25, జనవరి 2025, శనివారం

Manchi Rojulu Vacchayi : Egire guvva emandi Song Lyrics (ఎగిరే గువ్వ ఏమంది)

చిత్రం: మంచి రోజు లొచ్చాయి (1972)

సంగీతం: తాతినేని చలపతిరావు

గీతరచయిత: సి. నారాయణ రెడ్డి

నేపధ్య గానం : పి. సుశీల


పల్లవి : చం... చం... చం... ల... ల... ల ఎగిరే గువ్వ ఏమంది? విసిరే గాలి ఏమంది? ప్రకృతిలోన స్వేచ్చకన్న మిన్నలేనే లేదంది ఎగిరే గువ్వ ఏమంది? ఏమంది?... ఓహో చరణం 1 :

పూలకెందుకు కలిగెనే ఈ ఘుమఘుమలు
ఈ మధురిమలు... డ డ ర డ డ ర డ డ
తీగ లెన్నడు నేర్చెనే ఈ అల్లికలు.. ఈ అమరికలు
స్వేచ్చ కోరే మనసు ఉంటే.. పొందలేనిది ఏముంది
ర ర ర ర ర ర రి...... ర ర ర ర ర ర ర
ఎగిరే గువ్వ ఏమంది? ఏమంది?.. ఓహో.. హో
చరణం 2 :
కోకిలెన్నడు నేర్చెనే ఈ సరిగమలు సరాగములు
డ డ ర డ డ ర డ డ
నెమలి కెవ్వరు నేర్పిరే ఈ లయగతులు ఈ స్వరజతులు
స్వేచ్చ కోరే మనసు ఉంటే నేర్వలేనిది ఏముంది

ఎగిరే గువ్వ ఏమంది? ఏమంది?.. ఓహో.. హో
చరణం 3 :
శిరసు వంచక నిలువనా గుడి గోపురమై గిరి శిఖరమునై
డ డ ర డ డ ర డ డ
అవధులన్నీ దాటనా ప్రభంజనమై జలపాతమునై
స్వేచ్చ కోరే మనసు నాది.. ఇంక నా కెదురేముంది
ర ర ర ర ర ర రి... ర ర ర ర ర ర ర..
ఎగిరే గువ్వ ఏమంది? విసిరే గాలి ఏమంది?
ప్రకృతిలోన స్వేచ్చకన్న మిన్నలేనే లేదంది
ఎగిరే గువ్వ ఏమంది? ఏమంది?... ఓహో
తా ర రా ర...... తా ర రా ర


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి