23, జనవరి 2025, గురువారం

Naagu : Manchodu Anukunna Song Lyrics (మంచోడు అనుకున్నా అయ్యో రామా)

చిత్రం: నాగు (1984)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల

సంగీతం: చక్రవర్తి




పల్లవి :

మంచోడు అనుకున్నా అయ్యో రామా
గిచ్చాడే మెత్తగా కృష్ణా రామా
పెంచాడే పిల్లాడు నాలో ప్రేమా
పెంచాడే పిల్లాడు నాలో ప్రేమా
దించాడే కిందికి చందామామా
దించాడే కిందికి చందామామా అరే.. మంచోడ్నే లేవే నా మల్లెలకొమ్మా
ముద్దిస్తే ఏమాయే ముద్దుల గుమ్మా
పెంచేస్తా ఇంకాస్తా నీలో ప్రేమా
పెంచేస్తా ఇంకాస్తా నీలో ప్రేమా
ఇచ్చేస్తా నీకే నా చందామామా
అరే.. ఇచ్చేస్తా నీకే నా చందామామా మంచోడు అనుకున్నా అయ్యో రామా
అరే.. మంచోడ్నే లేవే నా మల్లెలకొమ్మా చరణం 1 :
తప్పమ్మ అప్పుడే తాకరాదు... తాళిబొట్టు కట్టకుండా తగలరాదు
తప్పమ్మ అప్పుడే తాకరాదు... తాళిబొట్టు కట్టకుండా తగలరాదు తప్పదే అప్పుడైన తాకకుండా... అప్పుడైన ఇప్పుడైన తగలకుండా
అందాక ఓర్చుకో బాగుగా.. అందంగా తీరుస్తా కోరికా
అందాక ఓర్చుకునే ఓపికే నాకుంటే ఇన్ని తిప్పలెందుకే ఇందువదన
రామారామా కృష్ణారామా... రామారామా కృష్ణారామా మంచోడు అనుకున్నా అయ్యో రామా
గిచ్చాడే మెత్తగా కృష్ణా రామా
పెంచేస్తా ఇంకాస్తా నీలో ప్రేమా
పెంచేస్తా ఇంకాస్తా నీలో ప్రేమా
ఇచ్చేస్తా నీకే నా చందామామా
అరే.. ఇచ్చేస్తా నీకే నా చందామామా
చరణం 2 :
నీ కంటి చూపుకే నెలలు నిండితే... నీ ప్రేమ ఘాటుకే పిల్లలు పుడితే
నీ కంటి చూపుకే నెలలు నిండితే... నీ ప్రేమ ఘాటుకే పిల్లలు పుడితే
అమ్మనైపోనా అయ్యో రామా.. అమ్మమ్మనై పోనా కృష్ణారామా నా చూపు దెబ్బకే సొమ్మసిల్లితే... నా చేతి వేడికే చెమ్మగిల్లితే
తాతనైపోనా అయ్యో భామా... ముత్తాతనై పోనా బామ్మా బామ్మ
రామారామా కృష్ణారామా... రామారామా కృష్ణారామా మంచోడు అనుకున్నా అయ్యో రామా
అరే... మంచోడ్నే లేవే నా మల్లెలకొమ్మా
పెంచాడే పిల్లాడు నాలో ప్రేమా
పెంచేస్తా ఇంకాస్తా నీలో ప్రేమా
దించాడే కిందికి చందమామా
ఇచ్చేస్తా నీకే నా చందామామా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి