చిత్రం: మంచి రోజు లొచ్చాయి (1972)
సంగీతం: తాతినేని చలపతిరావు
గీతరచయిత: సి. నారాయణ రెడ్డి
నేపధ్య గానం : ఘంటసాల వెంకటేశ్వర రావు
నేలతో నీడ అన్నది ననుతాకరాదనీ పగటితో రేయన్నది ననుతా కరాదనీ నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది వేలి కోసలు తాకనిదే వీణ పాట పాడేనా చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా తల్లి తండ్రి ఒకరి నొకరు తాకనిదే నీవు లేవు నేను లేను నీవు లేవు నేను లేను లోకమే లేదు లే రవికిరణం తాకని దే నమకమలం విరిసే నా మధుపం తను తాకనిదే మందారం మురిసేనా మేనుమేను తాకనిదే మనసు మనసు కలవనిదే మ మత లేదూ మనిషి లేడు మమత లేదు మనిషి లేడు మనుగడ యే లేదులే
నేలతో నీడ అన్నది ననుతాకరాదనీ పగటితో రేయన్నది ననుతా కరాదనీ అంటరానితనము బంటరి తనము అనాదిగా మీజాతికి అదే మూలధనము ఒక సమ భావం సమధర్మం సహజీవనమనివార్యం తెలుసు కొను టె మీ ధర్మం తెలియకుంటె మీ ఖర్మం . నేలతోనీడ అన్నది ననుతాక రాదనీ పగటితో రేయన్నది ననుతాకరాదనీ నీరు తన్ను తాకరాదనీ గడ్డి పరక అన్నది. నేడు భర్తనే తాకరాదని హు హు హు హు ఒక భార్య అన్నది ఈ భార్య అన్నది.