలలేలాలాలేలల

Koduku Kodalu : Cheyi Cheyi Taggilindhi Song Lyrics (చేయి చేయి తగిలింది)

చిత్రం : కొడుకు కోడలు (1972)

గీత రచయిత : ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్



పల్లవి: 

చేయి చేయి తగిలింది...హాయి హాయిగా ఉంది 
పగలు రేయిగా మారింది....పరువం ఉరకలు వేసింది 
చేయి చేయి తగిలింది...హాయి హాయిగా ఉంది 
పగలు రేయిగా మారింది....పరువం ఉరకలు వేసింది 


చరణం 1: 

నా వలపే తలుపును తట్టిందీ... 
నా వలపే తలుపును తట్టిందీ... 
నీ మనసుకు మెలుకువ వచ్చింది... 
నీ వయసుకు గడియను తీసింది... 
నీ పిలుపే లోనికి రమ్మందీ... 
నీ పిలుపే లోనికి రమ్మందీ... 
నా బిడియం వాకిట ఆపింది 
నా సిగ్గే మొగ్గలు వేసింది... 
చేయి చేయి తగిలింది...హాయి హాయిగా ఉంది 
పగలు రేయిగా మారింది....పరువం ఉరకలు వేసింది 


చరణం 2: 

సిగ్గుతో నీవు నిలుచుంటే...నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే 
సిగ్గుతో నీవు నిలుచుంటే...నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే 
ఊపిరాడక నా మనసు...ఉక్కిరిబిక్కిరి అయ్యింది 
వాకిట నేను నిలుచుంటే ...ఆకలిగా నువు చూస్తుంటే 
వాకిట నేను నిలుచుంటే ...ఆకలిగా నువు చూస్తుంటే 
ఆశలు రేగి నా మనసు...అటు ఇటు గాక నలిగింది 
చేయి చేయి తగిలింది...హాయి హాయిగా ఉంది 
పగలు రేయిగా మారింది....పరువం ఉరకలు వేసింది 



చరణం 3: 


నీ చూపే మెత్తగ తాకింది... 
నీ చూపే మెత్తగ తాకింది....నా చుట్టూ మత్తును చల్లింది 
నిను చూస్తూ ఉంటే చాలంది.... 
నీ సొగసే నిలవేసింది.... 
నీ సొగసే నిలవేసింది.... 
నా మగసిరికే సరితూగింది....నా సగమును నీకు ఇమ్మంది 
లా..లా..లా..లా..లా.. 
చేయి చేయి తగిలింది...హాయి హాయిగా ఉంది 
పగలు రేయిగా మారింది....పరువం ఉరకలు వేసింది


Koduku Kodalu : Nuvvu Nenu Ekkamainamu Song Lyrics (నువ్వూ నేనూ ఏకమైనాము...)

చిత్రం : కొడుకు కోడలు (1972)

గీత రచయిత : ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల, ఎస్. జానకి

సంగీతం : కె.వి. మహదేవన్



పల్లవి:

నువ్వూ నేనూ ఏకమైనాము...
నువ్వూ నేనూ ఏకమైనాము...
ఇద్దరము...మనమిద్దరము ఒక లోకమైనామూ...
లోకమంతా ఏకమైనా వేరు కాలేము...వేరు కాలేము...
నువ్వూ నేనూ ఏకమైనాము....

చరణం 1:

కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ...
అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుంద్దాము...
కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ...
అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుంద్దాము...
పసిడి మనసులు పట్టెమంచం వేసుకుంద్దాము...ఊ..ఉ..
అందులో మన పడుచు కోర్కెల మల్లెపూలు పరుచుకుంద్దాము...ఊ..ఉ..
నువ్వూ నేనూ ఏకమైనాము....

చరణం 2:'

చెలిమితో ఒక చలువపందిరి వేసుకుంద్దాము...
కలల తీగల అల్లిబిల్లిగా అల్లుకుంద్దాము...ఊ..
ఆ అల్లికలను మన జీవితాలకు పోల్చుకుంద్దాము...
ఏ పొద్దు కానీ వాడిపోనీ పువ్వులవుద్దామూ...ఊ..ఊ..
నువ్వూ నేనూ ఏకమైనాము....

చరణం 3:

లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావూ...ఊ..
అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు...
లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావూ...ఊ..
అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు...
సూర్యచంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము...ఊ..ఊ..
అందులో ఈ సృష్టికెన్నడు లేని సొగసు మనము తెద్దాము...
నువ్వూ నేనూ ఏకమైనాము...
ఇద్దరము...మనమిద్దరము ఒక లోకమైనామూ...
లోకమంతా ఏకమైనా వేరు కాలేము...వేరు కాలేము...
నువ్వూ నేనూ ఏకమైనాము....ఆహ..హా..ఆహ..ఆహ..హా...


Koduku Kodalu : Naa Kante Chinnodu Song Lyrics (నాకంటే చిన్నోడు...)

చిత్రం : కొడుకు కోడలు (1972)

గీత రచయిత : ఆచార్య ఆత్రేయ

గానం: పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్


పల్లవి :

నాకంటే చిన్నోడు... నా తమ్ముడున్నాడు
నాకంటే చిన్నోడు... నా తమ్ముడున్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు... అల్లరల్లరీ బుల్లోడు
నిలదీసి అడిగితే... నీళ్ళునములుతున్నాడు
నాకంటే చిన్నోడు... నాతమ్ముడున్నాడు
నాకంటే చిన్నోడు... నాతమ్ముడున్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు... అల్లరల్లరీ బుల్లోడు
నిలదీసి అడిగితే... నీళ్ళునములుతున్నాడు
నాకంటే చిన్నోడు... నాతమ్ముడూన్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు

చరణం 1 :

పిల్లిలా వచ్చాడు... ప్రేమలో పడ్డాడు..ఓయ్
పిల్లిలా వచ్చాడు... ప్రేమలో పడ్డాడు
కల్లబొల్లి మాటలతో... కళ్ళలోకి పాకాడు
పిల్లిలా వచ్చాడు... ప్రేమలో పడ్డాడు
కల్లబొల్లి మాటలతో... కళ్ళలోకి పాకాడు
దమ్ములేని సోగ్గాడు... తమ్ముడిపై నెట్టాడు
దమ్ములేని సోగ్గాడు... తమ్ముడిపై నెట్టాడు
ఆ తమ్ముడే నచ్చాడంటే... ఈ అన్న ఏమౌతాడు

నాకంటే చిన్నోడు... నాతమ్ముడున్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు


చరణం 2 :

తమ్ముడేమో కొరకరాని గడుగ్గాయి
అన్నేమో చేతగాని వెంగళాయి
తమ్ముడేమో కొరకరాని గడుగ్గాయి
అన్నేమో చేతగాని వెంగళాయి
తెలివుంది అన్నకూ... కండబలముంది తమ్ముడికీ...
ఈ రెండు కావాలీ... హా
ఈ రెండు కావాలి...  దోర దోర అమ్మాయికి

నాకంటే చిన్నోడు... నాతమ్ముడున్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు

చరణం 3 :

గువ్వలాగున్నానా... కోతిననుకొన్నానా
పడుచుపిల్ల ఎదటున్న... చలికి వణుకుతున్నానా... హాయ్
గువ్వలాగున్నానా... కోతినను కొన్నానా
పడుచుపిల్ల ఎదటున్న... చలికి వణుకుతున్నానా
ఒంటరిగా వచ్చానూ... జంటనెదురు చూస్తున్నాను
ఒంటరిగా వచ్చానూ... జంటనెదురు చూస్తున్నాను
పసలేమి లేని వాడవనీ..మ్మ్ ..ఆశవదులు కొన్నాను 

నాకంటే చిన్నోడు... నా తమ్ముడున్నాడు
నాకంటే చిన్నోడు... నా తమ్ముడున్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు... అల్లరల్లరీ బుల్లోడు
నిలదీసి అడిగితే... నీళ్ళునములుతున్నాడు
నాకంటే చిన్నోడు... నా తమ్ముడున్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు
హేయ్... పిల్లగాడు..
హేయ్ హేయ్ పిల్లగాడు
హేయ్ హేయ్ పిల్లగాడు.
హేయ్ హేయ్ పిల్లగాడు
హేయ్ హేయ్ పిల్లగాడు.. 


Koduku Kodalu : Nelaku Asalu Song Lyrics (నేలకు ఆశలు చూపిందెవరో...)

చిత్రం : కొడుకు కోడలు (1972)

గీత రచయిత : ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల

సంగీతం : కె.వి. మహదేవన్



పల్లవి :

నేలకు ఆశలు చూపిందెవరో...
నింగికి చేరువ చేసిందెవరో...  
నేనెవరో నువ్వెవరో... నిన్ను నన్నూ కలిపిందెవరో 
నేనెవరో నువ్వెవరో...  నిన్ను నన్నూ కలిపిందెవరో
నేనెవరో...  నువ్వెవరో 

చరణం 1 :

ఈ రోజు నువ్వు... ఎదురు చూచిందే 
ఈ పాట నాకు... నువ్వు నేర్పిందే
ఈ సిగ్గెందుకు...నా ఎదుట
ఈ సిగ్గెందుకు...నా ఎదుట
ఆచిరు చెమటెందుకు... నీ నుదుట  
నేనెవరో నువ్వెవరో...  నిన్ను నన్నూ కలిపిందెవరో
నేనెవరో...  నువ్వెవరో 

చరణం 2 :

నేనడగకే నువ్వు.... మనసిచ్చావు
నీ అనుమతిలేకే.... నేనొచ్చాను 
మనసుకు తెలుసు ఎవ్వరిదో... తానెవ్వరిదో
మనసుకు తెలుసు ఎవ్వరిదో... తానెవ్వరిదో
అది ఋజువయ్యింది ఒద్దికలో... మన ఒద్దికలో
నేనెవరో నువ్వెవరో... నేనెవరో నువ్వెవరో
నిన్ను నన్నూ... కలిపిందెవరో

చరణం 3 :

ఏ జన్మమమత మిగిలి పోయిందో
ఈ జన్మ మనువుగా మనకు కుదిరిందీ
ఈ అనురాగానికి... తనివి లేదు
ఈ అనురాగానికి... తనివి లేదు
ఈ అనుబంధానికి... తుది లేదు 
నేనెవరో నువ్వెవరో... నిన్ను నన్నూ కలిపిందెవరో
నేనెవరో...  నువ్వెవరో...
నేనెవరో...  నువ్వెవరో


Koduku Kodalu : Idenannamata Song Lyrics (ఇదేనన్నమాట... )

చిత్రం : కొడుకు కోడలు (1972)

గీత రచయిత : ఆచార్య ఆత్రేయ

గానం: ఎస్. జానకి, పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్


పల్లవి :

ఇదేనన్నమాట... ఇది అదేనన్న మాట
మతి మతిలోలేకుంది... మనసేదో లాగుంది... అంటే... 
ఇదేనన్నమాట... ఇది అదేనన్న మాట
మతి మతిలోలేకుంది... మనసేదో లాగుంది... అంటే
ఇదేనన్నమాట... ఇది అదేనన్న మాట 

చరణం 1 :

ప్రేమంటే అదోరకం... పిచ్చన్న మాట
ఆ పిచ్చిలోనే  వెచ్చదనం... ఉన్నదన్నమాట
ప్రేమంటే అదోరకం... పిచ్చన్నమాట
ఆ పిచ్చిలోనే  వెచ్చదనం... ఉన్నదన్నమాట
మనసిస్తే మతి పొయిందన్నమాట
మనసిస్తే మతి పొయిందన్నమాట
మతిపోయే...  మత్తేదో... కమ్మునన్నమాట
ఇదేనన్నమాట..ఇది అదేనన్న మాట

చరణం 2 :

కొత్త కొత్త సొగసులు... మొగ్గ తొడుగుతున్నవి
అవి గుండెలో ఉండుండి..గుబులు రేపుతున్నవి
కొత్త కొత్త సొగసులు..మొగ్గ తొడుగుతున్నవి
అవి గుండెలో ఉండుండి..గుబులు రేపుతున్నవి
కుర్రతనం చేష్టలు... ముద్దులొలుకుతున్నవి
కుర్రతనం చేష్టలు... ముద్దులొలుకుతున్నవి
అవి కునుకురాని కళ్ళకు..హ్హ..కలలుగా వచ్చినవి
ఇదేనన్నమాట..ఇది అదేనన్న మాట

చరణం 3 :

ఆడదాని జీవితమే... అరిటాకు అన్నారు
అన్నవాళ్ళందరూ... అనురాగం కోరారు
ఆడదాని జీవితమే... అరిటాకు అన్నారు
అన్నవాళ్ళందరూ... అనురాగం కోరారు
తేటి ఎగిరిపోతుంది... పువ్వు మిగిలిపోతుంది
తేటి ఎగిరిపోతుంది... పువ్వు మిగిలిపోతుంది
తేనె వున్నసంగతే... తేటి గుర్తు చేస్తుంది
ఇదేనన్నమాట... ఇది అదేనన్న మాట 

చరణం 4 :

వలపే ఒక వేదనా... అది గెలిచిందా తీయనా...
ఆవలపే ఒక వేదనా... అది గెలిచిందా తీయనా... ఆ 
కన్నెబ్రతుకే ఒక శోధనా... కలలు పండిస్తే సాధనా..ఆ ఆ...
మనసు మెత్తపడుతుంది కన్నీటిలోనాఆ...
మమతల పంటకదే... తొలకరి వాన

ఇదేనన్నమాట... ఇది అదేనన్న మాట
మతి మతిలోలేకుంది... మనసేదో లాగుంది... అంటే
ఇదేనన్నమాట... ఇది అదేనన్న మాట 

Koduku Kodalu : Neekemi Telusu Song Lyrics (నీకేం తెలుసూ?...)

చిత్రం : కొడుకు కోడలు (1972)

గీత రచయిత : ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల, పి.సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్



పల్లవి :

నీకేం తెలుసూ?...  నిమ్మకాయ పులుసూ..

నీకేం తెలుసూ?... నిమ్మకాయ పులుసూ
నేనంటే నీకెందుకింత అలసు
నీకేం తెలుసూ?... నిమ్మకాయ పులుసూ..
నా వద్ద సాగదు నీ దురుసూ...
నీకేం తెలుసూ...   

చరణం 1 :

చేయాలి కోడలూ... మామగారి సేవలూ
అబ్బాయి మనసు...  మరమత్తులూ
భలే భలే గమ్మత్తులూ
వద్దు నీసేవలూ... వద్దు మరమత్తులూ
చాలమ్మ చాలు నీ అల్లరులూ
చాలు నీ అల్లరులూ...

అల్లర్లు ఎన్నాళ్ళు వేసేయ్ మూడుముళ్ళు..ఆహా
అల్లర్లు ఎన్నాళ్ళు వేసేయ్ మూడుముళ్ళు
ఆపైన ఆడాళ్ళు బుద్ధిమంతులు... ఎంతో బుధిమంతులు  
నీకేం తెలుసూ?
నీకేం తెలుసూ... నిమ్మకాయ పులుసూ
నావద్ద సాగదు... నీ దురుసూ
హా..నీకేం తెలుసూ

చరణం 2 :

మగువకు సిగ్గే సింగారము... మమతున్న మనసే బంగారము
మగువకు సిగ్గే సింగారము... మమతున్న మనసే బంగారము 
ఆ బంగారమొకరికె ఇచ్చేడి...
ఆ సంగతి తెలిసే అడిగేది... నేనడిగేది
నీకేం తెలుసూ?
నీకేం తెలుసూ... నిమ్మకాయ పులుసూ
నావద్ద సాగదు... నీ దురుసూ
హా..నీకేం తెలుసూ 

చరణం 3 :

వయసుంది సొగసుంది... వరసైన బావా నచ్చింది తీసుకోలేవా..
వయసుంటే చాలునా... సొగసుంటే తీరునా..హ్హా
అవి చెట్టు చేమకు లేవా..
చెట్టైన తీగను... చేపట్టి ఏలదా?
చెట్టైన తీగను... చేపట్టి ఏలదా?
ఆ పాటి మనసైన లేదా...
నీకాపాటి మనసైన లేదా? 
నీకేం తెలుసూ..?
నీకేం తెలుసూ...  ఆడదాని మనసు
నేనంటే నీకెందుకింత అలుసూ
నీకేం తెలుసు... అసలైన మనసు
నావద్ద సాగదు... నీ దురుసూ
నీకేం తెలుసూ..?
నీకేం తెలుసూ..?
నీకేం తెలుసూ..?
నీకూ..ఆ....