Nomu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nomu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జనవరి 2025, గురువారం

Nomu : Chakkani daana song lyrics (చక్కని దానా నునుపు చెక్కిలి దానా)

చిత్రం: నోము (1974)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: సత్యం


పల్లవి :
ఏ..హే..హే..ఏహేహే..ఆహహ అహాహా..
మ్మ్హు మ్మ్హు అహా హా... హాయ్
చక్కని దానా నునుపు చెక్కిలి దానా
ఇంతలో బిడియమా..చెంతనే విరహమా
చక్కని దానా నునుపు చెక్కిలి దానా లాల్లలలాలలలలాలలలలా
ఏ హే హే ఏ హేహే హే...
చరణం:1
ఈ బిడియమే ఏ పడతికైనా పరమ సహజం
ఈ విరహమే నీ సరసనుంటే మధుర మధురం
తీగలా అల్లుకో తేనెలే అందుకో చక్కని దానా నునుపు చెక్కిలి దానా
ఇంతలో బిడియమా..చెంతనే విరహమా
చక్కని దానా..ఆ అ.. నునుపు చెక్కిలి దానా..ఆఅ చరణం:2

నీలోన కదలే రాగాసుధలే పంచుకోనా
నీలో కలిసి లోలో విరిసి నేనుండిపోనా
వుండిపో వుండిపో గుండెలో నిండిపో... చక్కని దానా నునుపు చెక్కిలి దానా
ఇంతలో బిడియమా..చెంతనే విరహమా..ఆహా..
చక్కని దానా..ఆ అ.. నునుపు చెక్కిలి దానా..ఆఅ

Nomu : Andari Daivam Song Lyrics (అందరి దైవం )

చిత్రం: నోము (1974)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: పి.సుశీల

సంగీతం: సత్యం


పల్లవి :
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా
పాలు పోసేము నోము నోచేము
మము చల్లగ చూడాలి నాగన్నా…
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా
చరణం 1 :

ఆ...ఆ...ఆ.పానకాలు చిమ్మిళ్ళు కానుక తెచ్చాము
ఆ...ఆ...ఆ...ముంగిట ముత్యాల ముగ్గులు పెట్టాము
భక్తితో నిను గూర్చి పాటలు పాడేము సిరిసంపదలిచ్చి మురిపించవయ్యా
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా

చరణం 2 :
మల్లెలు తెచ్చామయ్య మల్లెల నాగేంద్రా
ఆ... చలిమిడి పెట్టామయ్య చల్లని నాగేంద్రా
కన్నెలము కొలిచేమయ్యా కరుణించవయ్యా అడిగిన వరమిచ్చి అలరించవయ్యా..
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా
నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా
అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా

Nomu : Nomu pandinchava Swami Song Lyrics (నోము పండించవా స్వామీ.. )

చిత్రం: నోము (1974)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: ఎస్.జానకి

సంగీతం: సత్యం



పల్లవి :
నోము పండించవా స్వామీ.. నన్ను కరుణించ రావేమీ
నిను నమ్మితిరా.. నిను కొలిచితిరా.. అలక చాలించి పాలించవా నోము పండించవా స్వామీ నన్ను కరుణించ రావేమీ
నిను నమ్మితిరా.. నిను కొలిచితిరా..
అలక చాలించి పాలించవా.. నోము పండించవా స్వామీ చరణం 1 :
అనురాగ మొలికే అందాల రాజుకు ఇల్లాలుగా చేసినావు
ఏ వేళనైనా యే ఆపదైనా మమ్మెంతో కాపాడినావు
ఎడబాటు యెరుగని మా జంట నిపుడు
ఎడబాటు ఎరుగని మా జంట నిపుడు
ఎందుకు విడదీసినావు.. నీవూ ఎందుకు విడదీసినావు నోము పండించవా స్వామీ నన్ను కరుణించ రావేమీ
నిను నమ్మితిరా.. నిను కొలిచితిరా..
అలక చాలించి పాలించవా.. నోము పండించవా స్వామీ
చరణం 2 : ఆదిశేషుని అవతారం నీవైతే.. నేనింత కాలము నోచిన నోము నిజమైతే
ఆదిశేషుని అవతారం నీవైతే.. నేనింత కాలము నోచిన నోము నిజమైతే
దైవంగా నా పతినే నేను పూజిస్తే
దైవంగా నా పతినే నేను పూజిస్తే
నీ మహిమను చూపాలీ.. మా కాపురం నిలపాలీ
నిజం నిరూపించాలీ రావా .. దేవా !! రావా ! దేవా !!



Nomu : Thaka thaka Song Lyrics (తకతక.. తతతక)

చిత్రం: నోము (1974)

సాహిత్యం: ఆరుద్ర

గానం: ఎస్.జానకి

సంగీతం: సత్యం



పల్లవి :

తకతక.. తతతక
తకతక.. తతతక
తకతక.. తతత...
తకతక.. తతతక
తకతక.. తతతక
తకతక.. తతత...
జిగి బిగి సొగసరి పిలిస్తే.. అహ కాదని చెప్పకురా
మన గొడవలు బయటికి తెలిస్తే .. ఎహ్ ఖాతరు చెయకురా
నీతో ఉందిర తొందర పని నీకే తెలుసుర ఏమిటో అది ...
తకతక.. తతత..
తకతక.. తతత..
తకతక.. త..త...త..

చరణం : 1

చూడు గుసగుస లాడే మిసమిసలాడే సొంపులూ నీతో తకతకలాడే చకచకలాడే ఒంపులూ చూడు గుసగుస లాడే మిసమిసలాడే సొంపులూ నీతో తకతకలాడే చకచకలాడే ఒంపులూ రాజా.. ఎక్కెనా చక్కనీ నిషా.. రా రా చూపరా రేపు నీ పస జిగి బిగి సొగసరి పిలిస్తే అహ కాదని చెప్పకురా మన గొడవలు బయటికి తెలిస్తే ఎహ్ ఖాతరు చెయకురా తకతక.. తతత.. తకతక.. తతత.. తకతక.. త..త...త..

చరణం : 2

నాలో అణగని పొగరు వలపుల వగరు ఉందిరా
దానికి మనసులుకూడి కైపుల వాడిమందురా
నాలో అణగని పొగరు వలపుల వగరు ఉందిరా
దానికి మనసులుకూడి కైపుల వాడిమందురా
ఇదుగో ముద్దుగా ఇద్దరం ఉందాం.. ఇపుడే ఇక్కడే ఒక్కటైపోదాం జిగి బిగి సొగసరి పిలిస్తే.. అహ కాదని చెప్పకురా
మన గొడవలు బయటికి తెలిస్తే .. ఎహ్ ఖాతరు చెయకురా .. తకతక.. తతత..
తకతక.. తతత..
తకతక.. త..త...త..


5, ఏప్రిల్ 2022, మంగళవారం

Nomu : Manase Jathaga Paadindile Song Lyrics (మనసే జతగా పాడిందిలే)

చిత్రం: నోము (1974)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: సత్యం


పల్లవి:

మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో.......? మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో.......?

చరణం 1:

ఈ గిలిగింత సరికొత్త వింత ఏమన్నది? పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నది "2" హో.... అందుకే ఓ చెలి - అందుకో కౌగిలి.... ఓ చెలీ

మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే

చరణం 2:

నింగిని సాగే నీలాలమేఘం ఏమన్నది నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నది "2" హో.... అందుకే ఓ ప్రియా - అందుకో పయ్యెద ఓ ప్రియా

మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో.......? మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో.......?

29, మార్చి 2022, మంగళవారం

Nomu : Kalise Kallalona Song lyrics (కలిసే కళ్ళలో)

చిత్రం: నోము (1974)

సాహిత్యం: దాశరథి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: సత్యం



కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా విరిసెను ప్రేమలు హృదయానా కలిసే కళ్ళలోనాకురిసే పూల వానా విరిసెను ప్రేమలు హృదయానా కలిసే కళ్ళలోనా పెరిగీ తరిగేను నెలరాజూ వెలుగును నీ మోము ప్రతి రోజూ పెరిగీ తరిగేను నెలరాజూ వెలుగును నీ మోము ప్రతి రోజూ ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా విరిసెను ప్రేమలు హృదయానా కలిసే కళ్ళలోనా ఎదురుగ చెలికాణ్ణి చూసానూ ఎంతో పులకించి పోయానూ ఎదురుగ చెలికాణ్ణి చూసానూ ఎంతో పులకించి పోయానూ ఈ పొందు కలకాలం నే కోరేనూ కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా విరిసెను ప్రేమలు హృదయానా కలిసే కళ్ళలోనా కౌగిలి పిలిచేను ఎందుకనీ పెదవులు వణికేను దేనికనీ కౌగిలి పిలిచేను ఎందుకనీ పెదవులు వణికేను దేనికనీ మనలోని పరువాలు పెనవేయాలనీ కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా విరిసెను ప్రేమలు హృదయానా