చిత్రం: ప్రేమించి చూడు (1965)
రచన: దాశరధి
గానం: పి. బి. శ్రీనివాస్ , పి.సుశీల
సంగీతం: మాస్టర్ వేణు
పల్లవి:
ఓ...ఓ....ఓ...ఓ....ఓ...ఓ....
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ
చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ
చరణం 1:
చూపులతోనే మురిపించేవూ ..
చూపులతోనే మురిపించేవూ
ఆటలతోనే మరిపించేవూ..
ఆటలతోనే మరిపించేవూ
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా..
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా ...
పొరపాటైతే పలకనులే... పిలవనులే...
దొరకనులే.. ఊరించనులే...
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ...
నా మనసేమో పదమని సరేసరే
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ...
నా మనసేమో పదమని సరేసరే
చరణం 2:
నా మనసేమో పదమని సరే సరే..
మర్యాదేమో తగదని పదే పదే ..
మూడు ముళ్ళు పడనీ...
ఏడు అడుగులు నడవనీ ...
మూడు ముళ్ళు పడనీ
ఏడు అడుగులు నడవనీ
వాదాలెందుకులే అవుననినా..
కాదనినా..ఏమనినా.. నాదానివిలే...
చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ..
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ..
అహా...అహా..అహ..ఆ
చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ..
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ..
అహా...అహా..అహ..ఆ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి