23, జనవరి 2025, గురువారం

Naagu : Mukku meeda kopam Song Lyrics (ముక్కు మీద కోపం ...)

చిత్రం: నాగు (1984)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల

సంగీతం: చక్రవర్తి


పల్లవి:
ముక్కు మీద కోపం ...అరే..ముట్టుకుంటే తాపం... అత్త మీద కోపాలు దుత్త మీద చూపిస్తుంటే .. ఎట్టాగమ్మ...ఇంకా ఎట్టాగమ్మా... ముద్దుగుమ్మ రూపం...అరే..ముట్టుకుంటే తాపం కొంగు మీద కోపాలు కోక మీద చూపిస్తుంటే... ఎట్టాగమ్మ...ఇంకా ఎట్టాగమ్మా... ముక్కు మీద కోపం ...ముట్టుకుంటే తాపం...హె..హె.. చరణం 1: మాపటేల మంచమేసుకుంద్దామంటే... మల్లెపువ్వు దీపమెట్టుకుంద్దామంటే.. అరే దగ్గరకొచ్చి...అక్కరతీర్చి వెళ్ళరాదా... చిచ్చులాంటి సిగ్గు అంటుకుంద్దామంటే.... చీకటింట చింత తీర్చుకుంద్దామంటే... అరే..పక్కకు చేరి పండగ ముద్దు తీర్చరాదా... కోపాలు లేత లేత కవ్వింతలు...తాపాలు రేపో మాపో రెండితలు... చలిగాలొచ్చి గిల్లాడు... సందెపొద్దు కొచ్చిపోవే వెచ్చనమ్మ..గోరువెచ్చనమ్మా.. ముక్కు మీద కోపం ...అరే..ముట్టుకుంటే తాపం... అరే...కొంగు మీద కోపాలు కోక మీద చూపిస్తుంటే... ఎట్టాగమ్మ...ఇంకా ఎట్టాగమ్మా... ముక్కు మీద కోపం ...అరే..ముట్టుకుంటే తాపం... చరణం 2: చందనాల ముద్దులిచ్చుకుంద్దామంటే... అరే..సన్నజాజి తేనే జల్లుకుంద్దామంటే... అరే మెత్తగ వచ్చి ..అడిగిందిచ్చి వెళ్లరాదా.... కాస్త ఆగ పొద్దుపుచ్చుకుంద్దామంటే... కౌగిలింతలిచ్చి పుచ్చుకుంద్దామంటే... అరే...ఆపరకొద్ది రేగిన దాహం తీర్చరాదా.. అందాలు ముందు పక్క మూడింతలు.. ఆపైన పక్కకొస్తే కొండతలు..... అలిగాడమ్మ పిల్లాడు... అల్లరింక ఆపుకోనే సింగారమా..లేత వయ్యారమా... ముద్దుగుమ్మ రూపం...అరే..ముట్టుకుంటే తాపం హే...కొంగు మీద కోపాలు కోక మీద చూపిస్తుంటే... ఎట్టాగమ్మ...ఇంకా ఎట్టాగమ్మా... ముక్కు మీద కోపం ...అరే...ముట్టుకుంటే తాపం.. అత్త మీద కోపాలు దుత్త మీద చూపిస్తుంటే... ఎట్టాగమ్మ...ఇంకా ఎట్టాగమ్మా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి