26, జనవరి 2025, ఆదివారం

Preminchi Choodu (1965 ) : Preminchi Choodu Pilla Song Lyrics (ప్రేమించు చూడు పిల్లా... )

చిత్రం: ప్రేమించి చూడు (1965)

రచన:  ముళ్లపూడి వెంకటరమణ

గానం: ఘంటసాల

సంగీతం: మాస్టర్ వేణు




పల్లవి :

ప్రేమించు చూడు పిల్లా...  పెళ్ళాడుదాము మళ్ళా
ప్రేమించు చూడు పిల్లా...  పెళ్ళాడుదాము మళ్ళా
వయసున్న నాడు ఇలా దొరకలేదొకపిల్లా..
వయసున్న నాడు ఇలా దొరకలేదొకపిల్లా..
ప్రేమించు చూడుపిల్లా..ఆ ఆ ఆ ఆ ఆ

చరణం 1 :

పట్టెమంచమెక్కలేదు... పాలు పళ్ళు మెక్కలేదు..
నిన్ను చూసేదాకా... ప్రేమంటే తెలియలేదు
నిన్ను చూసేదాకా... ప్రేమంటే తెలియలేదు
ప్రేమంటే తెలియలేదు... 
ప్రేమించు చూడు పిల్లోయ్..పెళ్ళాడుదాము మళ్ళా

చరణం 2 :

ముగ్గు బుట్టాయే తల... ముడతపడే ముఖము ఇలా
ముగ్గు బుట్టాయే తల... ముడతపడే ముఖము ఇలా
పొద్దువాలిపోయే వేళ... పొత్తు కుదిరేనె పిల్లా
పొత్తు కుదిరేనె పిల్లా
ప్రేమించు చూడు పిల్లోయ్... పెళ్ళాడుదాము మళ్ళా

చరణం 3 :

కాయలో రుచి లేదే... పండులో పస లేదే..
దుక్కవలే దేహమున్నా... లెక్కేమె వయసైనా
లెక్కేమె వయసైనా..
అత్తగారి పోరులేదు...  మామగారి అదుపులేదు
అత్తగారి పోరులేదు...  మామగారి అదుపులేదు
ముసలాడే మొగుడైతే...  మురిపాలకు కొదువలేదు
మురిపాలకు కొదవ లేదు
ప్రేమించు చూడు పిల్లా..ఆ ఆ ఆ ఆ ఆ

చరణం 4 :

గడ్డాన్ని చూచి ఇంతా... కంగారు ఏల గుంటా
పైపైన చూడవద్దు... నాలోన మెరుగు కద్దూ..
పైపైన చూడవద్దు... నాలోన మెరుగు కద్దూ..
నాలోన మెరుగు కద్దూ..
మనసైన సోకుకాడే...  వయసున్న కుర్రవాడే..
మనసైన సోకుకాడే...  వయసున్న కుర్రవాడే..
సరి ఐన జోడు వీడే... మనువాడి చూడు నేడే
సరి ఐన జోడు వీడే... మనువాడి చూడు నేడే
మనసైన సోకుకాడే...  వయసున్న కుర్రవాడే..
లల్లాలి లాలలలా లల్లాలి లాలలలా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి