26, జనవరి 2025, ఆదివారం

Preminchi Choodu (1965 ) : Dorikeru Doragaru Song Lyrics (దొరికేరూ దొరగారు.. )

చిత్రం: ప్రేమించి చూడు (1965)

రచన:  శ్రీ శ్రీ

గానం: ఘంటసాల, పి.సుశీల

సంగీతం: మాస్టర్ వేణు



పల్లవి : 

దొరికేరూ దొరగారు.. ఇక నన్ను విడలేరు
దోచుకున్న వలపులు దాచలేరు... అమ్మమ్మ.. ఆ.. ఆ..
దొరికేరూ దొరగారు... ఇక నిన్ను విడబోరు
ఆశలన్నీ తీరేదాకా ఆగలేరు... అమ్మమ్మ.. ఆ.. ఆ.. 

చరణం 1 :

ఏ మాయ చేసినారో వీరు... నిలిచారు నా కంటిచూపులో
ఏ మాయ చేసినారో వీరు... నిలిచారు నా కంటిచూపులో
మాయ నీదే మర్మం నీదే... హాయి నాదే అమ్మమ్మ.. ఆ.. ఆ..

చరణం 2 :

అనురాగ మధువులు చల్లే.. ఓ మల్లే.. ఈ సిగ్గు నీకేలా.. ఆ.. ఆ..
అనురాగ మధువులు చల్లే.. ఓ మల్లే.. ఈ సిగ్గు నీకేలా
అందం అంతా తమదే కాదా...
తొందరేలా అమ్మమ్మ... ఆ.. ఆ..హోయ్
దొరికేరూ దొరగారు.. ఇక నన్ను విడలేరు
దోచుకున్న వలపులు దాచలేరు... అమ్మమ్మ.. ఆ.. ఆ..

చరణం 3 :

నీవాడనని చేరినంత... నన్నింత ఊరించనేలనే...
నీవాడనని చేరినంత... నన్నింత ఊరించనేలనే...

అందీ అందని అందంలో ఆనందం ఉందీ... 
అమ్మమ్మ.. ఆ.. ఆ.. హోయ్

చరణం 4 :

దొరగారిని దొంగంటేనే చాలా.. ప్రియురాలా.. బంధించరావేలా
దొరగారిని దొంగంటేనే చాలా.. ప్రియురాలా.. బంధించరావేలా
పారిపోయే దొంగైతేనే బంధించాలి...  అమ్మమ్మ... ఆ.. ఆ. హోయ్
దొరికేరూ దొరగారు.. ఇక నన్ను విడలేరు
దోచుకున్న వలపులు దాచలేరు... అమ్మమ్మ.. ఆ.. ఆ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి