10, జనవరి 2025, శుక్రవారం

Ninne Pelladatha : Greeku Veerudu Song Lyrics (గ్రీకువీరుడూ..గ్రీకువీరుడూ)

చిత్రం: నిన్నే పెళ్లాడతా (1996)

సంగీతం: సందీప్ చౌతాలా

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: సౌమ్య


పల్లవి:

గ్రీకువీరుడూ..గ్రీకువీరుడూ
గ్రీకువీరుడూ నా రాకుమారుడూ కలల్లోనె ఇంకా ఉన్నాడూ 
ఫిలిం స్టార్ లు క్రికెట్ వీరులు కళ్ళుకుట్టి చూసే కుర్రాడూ 
డ్రీం బాయ్...
రూపులో చంద్రుడూ చూపులో సూర్యుడు 
డ్రీం బాయ్...
ఊరనీ పేరనీ జాడనే చెప్పడూ..ఏమి చెప్పనూ ఎలాగ చెప్పనూ...
ఎంత గొప్పవాడే నావాడూ..రెప్ప మూసినా ఏటైపు చూసినా
కళ్ళముందు వాడే ఉన్నాడూ..
ఎంతో...ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ...వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...

చరణం 1:

నడకలోని ఠీవి చూసి సింహమైన చిన్నపోదా..
నవ్వులోని తీరుచూసి చల్లగాలి కరిగిపోదా... 
స్టైల్ లో వాడంతా వాడు లేడూ..
నన్ను కోరినా మగాళ్ళు ఎవ్వరూ
నాకు నచ్చలేదే వాట్ టూ డూ 
నేను కోరినా ఏకైక పురుషుడూ..ఇక్కడే ఎక్కడో ఉన్నాడు
ఎంతో...ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ..
ఎందుకో...ఆకలీ నిద్దరా ఉండనే ఉండదే
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...

చరణం 2:

లోకమంత ఒక్కటైన లెక్కచేయనన్నవాడూ
కోరుకున్న ఆడపిల్ల కళ్ళముందు నిలవలేడూ
చూస్తా ఎన్నాళ్ళు దాగుతాడూ
కన్నె ఊహలో వుయ్యాలలూగుతూ..ఎంత అల్లరైనా చేస్తాడూ
ఉన్నపాటుగా కొర్రుక్కు తిననుగా ఎందుకంత దూరం ఉంటాడూ
ఎంతో...ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ...వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి