చిత్రం: నోము (1974)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల
సంగీతం: సత్యం
పల్లవి :
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా
పాలు పోసేము నోము నోచేము
మము చల్లగ చూడాలి నాగన్నా…
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా
నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా
పాలు పోసేము నోము నోచేము
మము చల్లగ చూడాలి నాగన్నా…
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా
చరణం 1 :
ఆ...ఆ...ఆ.పానకాలు చిమ్మిళ్ళు కానుక తెచ్చాము
ఆ...ఆ...ఆ...ముంగిట ముత్యాల ముగ్గులు పెట్టాము
భక్తితో నిను గూర్చి పాటలు పాడేము సిరిసంపదలిచ్చి మురిపించవయ్యా
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
చరణం 2 :
మల్లెలు తెచ్చామయ్య మల్లెల నాగేంద్రా
ఆ... చలిమిడి పెట్టామయ్య చల్లని నాగేంద్రా
కన్నెలము కొలిచేమయ్యా కరుణించవయ్యా అడిగిన వరమిచ్చి అలరించవయ్యా..
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
ఆ... చలిమిడి పెట్టామయ్య చల్లని నాగేంద్రా
కన్నెలము కొలిచేమయ్యా కరుణించవయ్యా అడిగిన వరమిచ్చి అలరించవయ్యా..
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి