23, జనవరి 2025, గురువారం

Naagu : Nannatukomaaku Song Lyrics (నన్నంటుకోమాకు చలిగాలి... )

చిత్రం: నాగు (1984)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల

సంగీతం: చక్రవర్తి

పల్లవి :

నన్నంటుకోమాకు చలిగాలి... హాయ్
నా ప్రేమ పెంచమాకు పిల్లగాలి..హోయ్..హోయ్..హోయ్
నన్నంటుకోమాకు చలిగాలి... నా ప్రేమ పెంచమాకు పిల్లగాలి
తగిలిందంటే తడిగాలి...
అబ్బాయి ఉండ లేక... అమ్మాయి గుండె వేడి అడగాలి నన్నంటుకోమాకు చలిగాలి... హ..హ..హా
నా ప్రేమ పెంచమాకు ప్రేమగాలి..హోయ్..హోయ్..హోయ్
నన్నంటుకోమాకు చలిగాలి... నా ప్రేమ పెంచమాకు ప్రేమగాలి
తగిలిందంటే తడిగాలి...
అబ్బాయి గుండెలోనా అమ్మాయి ఉండలేక ఒదగాలి
నన్నంటుకోమాకు చలిగాలి... నా ప్రేమ పెంచమాకు ప్రేమగాలి
చరణం 1 :

చిలిపి వాన దులిపే లేత వలపేదో నా కళ్ళలో
బులిపి చూపు నిలిపి చెయ్యి కలిపే కౌగిళ్లలోనా
చిలిపి వాన దులిపే లేత వలపేదో నా కళ్ళలో
బులిపి చూపు నిలిపి చెయ్యి కలిపే కౌగిళ్లలోనా
వానే వయసై తడిసే సొగసును కోరిందిలే కొంగు గొడుగు
కొంగే గొడవై పొంగే వరదను నేనెట్ట ఆపాలి కడకు
జల్లు ఎత్తుపోయింది జంకులన్నీ... ఇల్లు కట్టుకోమంది జంటచేరి
ఉన్న కొంప ముంచింది కొత్త కొంప ఇచ్చింది వానగాలి చరణం 2 :
మెరిసే మబ్బు కురిసే వాన వెలిసేనులే ఇప్పుడే
కలిసే జోడు కలిసే జంట విడిపోదు ఈ జన్మలో..
మెరిసే మబ్బు కురిసే వాన వెలిసేనులే ఇప్పుడే
కలిసే జోడు కలిసే జంట విడిపోదు ఈ జన్మలో..
నేనో మెరుపై నిన్నే ఒరిసిన ఒత్తిల్లలో ఉంది వలపు
నాలో ముసిరే ఎన్నో ముద్దుల సందిళ్లలో ఉంది ఉరుము
జంటలోన పుట్టింది గాలి వానా... చలిలోన చెలి తోడు నేను లేనా
హోయ్.. చీర కట్టు జారాక నిన్ను కట్టుకోమంది కొంటెగాలి
నన్నంటుకోమాకు చలిగాలి... నా ప్రేమ పెంచమాకు ప్రేమగాలి
తగిలిందంటే తడిగాలి...
అబ్బాయి గుండెలోనా అమ్మాయి ఉండలేక ఒదగాలి
నన్నంటుకోమాకు చలిగాలి... నా ప్రేమ పెంచమాకు ప్రేమగాలి
లలల్లాలలల్లల్లలాలలాలా... లలల్లాలలల్లల్లలాలలాలా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి